Breaking News

వధువు కావలెను!

Published on Thu, 08/20/2026 - 10:56

ఆకుపచ్చని తోరణాలు.. మంగళవాయిద్యాల సడి.. ముహూర్తాల శ్రావణ మాసం వచ్చేసింది. ఇళ్లలో పెళ్లి బాజాలు మోగాల్సిన సమయం ఆసన్నమైంది. కానీ, ఎంతోమంది పెళ్లికొడుకుల ఇళ్లలో మాత్రం ఒకటే టెన్షన్‌.. అదే ‘వధువు కావలెను!’.

వైఎస్‌ఆర్‌ జిల్లా : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా పెళ్లికూతుళ్లకు తీవ్ర కొరత ఏర్పడింది. ఏ ప్రాంతానికి వెళ్లినా, ఏ కులంలో చూసినా ‘అమ్మాయి దొరకడం లేదు’ అనే మాటే బలంగా వినిపిస్తోంది. చేతిలో మంచి ఉద్యోగం, ఎకరాల ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ పెళ్లీడుకొచ్చిన అబ్బాయిలకు వధువు దొరకడం గగనమైపోతోంది.  శ్రావణ మాసం ముహూర్తాల సీజన్‌ ప్రారంభమై కళ్యాణ మండపాలన్నీ హౌస్‌ఫుల్‌ అవుతున్నా.. వధువు దొరకని వేలాది మంది మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ మాత్రం ఈ సీజన్‌లోనైనా తమ మురిపెం తీరుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.  

సామాజిక మాధ్యమాలే వేదికగా.. 
సాంప్రదాయ మార్గాల్లో సంబంధాలు దొరక్కపోవడంతో చాలామంది అబ్బాయిలు ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌ గ్రూపుల వంటి సామాజిక మాధ్యమాలను కూడా వేదికగా చేసుకుని ప్రకటనలు ఇస్తున్నారు. తమ ఫోటోలు, ఉద్యోగం, జీతం వివరాలతో పోస్టులు పెడుతూ ‘వధువు కావలెను’ అంటూ బహిరంగంగానే అన్వేషణ సాగిస్తున్నారు. 

ఎదురు కట్నానికి సిద్ధం.. ఏ కులమైనా ఓకే! 
వరకట్న వేధింపులు, ఆంక్షలే ఒకప్పుడు సమాజంలో ఆడపిల్లల జనాభా తగ్గడానికి ప్రధాన కారణమయ్యాయి. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. ఒకప్పుడు వరకట్నం కోసం డిమాండ్‌ చేసిన అబ్బాయిల తల్లిదండ్రులు, ఇప్పుడు రూట్‌ మార్చి ‘అమ్మాయి దొరికితే చాలు’ అంటూ అమ్మాయి తరపు వారికి ఎదురుకట్నం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని కులాల్లో ఆడ పిల్లల కొరత మరీ తీవ్రంగా ఉండటంతో చాలా మంది పెళ్లికాని ప్రసాదులుగా మిగిలిపోతున్నారు. ఈ క్రమంలో ‘అమ్మాయి నచ్చితే చాలు.. ఏ కులమైనా సరే చేసుకుంటాం’ అంటూ చాలా కుటుంబాలు తమ కుల నిబంధనలను సైతం పూర్తిగా సడలిస్తుండటం గమనార్హం.  

వెబ్‌సైట్లలో వేలాది రిజి్రస్టేషన్లు! 
ఈ పెళ్లికూతుళ్లకు కొరత మ్యారేజ్‌ బ్యూరోలకు మాత్రం చేతినిండా పని కల్పిస్తోంది. సంప్రదాయ మార్గాలతో పాటు ఇప్పుడు డిజిటల్‌ వేదికలు సైతం తోడయ్యాయి. వివాహ సంబంధాల కోసం మ్యారేజ్‌ బ్యూరోలు ప్రత్యేకంగా వెబ్‌సైట్లను ప్రారంభించాయి. దీంతో అబ్బాయిలకు ఎలాంటి అమ్మాయిలు కావాలో.. వారి అభిప్రాయాలు, చదువు, ఉద్యోగం, కుటుంబ నేపథ్యాల వివరాలను వెబ్‌సైట్లలో ఉంచుతున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కావడంతో ఈ వివాహ పరిచయ వేదికలకు గిరాకీ విపరీతంగా పెరిగింది.  

సాఫ్ట్‌వేర్‌ బాబులకూ తప్పని తిప్పలు.. 
ప్రస్తుతం పట్టణాల్లో ఉండి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు లేదా ఐటీ రంగంలో నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తున్న అబ్బాయిలకు కూడా వధువు దొరకడం గగనంగా మారింది. నేటి తరం చదువుకున్న అమ్మాయిలు  జీతం మాత్రమే కాకుండా.. అబ్బాయి ప్రవర్తన, అల వాట్లు, కుటుంబ నేపథ్యం, పట్టణంలో సొంత ఇల్లు ఉందా? లేదా? వంటి కఠిన నిబంధనలు విధిస్తుండటంతో వేలాది ప్రొఫైల్స్‌ హోల్డ్‌లో ఉండిపోతున్నాయి.  

వ్యవసాయం చేసేవారికి చుక్కలు! 
ఈ డిజిటల్‌ యుగంలో పల్లెటూళ్లలో ఉంటూ ఎకరా భూమి ఖరీదు కోట్లల్లో ఉన్నప్పటికీ.. కేవలం ‘వ్యవసాయం’ చేస్తున్నాడనే ఒకే ఒక్క కారణంతో అబ్బాయి లను తీవ్రంగా తిరస్కరిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ‘పెళ్లికాని ప్రసాదుల’ సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతోంది.  

సరిహద్దుల వైపు చూపు! 
కొన్ని జిల్లాలలో స్థానికంగా అమ్మాయిలు దొరక్కపోవడంతో.. అబ్బాయిల తల్లిదండ్రులు పొరుగు రాష్ట్రాల సరిహద్దు పల్లెటూళ్ల వైపు చూస్తున్నారు. భాషా సమస్యలు ఉన్నప్పటికీ, పెళ్లి కావడం ముఖ్యమనే ఉద్దేశంతో  సరిహద్దు రాష్ట్రాల గ్రామాల్లోని అమ్మాయిలతో సంబంధాలు ఖాయం చేసుకుంటున్నారు.  

 

 

Videos

ఏపీ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి

Watch Live: హైదరాబాద్ లో జగన్ జనసంద్రం

భారత సైన్యం దెబ్బ.. మంచు కొండల్లో చైనాకు దిమ్మతిరిగే షాక్!

ఇది సార్ మా బ్రాండ్.. రాకాలో హాలీవుడ్ నటుడు..?

ఐయామ్ Gen-Z అంటూ ఆర్మీ పై రెచ్చిపోయిన యువతీ

బాబు కొత్త కుట్రలు.. YS అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు

టీడీపీ కార్యకర్త కీచకత్వం.. 8 ఏళ్ల బాలికకు వేధింపులు

TDP నేతకు బిగ్ షాక్

బాబు ఇంట్లో డైనింగ్ టేబుళ్లు పగిలిపోతాయి... నువ్వు ఎవడివి నాపై CBI వేయడానికి..!

YS అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు..

Photos

+5

‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్‌...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా?

+5

నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు)

+5

‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : హైటెక్స్‌లో హిమ్‌టెక్స్‌ ప్రదర్శన (ఫొటోలు)

+5

స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు)

+5

చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు)

+5

చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు)

+5

విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్‌లో విపరీతమైన రద్దీ (ఫొటోలు)

+5

నటి మాళవిక శర్మ గ్లామర్ ఫోటోలు వైరల్

+5

'అమీర్ లోగ్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)