Breaking News

‘మైండ్‌ స్పోర్ట్స్‌’: మైండ్‌ బ్లోయింగ్‌ ఫ్యాక్ట్స్‌

Published on Sat, 12/14/2024 - 14:58

‘ఆలోచనల గురించి పెద్దగా ఆలోచించవద్దు’ అనుకునేవాళ్లకు ముగ్ధ బవరే చెప్పే మాట...

‘మన ఆలోచనలే మన పనితీరును ప్రభావితం చేస్తాయి’  

ముగ్ధ ఒకప్పుడు ప్రతిభావంతురాలైన స్విమ్మర్‌. స్పోర్ట్స్‌ సైకాలజీపై పెద్దగాఅవగాహన లేని కాలంలో ఎంతోమంది అథ్లెట్ల మనసును అధ్యయనం చేసింది. క్రికెట్‌ టీమ్‌ నుంచి మొదలు ఒలింపిక్,  పారాలింపిక్‌ అథ్లెట్ల వరకు ఎంతోమంది అథ్లెట్లతో కలిసి పనిచేసింది.

మానసిక సమస్యలు, ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలతో ΄ పోరాడడానికి వారికి మార్గం చూపిన ముగ్ధ ప్రస్తుతం ‘మైండ్‌ స్పోర్ట్స్‌’ పేరుతో సొంతంగా  ప్రాక్టీస్‌ నిర్వహిస్తోంది. ఎంతోమంది అథ్లెట్లకు దిశానిర్దేశం చేస్తోంది.

‘మైండ్‌ స్పోర్ట్స్‌’పై పుస్తకం కూడా రాసింది. ఒక అథ్లెట్‌ మనసు మార్చడానికి ఏ అంశాలు ఉపయోగపడతాయో ఈ పుస్తకంలో వివరించింది.

‘ఒక అథ్లెట్‌ మనసు ఇతర  ప్రొఫెషనల్స్‌ కంటే ఏ రకంగా భిన్నంగా ఉంటుంది?’ అనే ప్రశ్నకు ముగ్ధ బవరే చెప్పే జవాబు...

‘పూర్తిగా భిన్నం కాదు. మనం ఆలోచించే విధానం స్పోర్ట్స్‌ అయినా కార్పొరేట్‌ అయినా తేడా తీవ్రంగా ఉండకపోవచ్చు. అందుకే ఏ రంగంలోనైనా మానసిక శిక్షణ(మెంటల్‌ ట్రైనింగ్‌) చాలా కీలకం. మనం ఆలోచించే విధానమే మన పనితీరును ప్రభావితం చేస్తుంది. సక్సెస్‌ మాత్రమే సర్వస్వం అనుకునేచోట వైఫల్యం బాధ పెడుతుంది. చాలామందిని కోలుకోకుండా చేస్తుంది. అయితే గెలుపు, ఓటములు ప్రతిభకు, ప్రతిభ లేక పోవవడానికి నిర్వచనం కాదనే అవగాహన ప్రస్తుత కాలంలో పెరిగింది
 

Videos

Fire accident : చార్మినార్ ప‌రిధిలో భారీ అగ్నిప్రమాదం

కోనేరులోకి దూసుకెళ్లిన ఇన్నోవా.. తప్పిన పెను ప్రమాదం

తెలుగు ప్రజలకు YS జగన్ దసరా శుభాకాంక్షలు

పులివెందులలో ఖాకీ కుట్ర.. YSRCP శ్రేణులపై ఏకే 47తో కాల్పులు..

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)