Breaking News

Health: రోజూ ఏం తింటున్నారు? ఎరుపు రంగు ఆహారంలోని లైకోపీన్‌ వల్ల..

Published on Sat, 04/01/2023 - 11:54

ఆకాశంలో విరిసే ఇంద్ర ధనుస్సును చూసి మురిసిపోని వారెవరు? అందుకే కవులు, రచయితలు కూడా ఇంద్రధనుస్సు గురించి ఎంతో అందంగా వర్ణిస్తుంటారు. రెయిన్‌బో పేరుతో రెస్టారెంట్లు, హోటళ్లు, కాన్వెంట్లు కూడా కనిపిస్తుంటాయి.

రెయిన్‌బో డైట్‌ కూడా ఈ కోవలోకే వస్తుంది. అంటే... రెయిన్‌ బోలో ఎన్ని రంగులు ఉంటాయో మన ప్లేట్‌లో కూడా అన్ని రంగుల ఆహారపదార్థాలు ఉండేలా చూసుకోవడమే. అలా రెయిన్‌బో డైట్‌లో చేర్చిన రకరకాల రంగుల ఆహారాల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

రంగులలో ముందు చెప్పుకోవలసినది తెలుపు గురించే. ఎందుకంటే తెలుపులో ఏ రంగయినా ఇట్టే కలిసిపోతుంది కాబట్టి. ముందుగా తెలుపు రంగు ఆహారం గురించి చూద్దాం.

తెలుపు రంగు ఆహారం
ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి, పుట్టగొడుగులు, క్యాలీఫ్లవర్, పాలు, పెరుగు, కొబ్బరి వంటి ఆహారాలు తెలుపు రంగు ఆహారం కిందికి వస్తాయి. ఆహారంలో వీటిని భాగంగా చేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు శరీరంపై దుష్ప్రభావం చూపకుండా అడ్డుకుంటాయి. ఎందుకంటే వాటిలో ఎక్కువ ఫైబర్‌ ..పొటాషియం ఉంటుంది.

నారింజ రంగు ఆహారం
నారింజ రంగు పండ్లు .. కూరగాయలలో కెరోటిన్‌ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నారింజ, మంచి గుమ్మడి, క్యారెట్లు... పీచ్‌ వంటివి కంటి చూపుతోపాటు కేశాలకు, చర్మ ఆరోగ్యానికీ కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.

ఆకుపచ్చ ఆహారం
ఆకుపచ్చ కూరగాయలు ..పండ్లు మనకు ఎంతో మేలు చేస్తాయని ఎప్పటినుంచే వైద్యులు చెబుతున్నమాటే. అవి చాలా యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి మధుమేహం ..గుండె జబ్బులతో పోరాడతాయి.

ఇందులో ఫోలేట్‌.. ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, మీరు మీ ఆహారంలో బచ్చలికూర, మెంతికూర, క్యాబేజీ, బీన్స్‌, బఠాణి, బూడిద గుమ్మడి, కీరా, ద్రాక్ష, పచ్చి టొమాటో, పుదీనా చేర్చుకోవాలి.

పసుపు రంగు ఆహారం
బొప్పాయి, పైనాపిల్, నిమ్మ, మామిడి, మొక్కజొన్న వంటి పండ్లు ..కూరగాయలలో లభించే బ్రోమెలైన్‌ పాపైన్‌ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. పసుపు ఆహారాలలో ఉండే లుటీన్‌ జియాక్సంతిన్‌ పిగ్మెంట్లు, వయస్సు సంబంధిత వ్యాధులకు వ్యతిరేకంగా ప్రభావం చూపుతాయి.

నీలం లేదా ఊదా రంగు ఆహారం
బెర్రీలు, ఎర్రటి కూరగాయలు, నల్ల ద్రాక్ష, వంకాయ వంటివి మెదడు సామర్థ్యానికి ప్రోత్సాహకంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే ఆంథోసైనిన్‌ ..రెస్వెట్రోల్‌ సమ్మేళనాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే, ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.. శరీరంలో మంటలను, వాపులను తగ్గిస్తాయి.

ఎరుపు రంగు ఆహారం
ఎరుపు రంగులో ఉండే చాలా కూరగాయలు .. పండ్లు మన హృదయానికి మేలు చేస్తాయట.. రెడ్‌ బెల్‌ పెప్పర్స్, (ఎరుపు రంగులో ఉండే క్యాప్సికం) దానిమ్మపండ్లు, టొమాటో, పుచ్చకాయలు, యాపిల్‌ వంటి వాటిలో లైకోపీన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఉంటుంది.

ఇది క్యాన్సర్‌.. తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతుంది. దీంతోపాటు వాటి ఎరుపు రంగుకు కారణమైన ఆంథోసైనిన్‌ సమ్మేళనం గుండె కండరాలను బలంగా ఉంచుతుంది.

ఒక రోజులో ఐదు రకాల పండ్లు .. కూరగాయలు.. ఒక వారంలో కనీసం 20 రకాల పండ్లు ..కూరగాయలు తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. 
నోట్‌: ఇది కేవలం ఆరోగ్యంపై అవగాహన కోసం మాత్రమే అందించిన కథనం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)