Breaking News

స్వదేశ్‌లో చేతివృత్తుల సంగమం: హస్తకళ, మహిళా కళాకారులకు ఘన సత్కారం 

Published on Wed, 03/12/2025 - 15:31

దేశవ్యాప్తంగా విభిన్న సంస్కృతులకు చెందిన హస్తకళలతో తయారు చేసిన విలాసవంతమైన కళాకృతులకు గమ్యస్థానమైన జూబ్లీహిల్స్‌లోని స్వదేశ్‌ వేదికగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సృజనాత్మక కళాకారులైన మహిళా ఛాంపియన్స్‌ను ప్రత్యేకంగా సత్కరించారు. ఆర్ట్‌ క్రాఫ్ట్స్‌తో చక్కటి హస్తకళ, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించే మహిళలను అభినందించారు. స్టోరీ టెల్లింగ్, స్ఫూర్తి ప్రదాతలను పరిచయం చేసే ఈ కార్యక్రమంలో హెర్‌ సర్కిల్‌ సీఈఓ థాన్య చైతన్య మోడరేటర్‌గా ఫైర్‌ చాట్‌ నిర్వహించారు. ఈ వేదికగా ఆరుగురు ప్రముఖ క్రాఫ్ట్‌ మాస్టర్లు హస్తకళలతో తయారు చేసిన సంప్రదాయాలను సజీవంగా ఉంచడంలో వారి ప్రయాణాలు, సవాళ్లు, ఆవిష్కరణలను పంచుకున్నారు. ఈ సెషన్‌లో వారి కథలతో స్ఫూర్తిని నింపారు. సమకాలీన భారతదేశంలో చేతిపనుల ప్రాముఖ్యతను బలోపేతం చేశారు. 

ఈ ప్రత్యేక వేదికగా.. డిజైన్‌ ఇన్నోవేషన్‌ జాతీయ అవార్డు గ్రహీత సునేత్రలహరి (పశ్చిమ బెంగాల్‌), తోలుబొమ్మలాటతో జాతీయ అవార్డు పొందిన డి.శివమ్మ (ఆంధ్రప్రదేశ్‌), సిల్వర్‌ ఫిలిగ్రీ జాతీయ అవార్డు గ్రహీత అర్రోజు ధనలక్ష్మి (తెలంగాణ), కాలిఘాట్‌ పెయింటింగ్‌ అవార్డీ స్వర్ణ చిత్రకార్‌ (పశ్చిమ బెంగాల్‌), ఇక్కత్‌ చేనేత జాతీయ అవార్డు గ్రహీత సుకాంతి మెహెర్‌ (ఒడిశా), మధుబని పెయింటింగ్‌ జాతీయ అవార్డు గ్రహీత ఆశా ఝా (బీహార్‌)ను స్వదేశ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సన్మానించారు. 

అత్యుత్తమ వర్క్‌ ప్లేస్‌గా సింక్రోనీ..
సాక్షి, సిటీబ్యూరో: దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న సంస్థల్లో అత్యత్తుమ టాప్‌ 50 పని ప్రదేశాల్లో నగరానికి చెందిన సింక్రోనీ ఇండియా ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రతిష్టాత్మక ‘ఆల్‌ 2025’ నిర్వహించిన అధ్యయనంలో బిల్డింగ్‌ ఏ కల్చర్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ 2025 లార్జ్‌ కేటగిరీలో సింక్రోనీ ఇండియా ఎంపికైంది. ఈ సందర్భంగా సంస్థ హెడ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రచనా బహదూర్‌ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దాదాపు 1,800కు పైగా సంస్థల్లోని 57 లక్షలకు పైగా ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించిన  ఈ అధ్యయనంలో సింక్రోనీ  శ్రేష్ఠతకు ఒక ప్రమాణాన్ని నిర్దేశించడం తమకు గర్వకారణమన్నారు

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)