Breaking News

చందమామ కథలు: స్వేచ్ఛ తొలి తెలుగు AI టూల్ లాంచ్‌

Published on Sat, 01/06/2024 - 18:11

హైదరాబాద్: ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని, తెలుగులో ప్రత్యేకించి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ డేటాతో  స్వేచ్చా "AI చందమామ కథలు" ను శనివారం ఆవిష్కరించింది. తెలుగు ఎల్‌ఎల్‌ఎమ్‌ అనేది తెలుగు మాట్లాడే మారుమూల రైతుకు కూడా అందుబాటులో ఉండాలనే ఛాలెంజ్‌ను స్వీకరించి, ఈ క్రమంలో దీనికి చందమామ కథలను ఎంచుకున్నట్టు నిర్వాహకులు తెలిపారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణా ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ హాజరైనారు. ఇది తెలుగులో కథ చెప్పడం కోసం దేశంలో తీసుకొచ్చిన  తొలి ఏఐని ఆయన కొనియాడారు. నీతి, మర్మం నైతిక విలువలతో కూడిన చందమామ కథలను తెలుగు ఏఐవైపు మళ్లించడం సంతోషమన్నారు. భారతీయ కథలు, భారతీయ భాషలలో, భారతీయులందరికీ కథల రూపంలో అందించడం ముఖ్యం, ఈ క్రమంలో తెలుగు భాషలో, విలువలతో కూడిన చందమామ  కథలతో ప్రారంభించడం చాలా బాగుందన్నారు  ప్రొఫెసర్  (ఐఐటీ, మద్రాస్‌)గౌరవ్ రైనా.

 ఈ సందర్భంగా స్వేచ్ఛ తెలంగాణ  వ్యవస్థాపకుడు వై కిరణ్ చంద్ర సాక్షి.కామ్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒక చిన్న సమావేశంలో కథలకోసం భారతీయ భాషలలో ఏఐని సృష్టించే ఈ సమస్యపై ఆలోచిస్తున్న క్రమంలో చైతన్య (CPO & కో-ఫౌండర్, ఓజోనెటెల్), ప్రొఫెసర్ గౌరవ్ రైనా (ప్రొఫెసర్ IIT మద్రాస్) ఈ ఆలోచనకు రూపం వచ్చిందని తెలిపారు. తమ ప్రయత్నానికి 30 ఇంజినీరింగ్ కాలేజీలకు చెందిన 10 వేల మంది విద్యార్థులు, అధ్యాపకులు సహకరించారని తెలిపారు. దీన్ని భవిష్యత్తులో స్వేచ్ఛ గొంతుకలా కూడా విస్తరించాలని భావిస్తున్నామని కిరణ్‌ చంద్ర తెలిపారు.

ప్రధానంగా భారతదేశంలో 10 మిలియన్ డాలర్లతో ChatGPT లాంటి ఎల్‌ఎల్‌ఎంని నిర్మించడం అసాధ్యమన్న ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్  వ్యాఖ్యల్ని సవాల్‌గా తీసుకున్నట్టు చెప్పారు.   ఓపెన్ AI వంటి   వాటితో పోటీ పడేందుకు భారతీయ స్టార్ట్-అప్ రూపొందించిన తొలి ఇండిక్ లాంగ్వేజ్ మోడల్‌లలో తమ స్వేచ్ఛ చాట్‌బాట్ ఒకటని కిరణ్‌  వెల్లడించారు.

42 వేలకు పైగా పేజీల కథలను ఇప్పటికే అప్ లోడ్ చేశామనీ, అమృతమైన సరికొత్త కథలు వచ్చేలా  కూడా ఈ టూల్ ను  సిద్ధం చేశామని చెప్పారు.   40వేల కథల డేటాసెట్ ఇంటర్నెట్‌లో డౌన్‌లోడ్ చేయడానికి అందుబాటులో ఉంటుందన్నారు.  ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ అనేది చాట్‌జీపీటీలా ఖరీదైనదిగా గాకుండా ప్రతి రైతుకు, ప్రతి గ్రామీణ ఉపాధ్యాయునికి, ప్రతి దుకాణదారునికి అందుబాటులో ఉండాలన్నారు. ఆవైపుగా కూడా తమ కృషి సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రమా దేవి లంక(డైరెక్టర్, ఎమర్జింగ్ టెక్నాలజీస్) ప్రముఖ  సింగర్‌ రామ్‌ మిర్యాల కూడా పొల్గొనడం విశేషం. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు