Breaking News

పిల్లలో చురుకుదనాన్ని పెంచే ఆటలివే..!

Published on Fri, 04/26/2024 - 15:22

పిల్లలు పొద్దస్తమానం చదివితేనే అనేక విషయాలు తెలుస్తాయని, వారి పరిజ్ఞానం పెరుగుతుందని, వారు భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదుగుతారని సాధారణంగా తల్లిదండ్రులు అనుకుంటారు. అయితే పిల్లల మెదడు మరింత చురుగ్గా పనిచేయాలన్నా, ఏకాగ్రతతో, క్రమశిక్షణతో మెలగాలన్నా వారికి తగినంత శారీరక శ్రమ తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల ఆలోచనా శక్తికి, బుర్రకు పదును పెట్టే కొన్ని ఆటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

టెన్నిస్‌
పిల్లలు గానీ, పెద్దలు గానీ టెన్నిస్‌ ఆడితే అది శరీరానికి మంచి వ్యాయామం అవుతుంది. టెన్నిస్‌ ఆడినప్పుడు శరీరంలోని కండరాలన్నీ కదులుతాయి. శారీరక సామర్థ్యం మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా చురుకైన కంటి చూపు, వేగంగా లక్ష్యాన్ని చేరుకోవడం లాంటి లక్షణాలు అలవాటవుతాయి. దీంతో చురుగ్గా నిర్ణయాలు తీసుకునే తత్వం ఏర్పడుతుంది. ఎదుటివారి ఆలోచనలను అంచనావేయడం, సమయస్ఫూర్తి వంటివి పెంపొందుతాయి. 

బంతాట
బంతాట అంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. అయితే వారికి ఊరికే ఏదో బాల్ ఇచ్చి ఆడుకోమని వదిలేయకుండా, ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతో బాస్కెట్‌బాల్ రింగ్ తయారు చేసి, కొన్ని బంతులను వారికి ఇచ్చి, ఆడుకోమని చెప్పాలి. ఒక్కో బంతిని తీసి, ఆ రింగ్‌లో వేయమని వారికి  సూచించాలి. ఈ విధంగా చేయడం వల్ల పిల్లల్లో చేతికి, కళ్లకు మధ్య  సమన్వయం మరింత మెరుగవుతుంది. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. 

సైక్లింగ్‌
సైక్లింగ్‌ చేసేప్పుడు పిల్లలు కింద పడకుండా ప్రయత్నించే క్రమంలో బ్యాలెన్సింగ్‌ నైపుణ్యాలను చక్కగా నేర్చుకుంటారు. పోటీతత్వం, ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను చేరుకోవడం వంటివి సైక్లింగ్‌ సాయంతో మరింతగా తెలుసుకుంటారు. సైక్లింగ్‌ శరీరానికీ మంచి వ్యాయామం అని నిపుణులు చెబుతుంటారు. 

ఈత
చిన్నారులు క్రమశిక్షణతో మెలగాలంటే వారికి స్విమ్మింగ్‌ నేర్పించాలని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. స్విమ్మింగ్‌ మెదడును ఏకాగ్రతగా  ఉంచడంలో సహాయపడుతుంది. వేగంగా దూసుకెళ్లే తత్వాన్ని నేర్పిస్తూ, ఆత్మవిశ్వాసం పెరిగేలా చేస్తుంది. 

కరాటే, కుంగ్‌ ఫూ
కరాటే, కుంగ్‌ ఫూ మొదలైనవి శారీరక సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, వ్యక్తిగత క్రమశిక్షణ అలవడేలా చేస్తాయి. ఏకాగ్రత, అవతలివారిని గౌరవించడం, అవసరమైనప్పుడు తమని తాము కాపాడుకోవడం, పట్టుదల, మానసిక పరిపక్వత మొదలైన లక్షణాలెన్నో కరాటే, కుంగ్‌ ఫూ వలన అలవడుతాయి. 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)