Breaking News

మూస ధోరణికి భిన్నంగా..

Published on Fri, 03/21/2025 - 17:18

ఒక జాతి సంస్కృతి తెలుసుకోవాలంటే.. ఆ జాతి ఏర్పాటు చేసుకున్న రంగస్థలమేంటో తెలుసుకుంటే సరిపోతుందంటారు సామాజికవేత్తలు. తెలుగు జాతి సంస్కృతి, సంప్రదాయాలు, సమకాలీన సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో చూపడంలో రంగస్థలం అత్యంత ప్రధానమైంది. నలభయ్యేళ్లుగా ప్రవాహంలా సాగిపోతున్న నాటక రంగానికి తమవంతు బాధ్యతగా దశాదిశ చూపే ప్రయత్నం చేస్తున్నారు మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు (Thorrur) ప్రాంత కళాకారులు.

తొర్రూరు ప్రాంతానికి చెందిన చైతన్య కళా సమాఖ్య ప్రతినిధులు 1985 నుంచి నాటక రంగానికి జీవం పోస్తున్నారు. నాటక ప్రదర్శనల్లో.. తెలుగు రాష్ట్రాల్లోనే చైతన్య కళా సమాఖ్య మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 200 పైచిలుకు నాటక ప్రదర్శనలకు అవకాశమిచ్చిన కళా సమాఖ్య.. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ గుర్తింపు పొందుతోంది.  

ఆదర్శం.. చైతన్య కళా సమాఖ్య నాటక సేవ 
మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో 1985లో మన్నూరు ఉమ బృందం చైతన్య కళా సమాఖ్యను స్థాపించింది. అప్పటినుంచి సమాఖ్య 40 ఏళ్లుగా కళా రంగానికి తన వంతు సేవ చేస్తోంది. ఏటా మార్చిలో వారం రోజుల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ జాతీయ తెలుగు ఆహ్వాన నాటికల పోటీల్లో.. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక నాటక సంఘాలు ప్రదర్శనలిచ్చాయి. హైదరాబాద్, కరీంనగర్, గుంటూరు కళాకారులు నాటకాలను ప్రదర్శించారు. ఈ కళా సమితి వేదికపై ప్రదర్శనలు ఇచ్చి పలువురు గుర్తింపు పొందారు.  

మూస ధోరణికి భిన్నంగా.. 
1980 వరకు గ్రామాల్లో, పట్టణాల్లో పండుగల సందర్భాల్లో నాటకాలను ప్రదర్శిస్తుండేవారు. వాటికి విపరీతమైన ఆదరణ ఉండేది. ఒకప్పుడు వెలుగొందిన ఈ కళ.. నేడు సినిమా, టీవీల ప్రభావంతో మసకబారుతోంది. ప్రస్తుతం నాటక ప్రదర్శనలకు పెద్దలు మినహా నేటితరం యువత రావడం లేదు. ఇలాగే కొనసాగితే తెలుగు నాటకం (Telugu Natakam) మసకబారే ప్రమాదముందని భావించిన తొర్రూరు చైతన్య కళా సమాఖ్య కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ఉత్తమ నాటకాలను ఎంచుకుని ప్రదర్శనలకు ఆహ్వానిస్తోంది. పోటీకి వచ్చిన నాటికల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి నగదు బహుమతులు అందజేస్తోంది. ఉత్తమ నటులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది.

చ‌ద‌వండి: దేవాల‌యాల్లో రావి, వేప చెట్లు ఎందుకు ఉంటాయి?

నాటక వారసత్వాన్ని కొనసాగించాలని.. 
ప్రస్తుతం టీవీ, సినిమాలు చూస్తే.. వాటిలో ఎలాంటి సందేశం ఉండటం లేదు. కానీ నాటకాలను తిలకించినప్పుడు.. అందులోని పాత్రలు, సారాంశం నిజ జీవితానికి అద్దం పట్టేలా ఉంటాయి. నాటకాల వారసత్వాన్ని నేటి తరానికి అందించే లక్ష్యంతో చైతన్య కళా సమాఖ్య ఏటా పోటీలు నిర్వహిస్తోంది. కళా సమాఖ్య ద్వారా తొర్రూరులో మా వంతుగా కళా రంగాభివృద్ధికి కృషి చేస్తున్నాం. 
– మన్నూరు ఉమ, అధ్యక్షుడు, చైతన్య కళా సమాఖ్య, తొర్రూరు

నాటకానికి జవసత్వాలు నింపాలి  
ప్రాచీన కళలు అంతరించి పోకుండా ఐక్యంగా కృషి చేయాలి. నాటక పోటీల ద్వారా ఈ రంగానికి జవసత్వాలు నిండాలన్నదే మా ఆకాంక్ష. ఇటీవల తొర్రూరులో నిర్వహించిన జాతీయ స్థాయి తెలుగు ఆహ్వానిత నాటక పోటీలకు ఎన్నడూ లేనంత ఆదరణ లభించింది. ప్రేక్షకులు నాటకాలు వీక్షించేందుకు గంటల తరబడి కుర్చీలకే అతుక్కుపోయారు. రానున్న రోజుల్లోనూ నాటక ప్రదర్శనలు కొనసాగిస్తాం. 
– సుంకరనేని పినాకపాణి, ప్రధాన కార్యదర్శి, చైతన్య కళా సమాఖ్య 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)