Breaking News

ఆచి తూచి అడుగు వేయండి

Published on Wed, 04/08/2026 - 01:36

మనిషి తన జీవన విధానాలను మెరుగు చేసుకునే పద్ధతులను ప్రయత్నిస్తూనే ఉంటాడు. భారతీయ వివాహ వ్యవస్థ తిరుగులేనిదే అయినా ఇటీవల లివ్‌ ఇన్‌ రిలేషన్‌– సహజీవన విధానంలో స్త్రీ, పురుషులు జీవించడం పరిపాటి అయ్యింది. అయితే ఇందులో స్త్రీలకు ఎదురవుతున్న సవాళ్లను పరిశీలించిన సుప్రీంకోర్టు న్యాయవాది మోనిక అరోర ఫేస్‌బుక్‌ వేదికగా కొన్ని సూచనలు చేశారు.

ఇటీవల నా దగ్గరకు వచ్చిన ఒక కేసు నన్ను తీవ్రంగా కలవరపరిచింది. అది సహజీవనం కేసు. ఒక మహిళ దాదాపు 10 సంవత్సరాలుగా ఒక వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఆమె ఆ బంధాన్ని ఎంతో నమ్మింది. ఈ పదేళ్ల కాలంలో అతని కోసం సమయాన్ని, యవ్వనాన్ని, భావోద్వేగాలను, శరీరాన్ని అర్పించింది. కానీ ఉన్నట్టుండి ఆ వ్యక్తి ఏమీ చెప్పకుండా ఆమె నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. వేరొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఆమెతో చె΄్పాడు. దాంతో ఆమె పూర్తిగా కుంగిపోయింది. ఆమె పోలీసుల వద్దకు వెళ్లాలనుకుంది. క్రిమినల్‌ కేసు పెట్టాలనుకుంది. అతడు చేసిన ఘోరమైన ద్రోహానికి చట్టం అతడిని శిక్షించాలని కోరుకుంది. కాని భావోద్వేగాలు వేరు... చట్టం పని తీరు వేరు. అందుకే లివ్‌ ఇన్‌ రిలేషన్‌లో ఉంటున్న, వెళ్లాలనుకున్న స్త్రీలకు, యువతులకు కొన్ని వాస్తవాలు చెప్పాలనుకుంటున్నాను.

మీరు ఇది అర్థం చేసుకోండి
‘సహజీవనం’ స్త్రీలకు సాధికారత ఇచ్చే సంబంధం అని అనుకుంటారు. ఈ భావన కేవలం అంచనా మాత్రమే అంటాను నేను. ఇది చూడటానికి, పైకి చెప్పుకోవడానికి ఎంపికకూ, స్వేచ్ఛకూ, ఆధునికతకూ తార్కాణం కావచ్చు. కాని ఒకసారి ఏదైనా తేడా జరిగితే నిజమైన కోర్టు గదులలో పరిస్థితి చాలా భిన్నంగా ఎదురవుతుంటుంది. లివ్‌ ఇన్‌ రిలేషన్‌ ఒక్కసారి విచ్ఛిన్నమైనదంటే ఆ సంబంధంలో ఉన్న మహిళకే అధిక నష్టం ఎదురవుతుంది. ఒంటరితనం, బాధ ఆమెను చుట్టుముడతాయి. చట్టపరంగా ఆమెకు దొరికే మద్దతు ఆశించినంతగా ఏమీ ఉండదు.  అందుకే లివ్‌ ఇన్‌లో ఉన్న... లేదా వెళ్లాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన చట్టపరమైన అంశాలు

సమ్మతికి ప్రాధాన్యం
ఇద్దరు వయోజనులు ఒక సంబంధంలో ఉండాలని నిశ్చయించుకుని, స్వచ్ఛందంగా పరస్పర అంగీకారంతో శారీరక సంబంధంలోకి ప్రవేశిస్తే, అప్పుడు విడిపోవడం నేరంగా పరిగణించబడదు.

అది లైంగిక నేరంగా మారదు
లిన్‌ ఇన్‌ రిలేషన్‌ నుంచి పురుషుడు తప్పుకుంటే, ఆ సంబంధాన్ని విడిచిపెట్టినంత మాత్రాన, అప్పటివరకూ పరస్పర అంగీకారంతో సాగిన శారీరక సంబంధం అత్యాచారంగా మారిపోదు.

మోసం, వంచనలకు శిక్ష
అయితే లివ్‌ ఇన్‌ కోసం మొదటినుంచి మోసం, కుయుక్తి లేదా కేవలం సమ్మతి కోసమే పెళ్లి చేసుకుంటానని తప్పుడు వాగ్దానం చేసినట్లయితే ఈ అంశం చుట్టూ చట్టపరమైన సహాయం భిన్నంగా ఉండవచ్చు. అయితే ఈ విషయం కూడా స్పష్టంగా నిరూపించబడాలి.

