Breaking News

థాయ్‌ వెర్షన్‌ రామాయణం

Published on Mon, 01/27/2025 - 11:22

ఇతిహాసాన్ని శక్తివంతమైన కథగా చెప్పడం, సాంస్కృతిక నేపధ్యంతో దానిని సజీవంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కళాకారుడికి అత్యంత సాహసోపైతమైన చర్య.  దీనిని థాయ్‌లాండ్‌ కళాకారులు మన ఇతిహాసాన్ని  తమ సంప్రదాయ కళారూపంతో మన దేశ రాజధానిలో ప్రదర్శించనున్నారు. 

భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి సహకారంతో రాయల్‌ థాయ్‌ ఎంబసీ ఖోన్‌ థాయ్‌ మాస్క్‌డ్‌ డ్యాన్స్‌ డ్రామాను న్యూఢిల్లీలో నిర్వహించనుంది. ఈ గ్రాండ్‌ ఈవెంట్‌ ఫిబ్రవరి 7, 2025న సాయంత్రం 6:30 గంటలకు డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లోని భీమ్‌ హాల్‌లో జరుగుతుంది.

థాయిలాండ్‌ అత్యంత గౌరవనీయమైన కళారూపాలలో ఒకటైన ఖోన్, శాస్త్రీయ నృత్యం, లిరికల్‌ స్టోరీ టెల్లింగ్, ప్రత్యక్ష సాంప్రదాయ థాయ్‌ సంగీతాన్ని మిళితం చేస్తుంది. యునెస్కో చేత  సాంస్కృతిక వారసత్వంగా గుర్తించబడింది. దుస్తులు, కొరియోగ్రఫీ, ఆధ్యాత్మిక వ్యక్తీకరణ ఈ నృత్యం ప్రత్యేకతలు. 

వారియర్‌ హనుమాన్‌
ఈ ప్రదర్శనలో రామాయణం ఇతిహాసం నుండి హనుమాన్‌ ది మైటీ వారియర్‌ అనే ఎపిసోడ్‌ ఉంటుంది, ఇది హనుమంతుడి శౌర్యం, విధేయతను చూపే ఆకర్షణీయమైన కథ. ఈ కథ ఐదు దశలలో.. రావణుడిని ఓడించాలనే తపనతో రాముడికి సేవ చేయడానికి వాయు దేవుడు సృష్టించిన హనుమంతుడి దివ్య జననంతో ప్రారంభమవుతుంది. 

కథ ముందుకు సాగుతున్న కొద్దీ, హనుమంతుడి బాల్య దుశ్చర్య, రాముడి ఆశీర్వాదంతో అతని బలం తిరిగి వస్తుంది. సీతను రక్షించడానికి అతని అచంచలమైన నిబద్ధతను ఇది అన్వేషిస్తుంది. హనుమంతుడు, రాముడు వారి మిత్రులు రావణుడిపై విజయం సాధించే యుద్ధంతో కథనం ముగుస్తుంది.  

చారిత్రక సంబంధాలు
ఖోన్‌ థాయిలాండ్‌ రాజ ప్రాంగణాలలో భారతీయ ఇతిహాసం రామాయణంతో గల సంబంధం భారతదేశం– థాయిలాండ్‌ మధ్య గల లోతైన చారిత్రక సంబంధాలను తెలియజేస్తుంది. దీంతో పాటు తమ కళ ద్వారా వ్యక్తీకరణ హావభావాలు, శక్తివంతమైన కథ చెప్పడం తరతరాలుగా అందించిన గొప్ప సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి. ఇది థాయ్‌ వారసత్వంలో ఒక ప్రతిష్టాత్మక అంశంగా మారుతుంది. 

భారతీయ ప్రేక్షకులకు థాయిలాండ్‌ సాంస్కృతిక వారసత్వం గొప్పతనాన్ని చూపిస్తుంది. ఇది ఉమ్మడి వారసత్వం, కళాత్మకత, రామకీన్, రామాయణ ఇతిహాసాల ద్వారా ప్రతిధ్వనించే భక్తి, శౌర్యం, సార్వత్రిక ఇతివృత్తాల వేడుక. రాయల్‌ థాయ్‌ ఎంబసీ, ఐసీసీఆర్‌ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రెండు దేశాల మధ్య సాంస్కృతిక వారధిగా పనిచేస్తుంది. 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)