Breaking News

బుజ్జి చేతులు సాయం చేయాలి..!

Published on Thu, 05/15/2025 - 10:05

పిల్లలూ...చదువుకోవడం అందరూ చేస్తారు. సాయం కొందరే చేస్తారు. సాయం చేసే చేతులకు దేవుని ఆశీస్సులుంటాయి తెలుసా? మరి సాయం ఎలా చేయాలి? సింపుల్‌. పుస్తకాలు పంచినా... పేద విద్యార్థికి ఫీజ్‌ పే చేసినా... దుస్తులు కొనిచ్చినా సాయమే. స్నానం అలవాటు చేసుకున్నట్టుగా... సాయం అలవాటు చేసుకోవాలి. ఈ వేసవిలో సాయం మొదలెట్టండి... వచ్చే వేసవి వరకూ కొనసాగించండి. ఇక మీరు గొప్ప సామాజిక సేవకులు అయినట్టే.

పిల్లలూ.... మీకు మదర్‌ థెరిసా తెలుసు కదా. ఆమె ఏమన్నారో తెలుసా? ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు. అంటే? ‘ఈ ప్రపంచంలోని కష్టాలన్నీ తొలిగిపోవాలి’ అని దేవుణ్ణి ప్రార్థించడం కంటే సాటి మనుషుల ఆ కష్టాలను కొన్నైనా దూరం చేయడానికి మనం సాయం చేయడమే మేలని అర్థం.

పేదవాళ్లందరూ మంచి కంఫర్ట్స్‌తో జీవించాలి అని దేవుణ్ణి కోరుకుంటే ఆ  దేవుడు ఆ కోరికను ఎప్పుడు తీరుస్తాడో ఏమో. కాని ఒక పేదవాడికైనా మనం కొద్దిగా కంఫర్ట్‌ ఇస్తే మంచిది కదా. అదో సంతృప్తి. ప్రపంచంలో సైంటిస్టులు, లీడర్లు, స్పోర్ట్స్‌ పర్సన్‌లు ఉన్నట్టే సేవ చేసేవారు కూడా ఉంటారు. కైలాష్‌ సత్యార్థి పేరు విన్నారా? ఆయన వీధి బాలల కోసం చాలా పని చేశాడు. 

వారి బాగు కోసం తన జీవితాన్ని వెచ్చించాడు. అందుకే ఆయనంటే అందరికీ గౌరవం. ఆయనే కాదు... బాబా ఆమ్టే, సుందర్‌లాల్‌ బహుగుణ, మేధా పాట్కర్‌... ఇలా ఎందరో సామాజిక సేవకులు ఉన్నారు. వారి గురించి మీరు ఈ సెలవుల్లో గూగుల్‌ చేసి తెలుసుకోవచ్చు. స్ఫూర్తి ΄÷ందవచ్చు. అయితే సేవ ఎలా చేయాలి? సేవ చేయడం అంటే ఏమిటి?

సేవామార్గం అంటే ఏమిటి?
మన చుట్టూ ఎంతోమంది అనాథలు, అభాగ్యులు ఉంటారు. తినడానికి తిండి లేక, ఉండటానికి గూడు లేక ఇబ్బంది పడేవారు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో చేరుతుంటారు. అలాంటి వారికి సేవ చేయడం ఎంతో మేలైన పని. దివ్యాంగులు, అంధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బడులు ఉంటాయి. 

అక్కడికి వెళ్లి, వారితో కాసేపు గడపడం, వారి యోగక్షేమాలు కనుక్కోవడం, వారికి చేతనైన సాయం అందించడం చేస్తే మనసుకు తృప్తి దక్కుతుంది. ఇలాంటి పనుల మీద మీరు శ్రద్ధ చూపిస్తే తప్పక మీ పేరెంట్స్‌ ఎంకరేజ్‌ చేస్తారు. మంచి పనులు చేస్తే ఎవరు వద్దంటారు?