రక్షణ గురించి
సహజీవన సంబంధం తనంతట తాను వివాహానికి ఉండే చట్టపరమైన రక్షణను కల్పించదు. వివాహం స్త్రీకి సామాజిక మద్దతు, చట్టపరమైన హోదాను ఇస్తుంది. నిలదీయదగ్గ, అమలు చేయదగ్గ హక్కులను స్త్రీకి ఇస్తుంది. భర్త విడిపోవాలంటే భార్య ఉమ్మడి ఇంటి నుంచి రక్షణ, భరణం, చట్టపరమైన పరిహారాలు, సామాజికం గా అవసరమైన మద్దతు, పెద్ద మనుషులను కూచోబెట్టి డిమాండ్స్‌ చేయడం.. ఇవన్నీ సాధ్యమవుతాయి.

మరి లివ్‌ ఇన్‌లో?
లివ్‌ ఇన్‌లో కొన్ని సందర్భాల్లో స్త్రీకి చట్టం నుంచి పరిమిత రక్షణ లభించవచ్చు. కానీ అది వివాహం ద్వారా స్త్రీకు వచ్చే రక్షణతో సమానం కాదు. వివాహ స్వభావం కలిగిన కొన్ని జీవన సంబంధాలను చట్టం రక్షించవచ్చు, కానీ ఆ రక్షణ పరిమితమైనది. పెళ్లి నుంచి విడిపోవాలంటే ఎదురయ్యే సహజమైన పరిణామాలు లివ్‌ ఇన్‌ వంటి వ్యవస్థలో మనిషి మనిషికి మారిపోతుంటాయి.                        

అందుకే నేను ఏమంటానంటే
అమ్మాయిలకు ‘నీ శరీరం, నీ ఇష్టం’ అని మనం చెప్పినప్పుడు, ‘విచక్షణతో కూడిన నిర్ణయం తీసుకో’ అని కూడా వారికి చె΄్పాలి ∙చట్టం నినాదాలను కాపాడదు. చట్టం హక్కులను కాపాడుతుంది. హక్కులు కేవలం భావోద్వేగాల వల్ల రావు 

ఇది నీతిసూత్రాల బోధ అనుకోవడం లేదు. నా కేసులలో నేను పదేపదే చూస్తున్న చట్టపరమైన వాస్తవం గురించి చెబుతున్నాను 
ఒక అమ్మాయి సహజీవనం స్వేచ్ఛ అని నమ్మి అందులోకి ప్రవేశించవచ్చు. కానీ ఆ సంబంధం ముగిసినప్పుడు తనకు వివాహంలోలాగా వచ్చే హక్కు, భరణానికి హామీ, స్పష్టమైన సామాజిక భద్రత, నివాస హక్కులు, భావోద్వేగ ద్రోహానికి సులభమైన చట్టపరమైన పరిష్కారం లేదని ఆమె తెలుసుకోవాలి.

అందుకే, అనేక సందర్భాల్లో ‘సహజీవనాలు’ స్త్రీయే అధిక ప్రమాదాన్ని భరించాల్సిన ఒక వ్యవస్థగా పరిణమిస్తాయి. ఇటువంటి బంధంలోకి అడుగుపెట్టే ముందు, ప్రతి యువతి తనను తాను ఈ ప్రశ్నలు తప్పక వేసుకోవాలి.

నా చట్టపరమైన హక్కులు ఏమిటి?
ఒకవేళ అతను నన్ను వదిలి వెళ్లిపోతే నాకు లభించే రక్షణ ఏమిటి?
ఆ బంధానికి సంబంధించిన  వాగ్దానాలు నెరవేరకపోతే,నాకు లభించే పరిష్కారం ఏమిటి?
ఇంతటి గాఢమైన మానసిక,శారీరక అంకితభావానికి ప్రతి ఫలంగా నేను కచ్చితంగా ఏమి పొందుతున్నాను?

Videos

రావాలి మావిగన్.. కావాలి ఏపీ విన్

బూతు కిట్టు.. బ్రోకర్ కృష్ణ.. నీ తోలు వలిచి చెప్పులు కుట్టించకపోతే..

ABN రాధాకృష్ణ రాతలపై YS జగన్ ఆగ్రహం

డ్రంక్ అండ్ డ్రైవ్ బీభత్సం.. ఇద్దరు యువకులు మృతి

కాల్పుల విరమణ.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

నీతిలేని కుక్క.. ఇంకోసారి అలాంటి రాతలు రాస్తే చెప్పుతో కొడతాం..

బూతు కిట్టూ నీతిలేని రాతలు.. చంద్రబాబు చెబితే దేనికైనా

అమరావతి దేవతల రాజధానా ఎవడు చెప్పాడు?

బ్రోకర్ రాధాకృష్ణ నీకు కూతుర్లు లేరా.. RK రోజా వార్నింగ్

CSK ఫ్యాన్ ను ఒక ఆట ఆడుకున్న RCB అమ్మాయి...

Photos

+5

ఒక్క సినిమాతోనే జైన్‌ మేరీ ఖాన్‌ వైరల్‌ (ఫోటోలు)

+5

abn ఆఫీస్‌ వద్ద టెన్షన్‌ .. టెన్షన్‌ (ఫోటోలు)

+5

ఫుడ్‌ సేఫ్టీపై అవగాహన.. హైదరాబాద్‌లో వాకథాన్‌ (ఫోటోలు)

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)