Breaking News

అందాన్ని మరింత అందంగా మార్చే ఐదు పువ్వులు ఇవే..!

Published on Tue, 07/22/2025 - 16:31

పువ్వులాంటి కోమలమైన అందం కోసం పడుతులు ఎంతగానో తపిస్తుంటారు. ఎన్నో క్రీమ్‌లు, లోషన్లు తెగ విచ్చలవిడిగా రాసేస్తుంటారు. అయినా మంచి ఫలితం ఉండక బాధపడుతుంటారు. అలాంటి వారు తప్పక ఈ ఔషధగుణాలున్న ఈ ఐదు పువ్వులను తప్పక ఉపయోగించండని చెబుతున్నారు నిపుణులు. మరి ఆ పువ్వులేంటో సవివరంగా తెలుసుకుందామా..!.

చమోమిలే పువ్వులు
చమోమిలే పువ్వులు వడదెబ్బకు కమిలిన చర్మాన్ని అందంగా మార్చుతుంది. ఎర్రబడిన చర్మాన్ని నార్మల్‌ స్థితికి తీసుకువస్తుంది. అలాగే చర్మం రంగుని కూడా కాంతిమంతంగా మారుస్తుంది. హానికరమైన యూవీ కిరణాలకు గురయ్యి..సన్‌బర్న్‌ తరుచుగా ఎదురవ్వుతుంది చాలామందికి. 

అలాంటి వారికి తాజా చమోమిలే టీ చక్కటి ఉపశమనం. అంతేగాదు చిన్న కాటన్‌ ప్యాడ్‌, లేదా టవల్‌ని ఆ లిక్విడ్‌లో ముంచి ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

విచ్ హాజెల్
విచ్ హాజెల్ పువ్వులను తోటలో సులభంగా పెంచవచ్చు, ఇది చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ పువ్వులు మొటిమలతో పోరాడటమే కాకుండా సహజ ఆస్ట్రింజెంట్‌గా కూడా పనిచేస్తాయి. ఇది చర్మ కణాలు, రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. జిడ్డుని తొలగించి, మొటిమల సమస్యను నివారిస్తుంది.

కలేన్ద్యులా
"గెండే కా ఫూల్" అని కూడా పిలిచే అద్భుతమైన వైద్యం. ఇది  యాంటీ బాక్టీరియల్ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది చర్మ రంధ్రాలను, జుట్టుపై ఉండే బ్యాక్టీరియా, ఫంగస్‌ని తొలగించి శుభ్రంగా ఉంచుతుంది. 

అనేక సౌందర్య సాధనాల్లో ఈ కలేన్ద్యులా పువ్వుని ఉపయోగిస్తారు. నల్లమచ్చలు, ఎరుపుని తగ్గించి, మృదువైన ఆకృతిని అందిస్తుంది.

మందార
పెద్ద పెద్ద ఎర్రటి మందార పువ్వులు చర్మం, జుట్టు సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తాయి. మందారలో యాంటీ ఆక్సిడెంట్లు, ఆంధోసైనోసైడ్లు పుష్కలంగా ఉంటాయి. చర్మ రంధ్రాలను బిగుతుగా చేసి, రాడికల్‌ నష్టాన్ని నివారిస్తుంది. వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. మందారలోని అధిక ఆస్ట్రిజెంట్‌ లక్షణం అధిక నూనె స్రావాన్ని నియంత్రించి, రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. 

జాస్మిన్
చర్మంపై ఉండే వాపు, ఎరురంగు, చికాకుని నివారిస్తుంది. మొటిమల తాలుకు మచ్చలను కూడా తొలగిస్తుంది. యాంటీఏజింగ్‌ ప్రయోజనాలను కలిగి ఉంది. అలాగే యూవీ కిరణాలను, కాలుష్యం వంటి సమస్యల నుంచి రక్షించచేలా యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది అకాల వృద్ధాప్య సమస్యను నివారస్తుంది. జాస్మిన్ క్రీమ్ లేదా నూనె  అనేక నొప్పులను, తిమ్మిరుల నుంచి మంచి ఉపశమనం ఇస్తుంది. 

అలాగే ముఖంపై ఉండే గాయలు, కోతలకు చక్కటి క్రిమిసంహార మందులా ప్రభావవంతంగా పనిచేస్తుంది. చివరగా సహజసిద్ధమైన అందం కోసం రోజూ చూసే ఈ ఐదు మొక్కలతో అందాన్ని మరింత అందంగా మార్చుకోవచ్చు. పైగా ఇవి సహజసిద్ధమైన యాంటీ ఏజింగ్‌ ప్రయోజనాలను అందిస్తుంది.

(చదవండి: A2 నెయ్యి' అంటే..? దీనికి మాములు నెయ్యికి తేడా ఏంటంటే..)

 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)