సరదాగా ఈ సండే చేప, చికెన్‌తో వెరైటీ స్నాక్స్‌ చేయండిలా..!

Published on Sun, 03/23/2025 - 13:32

ఫిష్‌ చిప్స్‌ కావలసినవి:  
చేప ముక్కలు– 500 గ్రాములు (ముల్లు్ల లేనివి)
మైదా పిండి– అర కప్పు
మొక్కజొన్న పిండి– పావు కప్పు
బేకింగ్‌ పౌడర్‌– కొద్దిగా
బ్రెడ్‌ పౌడర్‌– 1 టేబుల్‌ స్పూన్‌
మిరియాల పొడి– అర టీ స్పూన్‌
సోడా వాటర్‌– కొద్దిగా
ఉప్పు– తగినంత
మసాలా దినుసులు– కొద్దికొద్దిగా (మిక్సీ పట్టి పౌడర్‌లా చేసుకోవాలి)
నూనె– డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ: ముందుగా చేప ముక్కలను శుభ్రం చేశాక, నీరు లేకుండా ఆరబెట్టాలి. అనంతరం వాటికి ఉప్పు, మిరియాల పొడి పట్టించి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక గిన్నెలోకి మైదా పిండి, మొక్కజొన్న పిండి, బేకింగ్‌ పౌడర్, బ్రెడ్‌ పౌడర్, ఉప్పు, మిరియాల పొడి, మసాలా దినుసుల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలపాలి. 

సోడా వాటర్‌ కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు ఏర్పడకుండా చేసుకోవాలి. అనంతరం చేప ముక్కలను ఈ మిశ్రమంలో ముంచి, బాగా పట్టించి, నూనెలో దోరగా వేయించుకోవాలి. బంగాళ దుంపలను కూడా ఇదే విధంగా వేయించుకుని, వీటితో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.

చికెన్‌తో స్పైసీ ఎగ్స్‌
కావలసినవి:  
గుడ్లు– 5 లేదా 6 
బోన్‌లెస్‌ చికెన్‌– 1 కప్పు 
కారం– 2 టీ స్పూన్లు
పసుపు– చిటికెడు
గరంమసాలా– 2 టీ స్పూన్ల పైనే 
చికెన్‌ మసాలా– 1 టీ స్పూన్ 
ఉప్పు– తగినంత
మిరియాల పొడి– కొద్దిగా, కొత్తిమీర తురుము లేదా ఉల్లికాడ ముక్కలు– గార్నిష్‌కి

తయారీ: ముందుగా బోన్‌లెస్‌ చికెన్‌ను శుభ్రం చేసుకుని, మిక్సీ పట్టి, కొద్దిగా పెరుగు, 1 టీ స్పూన్‌ గరం మసాలా, చికెన్‌ మసాలా, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు గుడ్లు ఉడికించి, పెంకులు తీసి, సగానికి కట్‌ చేసుకుని పసుపు సొనలను ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకోవాలి. 

అనంతరం చికెన్‌ మిశ్రమాన్ని, పసుపు సొనలతో కలిసి ముద్దలా చేసుకోవాలి. తర్వాత ఒక్కో గుడ్డు చెక్కభాగంలో కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని పెట్టుకుని కొత్తిమీర తురుము లేదా ఉల్లికాడ ముక్కలను వేసుకుని సర్వ్‌ చేసుకుంటే.. ఇవి భలే రుచిగా ఉంటాయి.

(చదవండి: ఇనుములో ఓ మనిషే మొలిచెనే..! అచ్చం మనిషిని పోలిన రోబో..)
 

#

Tags : 1

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)