Breaking News

అక్కడ న్యూ ఇయర్‌ ఎలా జరుగుతుందంటే..!

Published on Sun, 04/13/2025 - 13:13

నూతన సంవత్సరం వచ్చిందంటే ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం సర్వసాధారణం. కాని, థాయిలాండ్‌లో మాత్రం న్యూ ఇయర్‌ వచ్చిందంటే నీటి యుద్ధమే జరుగుతుంది. అయితే ఇది కొట్లాట కాదు, నీటి కోలాటం. ప్రత్యేకమైన థాయ్‌ సంప్రదాయ నృత్యాలతో, రంగురంగుల నీళ్లతో ఈ పండుగ సాగుతుంది. 

జనాలంతా రోడ్ల మీదకు వచ్చి, ఒకరికొకరు తెలిసినా తెలియకపోయినా ఒకరిపై ఒకరు నీళ్లు పోసుకుంటూ న్యూ ఇయర్‌ వేడుకను జరుపుకుంటారు. ఈ వాటర్‌ ఫైట్‌ ఫెస్టివల్‌ని స్థానికంగా ‘సాంగ్‌క్రాన్‌’ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 13 నుంచి 15 వరకు వరుసగా మూడు రోజులు

ఈ సంబరాలు జరుగుతుంటాయి. ఈ ఉత్సవాల్లో ఏనుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మావటుల సమక్షంలో వాటి తొండాలతో నీళ్లను జల్లుతూ ఆశీర్వదిస్తాయి.ఈ వేడుక సనాతన ఆచారం నుంచి ఉద్భవించిందని చెబుతారు. ఆ మూడు రోజులను, పాపాలను కడుక్కోవడానికి నదీస్నానం చేసే మతపరమైన రోజులుగా భావిస్తారు. 

వృద్ధులు, వైకల్యంతో ఉన్నవారి కోసం తమ కుటుంబ సభ్యులు నది నుంచి నీటిని తెచ్చి వారిపై పోస్తారు. అయితే ప్రతిఒక్కరూ మొదటిగా బుద్ధుడిపై నీళ్లు పోసి, నమస్కరించి, ఈ వేడుకలో పాల్గొంటారు. నీళ్లతో అరిష్టాలు కొట్టుకుపోతాయని, నూతన వైభవం తిరిగి వస్తుందని విశ్వసిస్తారు.

ప్రతిసంవత్సరం సాంగ్‌క్రాన్‌  వేడుకకు కొన్ని రోజుల ముందు, దేవుడు భూమిపైకి వస్తాడని అక్కడివారు నమ్ముతారు. వచ్చేముందు దేవుడు తన చేత్తో ఆయుధాన్ని తెస్తే యుద్ధం వస్తుందని, కాగడాను తెస్తే కరువు వస్తుందని ఇలా కొన్ని లెక్కలు కట్టి, మత పూజారులు జోస్యం చెబుతారు. 

దాని బట్టే జరగబోయే ప్రమాదాలను ఆపాలని ప్రజలంతా దేవుణ్ణి పూజిస్తారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్, చియాంగ్‌ మై, ఫుకెట్‌ వంటి ప్రముఖ పట్టణాల్లో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వాటర్‌ గన్‌లతో, బకెట్స్‌తో నీళ్లను జిమ్ముతూ అక్కడి ప్రజలంతా ఈ మూడురోజులు చాలా ఆనందంగా గడుపుతారు. 

(చదవండి: మునకానందం..మహదారోగ్యం..!)

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)