Breaking News

ఈ సండే టేస్టీ టేస్టీ వంటకాలివే..!

Published on Sun, 06/22/2025 - 15:24

స్పైసీ మసాలా పుటిన్‌
కావలసినవి:  బంగాళ దుంపలు– 5 (పెద్దవి, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ కోసం సన్నగా, పొడవుగా ముక్కలు కట్‌ చేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి)
నూనె– 2 టేబుల్‌ స్పూన్లు పైనే, నువ్వుల పొడి– 4 టేబుల్‌ స్పూన్లు
జీలకర్ర, ధనియాల పొడి– ఒక టీస్పూన్‌ చొప్పున
పసుపు, గరం మసాలా– అర టీ స్పూన్‌ చొప్పున
ఉప్పు– రుచికి సరిపడా, చీజ్‌ తురుము– ఒక కప్పు, టమాటో సాస్‌– గార్నిష్‌కి
నువ్వులు– కొద్దిగా (దోరగా వేయించుకోవాలి), కొత్తిమీర తురుము– కొద్దిగా

తయారీ: ముందుగా కళాయిలో నూనె వేడి చేసి, జీలకర్ర వేయించాలి. తర్వాత ధనియాల పొడి, పసుపు, నువ్వుల పొడి, గరం మసాలా వేసి గరిటెతో తిప్పుతూ వేయించాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు, తగినంత ఉప్పు కలిపి, చిన్న మంటపైన గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించాలి. 

ఈలోపు బంగాళదుంప ముక్కలకు ఉప్పు, కారం, మసాలా దట్టించి, నూనెలో దోరగా, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌లా వేయించి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్‌ ప్లేట్‌లో ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ను వేసుకుని, దానిపైన జీలకర్ర–నువ్వుల మిశ్రమం, చీజ్‌ తురుము, టమాటో సాస్, నువ్వులు, కొత్తిమీర తురుము వేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే తింటే భలే రుచిగా ఉంటుంది.


కోకోనట్‌ – కిస్మిస్‌ లడ్డూ

కావలసినవి:  కిస్మిస్‌ పేస్ట్‌– ఒక కప్పు 
(మిక్సీ పట్టుకోవాలి)
రవ్వ– పావు కప్పు (నేతిలో దోరగా వేయించుకోవాలి)
కొబ్బరి పాలు– పావు కప్పు
తేనె – 6 టేబుల్‌ స్పూన్లకు పైనే 
పీనట్‌ బటర్‌– 4 టేబుల్‌ స్పూన్లు
రోల్డ్‌ ఓట్స్‌– పావు కప్పు 
(పౌడర్‌లా మిక్సీ పట్టుకోవాలి)
బాదం పౌడర్‌– 2 టేబుల్‌ స్పూన్లు
నెయ్యి– కొద్దిగా,కొబ్బరి తురుము– పావు కప్పు 
(అభిరుచిని బట్టి)

తయారీ: ముందుగా ఒక బౌల్‌లో రోల్డ్‌ ఓట్స్‌ పౌడర్, రవ్వ, కొబ్బరి పాలు, 3 టేబుల్‌ స్పూన్ల తేనె, పీనట్‌ బటర్‌ వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో బాదం పౌడర్, కిస్మిస్‌ పేస్ట్‌ కూడా వేసుకుని ముద్దలా కలుపుకోవాలి. నీళ్లు కావలిస్తే కలుపుకోవచ్చు. 

ఇప్పుడు చేతులకు నెయ్యి రాసుకుని, చిన్న చిన్న లడ్డూల్లా చేసుకోవాలి. అనంతరం ఈ లడ్డూలను మిగిలిన తేనెలో ముంచి, కొబ్బరి తురుములో బాగా దొర్లించి, సర్వ్‌ చేసుకోవచ్చు. 

(చదవండి: వుడెన్‌ ఆర్ట్‌తో ఇంటి లుక్‌నే మార్చేద్దాం ఇలా..!)

#

Tags : 1

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి