Breaking News

చిన్నారులు జంక్‌ ఫుడ్‌ తినకుండా..ఆ టీచర్‌ ట్రిక్‌ మాములుగా లేదు!

Published on Sun, 09/13/2026 - 12:26

ఈ జనరేషన్‌ చిన్నారులు మాములుగా లేరు. జట్‌ స్పీడ్‌గా అర్థం చేసుకుంటున్నారు. చిన్నప్పుడే స్మార్ట్‌ ఫోన్‌లు, ఐఫోన్‌లనే చకచక​ వాడేస్తున్న జెన్‌జీ ఇది. అయితే అందుకు తగ్గట్టుగానే ఈకాలంలో మార్కెట్లోకి వస్తున్న ప్రతి జంక్‌ఫుడ్‌కి ఆకర్షితులై ఎంతలా లాగిస్తున్నారో తెలిసిందే. వద్దు నాన్న అవి మంచివి కావు అంటే..ఇక వాళ్లు పెట్టే అల్లరి మాములుగా ఉండదు. ఇక తట్టుకోలేక తల్లిదండ్రలు కొనిచ్చేస్తున్నారు. ఏదో అప్పడప్పుడే అంటూ ఇస్తుంటారు. 

అయితే అసలు అలాంటి అనారోగ్యకరమైన జంక్‌ఫుడ్‌కి వాళ్లే స్వయంగా నో చెప్పేలా చేస్తోంది ఈ టీచర్‌. ఆ ఉపాధ్యాయురాలు చేసిన పనికి ఆ స్కూల్‌ విద్యార్థులు వద్దంటూ ఏడుపు లంఖించుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడమే కాదు, జంక్‌ ఫుడ్‌ తికుండా ఉండేలా చేసేందుకు ఇంతల భయపెట్టడం సమంజసమేనా అనే ప్రశ్నలు లేవనెత్తినా..చాలామంది ఆ టీచర్‌ ట్రిక్‌కే మద్దతు పలకడం విశేషం.

ఇంతకీ ఆమె ఏం చేసిదంటే..
జంక్‌ ఫుడ్‌ వల్ల కలిగే ప్రమాదాల గురించి పిల్లలకు తెలియజేసేలా ముందుగా వాళ్లకు కొద్దిగా కూల్‌డ్రింక్‌ల, బిస్కెట్లు ఇస్తుంది. ఆ తర్వాత వాళ్లలో ఒకళ్లను పడుకోబెట్టి అవి తిన్నాక లోపల ఏం జరుగుతోందో తెలియజేలా నకిలీ అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ని చూపిస్తుంది. వాటిని చూసి పిల్లలు భయపడటమే కాదు, తినమని అనడం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. ముఖ్యంగా వాళ్ల ముఖాల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది. 

ఆరోగ్యకరమై ఆహారం గురించి తరగతి గదిలో వివరించిన ఆ పాఠం వాళ్లు జంక్‌ఫుడ్‌ ఎంత అనారోగ్యకరమైనదో వివరించేలా క్లియర్‌గా చూపించారామె. ఇది పిల్లల్లో భయం రేకెత్తించిన చెడు ఆహారపు అలవాట్లకు బానికాకుండా చేసే బెస్ట్‌ ట్రిక్‌ అనే చెప్పొచ్చు. అయితే ఈ భయం వాళ్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఎలాంటి పర్యవసనాలు దారితీస్తుంది అని మానసిక నిపుణులు హెచ్చరించినా..నయానో, భయానో అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉండేలా చేయడంలో ఎలాంటి తప్పు లేదని మరికొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 

ఇదీ చదవండి: వారానికి 60 గంటలు పనిచేస్తూ..నెలకు రూ. 63 లక్షలు!

 

Videos

ఎన్నికలకు ముందు ఒకరోజు జగన్ దగ్గరకి నేను పేర్ని నాని వెళ్లి... ఈ వీడియో చూస్తే చాలు

పండుగ రోజు గుడ్ న్యూస్ క్రీడాకారులకు జగన్ అభినందనలు

దుబాయ్ కి జంప్.? బయటపడ్డ NANDUS WORLD సీక్రెట్ స్కెచ్..!

ఫ్రీ హోల్డ్ భూముల పేరుతో కూటమి రైతుల జీవితాలతో చెలగాటం

కావాలని మహిళా బైకర్ ను ఢీ కొట్టిన కారు వైరల్ అవుతున్న వీడియో

యూపీలోని ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

అర్థరాత్రి పోలీస్ స్టేషన్ లోనే తన్నుకున్న TDP తమ్ముళ్లు

3లక్షల అమెరికన్ డైమండ్స్ తో గణపతి.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే

రఘు మాస్టర్ ని కలిశా నన్నే అన్ని చూసుకోమన్నారు

గంభీర్ సంచలన నిర్ణయం.. అభిషేక్ ఔట్ టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే

Photos

+5

హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)

+5

'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఆషికా.. బార్బీ డాల్‌కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)

+5

అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఫ్యాన్స్‌ ఫైట్‌ చేస్తుంటే.. స్టార్స్‌ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)

+5

ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి (ఫోటోలు)

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)