Breaking News

మిల్కీ బ్యూటీ డైట్‌ సీక్రెట్‌ ఇదే!.. మెరిసే చర్మం కోసం..

Published on Mon, 10/21/2024 - 11:45

టాలీవుడ్‌ నటి తమన్నా భాటియా హ్యాపీ డేస్‌ మూవీతో ఎంట్రీ ఇచ్చి.. వరుస హిట్‌ సినిమాలతో మంచి సక్సెస్‌ని అందుకుంది. మిల్కీ బ్యూటీ, తన అందం, నటనతో విమర్శకుల ప్రశంసలందుకోవడమే గాక ఎన్నో విలక్షణమైన పాత్రలతో మెప్పించింది. కళ్లు తిప్పుకోలేని అందం, ఆహార్యం ఆమె సొంతం. అంతేగాదు యువ హీరోయిన్‌లకు తీసిపోని విధంగా గ్లామరస్‌గా ఉంటుంది. ఇప్పటికి అలానే చెక్కిన శిల్పంలా అందంగా ఉంటుంది. అంతలా బాడీ మెయింటైన్‌ చేసేందుకు ఆమె ఎలాంటి డైట్‌ ఫాలో అవుతుందోనని కుతూహలంగా ఉంటారు అభిమానులు. అయితే తమన్నా మాత్రం ఫిట్‌నెస్‌ అనేది రోజు బ్రెష్‌​ చేయడం మాదిరిగా శరీరానికి సంబంధించిన ఓ దినచర్య. అందుకోసం తాను ఎలాంటి డైట్‌లు ఫాలో అవ్వనని, తనకు వాటిపై నమ్మకం లేదని అంటోంది. మరీ అంతలా నాజుకైన శరీరం ఎలా మెయింటైన్‌ చేస్తుందంటే..

తమన్నా నాజూకైన శరీరాకృతి పరంగా ఎన్నో ప్రశంసలందుకుంటుంది. ఫిట్‌గా ఉండేందుకు మెరిసే చర్మం కోసం ఎలాంటి ఫుడ్‌ తింటుందంటే..

బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరి అవి..
గ్లూటెన్‌ ఫ్రీ గ్రానోలా, ఖర్జూరాలు, బాదంపాలు, అరటి పండు, గింజలు, కొన్ని బెర్రీలు ఉంటాయి. శక్తి బూస్ట్‌ కోసం తేలికపాటి అల్పాహారంతో డైట్‌ ప్రారంభిస్తుంది. ప్రోటీన్‌ కోసం గుడ్లను తింటుంది. అంతేగాదు మరింత హెల్తీగా ఉండేందుకు ఉల్లిపాయలు, టొమాటోలు, బచ్చలికూరతో చేసి ఆమ్లేట్‌లు తీసుకుంటుందట. 

 

లంచ్‌ వద్దకు వస్తే సాధారణ భోజనం, పప్పు, అన్నం, పచ్చికూరగాయలే తింటుంది. ఇలాంటి భోజనం సంతృప్తినిస్తుందని అంటోంది. షూటింగ్‌లో ఉన్న రోజుల్లో లేదా బయటకు వెళ్లే రోజుల్లో ఇడ్లీ, సాంబార్‌ లేదా రసం, దోస వంటి దక్షిణ భారత ఆహారాన్నే ఎంచుకుంటానంటోంది. డిన్నర్‌ చాలావరకు సాయంత్రం 5 నుంచి 6 గంటల్లోపు తినేలా చూసుకుంటుందట. దీంతోపాటు కొన్ని గింజలను తింటానని చెబుతోంది. 

 

అంతేగాదు తాను ఎక్కువగా సాయంత్రం సమయాల్లో జిమ్‌​ చేస్తానని అంటోంది. ఆ టైంలో తప్పనిసరిగా గుడ్లు, కూరగాయలతో కూడిన​ ప్రోటీన్‌ రిచ్‌ డిన్నర్‌కి ప్రాధాన్యత ఇస్తుందట. జిమ్‌ ఎక్కువ చేస్తే తాను తీసుకునే భోజనం క్వాంటిటీని కూడా పెంచుతానని చెబుతోంది. ఇక మెరిసే చర్మం కోసం హైడ్రేటెడ్‌గా ఉండేలా ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగుతానని అంటోంది. 

(చదవండి: కళ ద్వారా ఆరోగ్య అక్ష్యరాస్యత..!)
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)