Breaking News

చిన్నారులు పజిల్స్‌ ఎందుకు చేయాలో తెలుసా..!

Published on Wed, 05/21/2025 - 09:56

పరీక్షల్లో మీ మార్కులు బెస్ట్‌గా వచ్చే ఉంటాయి. అయితే పజిల్స్‌ చేయడంలో తెలుస్తుంది అసలైన చురుకుదనం. ఈ పజిల్స్‌ను స్పీడ్‌గాచేయగలరా? అసలు పజిల్స్‌ ఎందుకు చేయాలో తెలుసా?

పిల్లలూ.. పజిల్స్‌ మన మెదడుకు మేత పెడతాయి. వీటికి సమయం కేటాయించడం వల్ల మీ ఏకాగ్రత, ఓర్పు పెరగడంతోపాటు కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. పజిల్స్‌లో ఎన్ని రకాలున్నాయో, వాటివల్ల ఉపయోగాలేమిటో చూద్దామా?

పద వినోదం: దీనినే గళ్ల నుడికట్టు అని కూడా అంటారు. ఇది పదాలతో ఆడే సరదా ఆట. ఇది  భాష మీద పట్టును పెంచుతుంది. దినపత్రికల్లో తెలుగు, ఇంగ్లిషుల్లో మీకు ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఖాళీ గళ్లలో పదాలు నింపే ప్రక్రియ ఇది. అందుకోసం పక్కనే మీకు కొన్ని క్లూస్‌ ఇస్తారు. వీటివల్ల కొత్త కొత్త పదాలు, వాటి అర్థాలు తెలుస్తాయి.

సుడోకు: ఇది జపాన్‌ దేశంలో పుట్టిన పజిల్‌. నిలువు తొమ్మిది, అడ్డం తొమ్మిది చొప్పున మొత్తం 81 గడులు ఉంటే సుడోకులో కొన్ని గడుల్లో అంకెలు వేసి ఉంటాయి. మిగిలిన వాటిని మనం పూర్తి చేయాలి. అయితే అడ్డంగా, నిలువుగా, తొమ్మిది గడులలో ఒకసారి వేసిన అంకె మరోసారి వేయకూడదు. సుడోకు పూర్తి చేయాలంటే చాలా ఏకాగ్రత అవసరం. పైగా సుడోకు పూర్తి చేయడం వల్ల అంకెల మీద ఇష్టం ఏర్పడుతుంది. లెక్కలంటే భయం ఉన్న పిల్లలు సుడోకు చేయడం వల్ల లెక్కల మీదున్న భయం పోతుంది.

జిగ్‌సా: ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్‌ అయిన పజిల్‌ ఇది. 1760లో దీన్ని కనిపెట్టారు. ఒక అట్ట ముక్కపై ఓ ఆకారాన్ని గీసి, ఆపైన దాన్ని రకరకాలుగా ఆకృతులుగా కత్తిరిస్తారు. మనం ఆ కత్తిరించిన ముక్కల్ని కలిపి ఆ ఆకారాన్ని తిరిగి తీసుకురావాలి. ఇది ఒకరికంటే ఎక్కువమంది కూడా ఆడొచ్చు. ఆడుతున్నంతసేపూ ఏకాగ్రత చాలా అవసరం. మార్కెట్లో అనేక జిగ్‌సా పజిల్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటిని మీరు కొని ఆడుకోవచ్చు.

కొత్తగా ఆలోచించు (Lateral Thinking): ఇవి మనందరికీ తెలిసిన పజిల్స్‌. రకరకాల ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడమే ఇందులో కీలకం. ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడంలో భలే సరదాగా ఉంటుంది. పొడుపు కథలు, ప్రాచీన గాథలు, పదాలతో చేసే చిక్కుప్రశ్నలు వీటిలో కీలకం అవుతాయి. 

ఈ ప్రశ్నల కోసం మార్కెట్లో ప్రత్యేకమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ‘ఫలానా సందర్భంలో మీరైతే ఏం చేస్తారు? ఫలానా అంశం ఇలాగే ఎందుకు జరుగుతుంది?’ అంటూ ప్రశ్నలు వేసి పిల్లల చేత సమాధానాలు రాబట్టడం ఇందులో ముఖ్యమైన విషయం.

లెక్కల పజిల్స్‌: ఇది మనందరికీ తెలిసినవే. లెక్కలతో తయారైన పజిల్స్‌. వీటిని పూర్తి చేయడం వల్ల గణితశాస్త్రంలోని పలు అంశాలపై అవగాహన పెరుగుతుంది. కూడికలు, తీసివేతలు, గుణించడం, భాగించడం వంటి అంశాలతో కూడిన ప్రశ్నలు వేసి వాటికి సమాధానాలు పిల్లల చేత రాబడతారు. సరదాగా సాగుతూ పిల్లలకు లెక్కల మీద అవగాహన పెంచడం వీటిలో కీలకం.  

(చదవండి: పాడ్‌కాస్ట్‌ చేద్దామా?)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)