Breaking News

సరోగసి ద్వారా బిడ్డను కంటే క్యాన్సర్‌ వస్తుందా? డాక్టర్లు ఏమంటారంటే..

Published on Tue, 10/10/2023 - 14:45

నేను కెరీర్‌ ఓరియెంటెడ్‌. సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలనుకుంటున్నాను. దానివల్ల బ్రెస్ట్‌ ఫీడ్‌ ఇవ్వడం కుదరదు కాబట్టి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుందా?
– రంజనీ ప్రసాద్, పుణె


సరోగసీ ద్వారా పిల్లల కోసం ప్లాన్‌ చేసినా కొంతమంది.. మందుల ద్వారా బ్రెస్ట్‌ ఫీడ్‌కి ట్రై చేయవచ్చు. దాన్ని లాక్టేషన్‌ ఇండక్షన్‌ అంటారు. సరోగసీ బేబీ డెలివరీ టైమ్‌ కన్నా ముందు నుంచే మీరు బ్రెస్ట్‌ ఫీడ్‌  ట్రై చేయడానికి ప్రిపరేషన్‌ చేసుకోవాలి. అందరికీ ఇది సక్సెస్‌ కాకపోవచ్చు. కానీ బ్రెస్ట్‌ ఫీడింగ్‌ వల్ల ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. ఏడాది వరకు బ్రెస్ట్‌ ఫీడింగ్‌తో నాలుగు నుంచి అయిదు శాతం వరకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రిస్క్‌ తగ్గుతుంది.

బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రిస్క్‌ అనేది హార్మోన్స్, జన్యుపరమైన, జీవనశైలి మీద ఆధారపడి పెరుగుతుంది. 5 నుంచి 10 శాతం జన్యుపరమైన కారణాలుంటాయి. బ్రెస్ట్‌ ఫీడ్‌ ఇవ్వనందువల్ల బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రిస్క్‌ కొంచెం మాత్రమే మారుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి.. అంటే అధిక బరువు లేకుండా, సరైన బీఎమ్‌ఐ ఉండేలా క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ .. పోషకాహరం తీసుకుంటూ ఉంటే క్యాన్సర్‌ రిస్క్‌ తగ్గుతుంది.

హైరిస్క్‌ జన్యుపరమైన కారణాలు ఉన్నవారిలో అంటే బీఆర్‌సీఏ (ఆఖఇఅ) జీన్‌ పాజిటివ్‌ అని స్క్రీనింగ్‌లో తేలినవారిలో ప్రాఫిలాక్టిక్‌ సర్జరీల ద్వారా ఆ రిస్క్‌ను తగ్గించవచ్చు. బ్రెస్ట్స్‌ అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ ద్వారా తొలిదశలోనే  క్యాన్సర్‌ మార్పులను కనిపెట్టవచ్చు. ఈ రోజుల్లో సరోగసీతో పిల్లల్ని కన్నా కొన్ని మందుల ద్వారా బ్రెస్ట్‌ ఫీడ్‌ ఇచ్చేలా బిడ్డ.. తల్లి స్పర్శ పొందేలా చూస్తున్నాం.  

-డా. భావన కాసు
గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌,హైదరాబాద్‌ 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు