Breaking News

అరే..! మరీ ఇలానా..! గర్ల్‌ఫ్రెండ్‌ కోసం ఎంత పనిచేశాడంటే.?

Published on Sun, 04/06/2025 - 17:36

అవతలి వాళ్లు మన నుంచి దూరంగా వెళ్లిపోయే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే..వాళ్లు మనల్ని దూరం చేసుకున్నామనే ఫీల్‌ కలిగేలా మన ప్రవర్తన ఉండాలి. అంతేతప్ప దిగజారి దారుణాలకు ఒడిగడితే పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇక్కడొక వ్యక్తి అలాంటి పనిచేసే కటకటాల పాలయ్యాడు. అంతేగాదు తన గర్ల్‌ఫ్రెండ్‌కి మరింత అసహ్యం కలిగేలా చేసుకున్నాడు.

ఈ ఘటన తైవాన్‌లో చోటుచేసుకుంది. 57 ఏళ్ల కోళ్ల పెంపకందారుడు ఎల్వీ 48 ఏళ్ల టాంగ్‌ అనే మహిళతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. వాళ్ల బంధం 15 ఏళ్లు కొనసాగింది. అయితే ఎల్వీ ప్రవర్తన సరిగా లేకపోవడం, కుటుంబ తోడ్పాటుకు ఎటువంటి సహకారం లేకపోవడంతో విసిపోయిన టాంగ్‌ అతడితో బంధానికి స్వస్తి చెప్పింది. అప్పటి నుంచి ఆమె వేరుగా జీవిస్తోంది. 

దీన్ని జీర్ణించుకోలేని ఎల్వీ, టాంగ్‌ని పదే పదే బెదిరింపులకు గురి చేయడం ప్రారంభించాడు. అక్కడితో ఆగక ఇక ఆమెను ఎలాగైనా.. తన వద్దకు రప్పించుకుని, కలిసే జీవించేలా చేద్దామనే దురుద్దేశంతో దురాగతానికి తెరతీశాడు. ఆమె తండ్రి సమాధి వద్ద ఉండే చితాభస్మాన్ని దొంగలించి ఆమె మనోవ్యధను కలిగిస్తే..కచ్చితంగా తన వద్దకు తిరిగి వచ్చేస్తుందని భావించాడు. 

కానీ అతడు ఒకటి తలిస్తే..విధి మరొకటి తలిచింది. అయితే ఇదంతా టాంగ్‌కు తెలియదు. అతడు తన తండ్రి చితాభస్మం నా దగ్గర ఉందని చెప్పినా..టాంగ్‌ అవన్నీ బెదిరింపులే అనుకుని కొట్టిపారేసింది. నమ్మను కూడా నమ్మలేదు. అయితే ఎలా దొంగలించానో..ఫోటోలతో సహా వివరంగా పంపించాడు. అప్పుడే ఆమె తన తండ్రి స్మశాన వాటికను సందర్శించి అసలు విషయం తెలుసుకుంది. 

ఇక టాంగ్‌ అతడిని క్షమించకూడదన్న పట్టరాని కోపంతో..పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక వాళ్లువెంటనే రంగంలోకి దిగి విచారించగా..అతడే టాంగ్‌ తండ్రి చితాభస్మాన్ని అపహరించాడని తేల్చారు. అయితే అప్పటికే ఎల్వీ మనీలాండరింగ్‌కి సంబంధించిన కేసులో జైల్లో ఉన్నాడు. ఇక ఈ ఘనకార్యంతో ఎల్వీపై మరిన్ని అబియోగాలు మోపి అరెస్టు చేశారు. 

అలాగే అతడి నుంచి ఆమె తండ్రి చితాభస్మాన్ని కూడా స్వాధీన పర్చుకుని టాంగ్‌కి అప్పగించారు. ప్రేమతో మన నుంచి దూరమైన వాళ్ల మనుసుని గెలుచుకోవాలే గానీ ఇలాంటి పనులతో బలవంతంగా రప్పించుకుంటే..విధి సైతం సహకరించదు అంటే ఇదే కదూ..!.

(చదవండి: ఊసరవెల్లిలా రంగులు మార్చే చెట్లు..! ఎక్కడంటే..?)
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)