Breaking News

World Theatre Day: రాజుల కాలం నుంచి హవా సాగుతోంది..!

Published on Thu, 03/27/2025 - 00:54

రాజుల కాలం నుంచి విరాజిల్లుతూ నేటికీ తనప్రాభవాన్ని నిలబెట్టుకుంటున్న రంగం నాటకరంగం...  
మరింతమందికి ఈ రంగాన్ని చేరువ  చేయడానికి కృషి చేస్తున్నవారు ఎందరో.   ప్రపంచవ్యాప్తంగా మార్చి 27న రంగస్థల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చదువుకు సాధనంగా, సామాజిక  మార్పు కోసం ప్రభావంతంగా పనిచేసే నాటకం ప్రాముఖ్యత, మన సంస్కృతిలో ఎంతగా మమేకం అయ్యిందో తెలియజేస్తున్నారు కళాకారులు  సురభి లలిత, ఆర్‌.రేఖ, ఇరిగి త్రివేణి.

నైపుణ్యాలకు మెరుగు
ఎనిమిదేళ్ల వయసు నుంచే నాటకరంగంలోకి వచ్చాను. 28 ఏళ్లుగా నాటకరంగంలో ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నాను. నెలలో 4 నుంచి 8 వరకు ప్రోగ్రామ్స్‌ చేస్తుంటాం. ఈ నెల 29న హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు స్వేచ్ఛ నాటక ప్రదర్శన ఉంది. ఒక నాటకం చూడటానికి 500 నుంచి 800 మంది హాజరవుతుంటారు. లైవ్‌ ఫెర్‌ఫార్మెన్స్‌ కాబట్టి ఎంతో సంతోషం ఉంటుంది. ఎప్పటికప్పుడు  ఇంప్రూవ్‌ చేసుకోవడానికి పనికివస్తుంది. 

ఒక్కొక్క నాటిక 50 నుంచి వందసార్లు కూడా ప్రదర్శిస్తుంటాం. ఎంత ఇబ్బంది ఉన్నా, రాత్రిళ్లు నిద్ర లేకపోయినా సరే ఒకసారి మేకప్‌ వేసుకొని, వేదిక ఎక్కగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. ‘గడి’ అనే నాటికకు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. కిందటేడాది వేసిన స్వేచ్ఛ, నిశి.. నాటికలలో నా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. నాటక ప్రదర్శనలు లేనప్పుడు సినిమా ఆడిషన్స్‌కి వెళుతుంటాను. ఆ విధంగా ‘బలగం’ సినిమాలో మంచి పాత్ర వచ్చింది. కొన్ని వెబ్‌సీరీస్‌లలోనూ నటిస్తున్నాను. 
– సురభి లలిత, హైదరాబాద్‌

ఎన్నో అవకాశాలకు దారి చూపింది
మా నాన్న వారసత్వంగా నాటక, హరికథా కళాకారిణిగా ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. ఆ ఇష్టంతోనే ఎం.ఎ. థియేటర్‌ ఆర్ట్స్‌ చేశాను. సీతారాముల కళ్యాణంలో సీత పాత్ర, చరణ్‌దాసు నాటకంలో రాణి పాత్రలతో నాటకరంగానికి పరిచయం అయ్యాను. డా.బిఆర్‌ అంబేడ్కర్‌ రాజ గృహప్రవేశం నాటకంలో రమాబాయి పాత్రకు మంచి పేరు వచ్చింది. జాతీయ బహుమతి పొందిన రేడియో తెలుగు నాటకాలు– ఒక పరిశీలన అనే అంశంపై పరిశోధన చేస్తున్నాను. గాయనిగా వేదికల మీద ప్రదర్శనలు ఇస్తుంటాను. సినిమాలకు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానూ పనిచేస్తున్నాను. ఇవన్నీ నాటకం నాకు ఇచ్చిన వరాలుగా చెప్పవచ్చు. గురుకుల పాఠశాలలో మ్యూజిక్‌ టీచర్‌గా చేస్తున్నాను. 
– ఆర్‌.రేఖ, హైదరాబాద్‌

వెక్కిరించినవారే మెచ్చుకున్నారు
మాది గ్రామీణ నేపథ్యం. తెలుగు యూనివర్శిటీలో జానపదం, అక్కడే థియేటర్‌ ఆర్ట్‌లో పీజీ చేశాను. వర్క్‌షాప్స్‌ చేస్తూ, నాలుగేళ్లుగా నాటకాలు వేస్తున్నాను. సమ్మక్క సారలమ్మ, చాకలి ఐలమ్మ, వి ఆర్‌ ఇండియన్స్‌.. ఇలా నాటకాల జాబితా ఎక్కువ. ఇప్పుడు చాలా థియేటర్‌ గ్రూప్స్‌ వస్తున్నాయి. సినిమాల వాళ్లు కూడా థియేటర్‌లో నటిస్తున్నవారికిప్రాధాన్యత ఇస్తున్నారు. 

ఇప్పటికి పది రాష్ట్రాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నాను. మన వారసత్వం, సంప్రదాయాలు మన ముందు తరాలకు పరిచయం చేయాలని టీచింగ్‌ వైపుకు వచ్చాను. డ్యాన్స్, మ్యూజిక్, థియేటర్‌.. టీచర్‌గా కిందటి నెలలో సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌ అండ్‌ జూనియర్‌ కాలేజీ విద్యార్థులకు బోధిస్తున్నాను. నేను చదువుకునేటప్పుడు మా చుట్టుపక్కల వాళ్లు ఈ నాటకాలు, డ్యాన్సులు ఏంటి.. పెళ్లి చేసుకోకుండా అనేవారు. ఇప్పుడు ‘సాధించావు’ అంటుంటారు. 
– ఇరిగి త్రివేణి, దేవరకొండ, నల్లగొండ

– నిర్మలా రెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)