Breaking News

టీ లవర్స్‌ : టీ మంచిదా? కాదా? ఎఫ్‌డీఏ గ్రీన్‌ సిగ్నల్‌ ఇదిగో!

Published on Mon, 12/23/2024 - 12:06

ఉదయం నిద్రలేచింది మొదలు గొంతులో  రాత్రి పడుకునేదాకా కాసిన్ని  ‘టీ’ నీళ్లు పడితే తప్ప ఏ పనీ జరగదు చాలామందికి.  బ్లాక్‌టీ, హెర్బల్‌ టీ, మసాలా టీ,  లెమన్‌ టీ, హనీ టీ..ఇలా  ఏదో ఒక‘టీ’ పడాల్సిందే. తాజాగా టీకు  సంబంధించిన ఒక మంచి వార్త ముఖ్యమైన  ఆరోగ్య నియంత్రణ ఏజెన్సీ అందించింది . అదేంటంటే..టీ ఆరోగ్యకరమైనదే అని యూఎస్ ఎఫ్‌డీఏ  టీకి  సర్టిఫికెట్‌ ఇచ్చింది.  టీ హెల్దీ డ్రింకా కాదా అనే అంశంపై తన తుది నిర్ణయాన్ని డిసెంబరు 19న ప్రకటించింది.ఈ నిర్ణయం టీ ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించి ప్రపంచ టీ పరిశ్రమ  వాదనలను ధృవీకరిస్తుందంటూ  ఆనందం వెల్లువెత్తింది.

అయితే ఇది కామెల్లియా సినెన్సిస్ (తేయాకు) నుండి తీసుకోబడిన టీకి మాత్రమే వర్తిస్తుందని ఎఫ్‌డీఐ ‍ స్పష్టం చేసింది.  ఐదు కేలరీల కంటే తక్కువ ఉన్న నీరు, టీ , కాఫీ వంటి పానీయాలు మాత్రం "ఆరోగ్యకరమైన" హోదాకు  అర్హత పొందుతాయని ఎఫ్‌డీఏ పేర్కొంది. అయితే, చామోమిలే, పిప్పరమెంటు, అల్లం, లావెండర్, మందార, శంఖంపువ్వు (అపరాజిsత) లేదా మసాలా టీతో సహా ఇతర హెర్బల్ టీలకు "ఆరోగ్యకరమైన" ఈ గుర్తింపు వర్తించదని ఏజెన్సీ స్పష్టం చేసింది. కామెల్లియా సైనెన్సిస్‌ను  కొన్ని క్యాన్సర్‌ సంబంధిత ఆరోగ్య ప్రయోజనాలకు ముందస్తు పరిశోధనలను కూడా ఎఫ్‌డీఏ అంగీకరించింది.

నార్త్ ఈస్టర్న్ టీ అసోసియేషన్ (NETA), ఇండియన్ టీ అసోసియేషన్ (ITA) U.S. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కూడా కామెల్లియా సినెన్సిస్ టీని ఆరోగ్యకరమైన పానీయంగా గుర్తించడాన్ని స్వాగతించాయి. దేశంలోని అతిపురాతన టీ ఉత్పత్తిదారుల సంస్థ ఇండియన్ టీ అసోసియేషన్ (ITA), ఇది ల్యాండ్‌మార్క్‌ నిర్ణయంగా అభివర్ణించింది.   అటు  ప్రపంచ తేయాకు పరిశ్రమకు ఇది "అద్భుతమైన వార్త" అంటూ అమెరికా టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటర్ ఎఫ్. గోగీ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే టీ బోర్డ్ ఆఫ్ ఇండియా మాజీ వైస్ చైర్మన్ బిద్యానంద బోర్కకోటి కూడా  హర్షం వ్యక్తం చేశారు.  ఎఫ్‌డీఏ గుర్తింపు, టీ ఆరోగ్య ప్రయోజనాల నేపథ్యంలో టీని ఒక వెల్నెస్ ,జీవనశైలి పానీయంగా ప్రచారం చేయాలని తాము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నామని  ఆయన చెప్పారు.
 

ఇదీ చదవండి: మోతీ షాహీ మహల్‌ : ఐరన్‌ మ్యాన్‌ మెమోరియల్‌


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)