ఎక్కడికి వెళ్లొచ్చు?
అనాథాశ్రమాలు: తల్లిదండ్రులు లేని చిన్నారుల కోసం మండల, జిల్లా కేంద్రాల్లో అనాథాశ్రమాలు ఉంటాయి. అలాంటి చోటికి తీసుకెళ్లమని మీ పేరెంట్స్‌కు చెప్పండి. అక్కడున్న పిల్లలతో మాట్లాడండి. వారితో కాసేపు ఆడితే వాళ్లే మీతో మనసు విప్పి వాళ్ల ఫీలింగ్స్‌ చెబుతారు. 

మీరు చేయదగ్గ హెల్ప్‌ చేయండి. వారిలో బాగా చదువుతున్నవారు, స్పోర్ట్స్‌లో షైన్‌ అవుతున్నవారెవరో తెలుసుకోండి. బుక్స్, షూస్, స్పోర్ట్స్‌ కిట్స్‌... ఫండ్స్‌ రైజ్‌ చేసి తెచ్చిస్తానని చెప్పండి. వాళ్లెంత సంతోషపడతారో గమనించండి. అలాంటి పిల్లలను కలిస్తే మీ మనసు ఎప్పుడూ హెల్ప్‌ చేయడం గురించే ఆలోచిస్తుంది. 

ఓల్డ్‌ ఏజ్‌ హోమ్స్‌: పిల్లలూ... ఇంట్లో అమ్మమ్మను, నానమ్మను చూసి ఉంటారు కదా. కాని అందరు అమ్మమ్మలకూ అలా ఇల్లు ఉండదు. వాళ్లు ఉండే చోటు ఉంటుంది. అలాంటి చోటుతో మీ అమ్మా నాన్నలతో వెళ్లండి. తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు, బామ్మలు, అవ్వలు అక్కడ చాలామంది ఉంటారు. వారికి మీలాంటి చిన్న పిల్లలను చూస్తే చాలా సంతోషం. వారిని తాతా, అమ్మమ్మా అని పలకరించండి. 

చాలా హ్యాపీ పీలవుతారు. కబుర్లు చెప్పండి. ఫ్రూట్స్, బిస్కెట్స్‌ ఇవ్వండి. వారి దగ్గర అవసరమైన మెడిసిన్స్‌ ఉన్నాయా లేదా అడగండి. ఎవరికైనా అవసరం ఉంటే మీ పేరెంట్స్‌కు చెప్పి వాళ్లకు హెల్ప్‌ చేయండి. ఎవరికైనా హ్యాండ్‌ స్టిక్‌ ప్రెజెంట్‌ చేయండి. వాళ్లు హ్యాపీ ఫీలయ్యి బ్లెస్‌ చేస్తే మీకు హ్యాపీగా అనిపిస్తుంది.

బట్టలు పంచుదామా
ఈ సమ్మర్‌ హాలిడేస్‌లో మీ బంధువులను, ఫ్రెండ్స్‌ను అడిగి 5 ఇయర్స్‌ నుంచి 12 ఇయర్స్‌ వరకూ వయసున్న అబ్బాయిల, అమ్మాయిల యూజ్‌ చేయని బట్టలు ఏమైనా ఉంటే ఇమ్మని అడగండి. చాలామంది దగ్గర ఒకటి రెండుసార్లు వేసుకొని మరి వేయకుండా మానేసిన బట్టలు కప్‌బోర్డుల్లో ఉంటాయి. అలాంటివన్నీ తెప్పించండి. 

అమ్మకు చెప్తే ఎవరైనా టైలర్‌ అంకుల్‌కు చెప్పి ఏవైనా బటన్స్, కుట్టు అవసరం అయితే చేయిస్తుంది. నాన్నకు చెప్తే ఐరన్‌ చేయించే ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు వాటిని చక్కగా పెయిర్స్‌గా సర్దండి. ఆ తర్వాత మీకు దగ్గరగా ఉన్న బస్తీలోని పిల్లలకు పంచండి. వాళ్లు పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకెళతారు.

సేవ చేయడం అంటే ఏమిటంటే మనకు ఉన్నది లేని వారితో పంచుకోవడం. మీరు బాగా చదువుతారు కదా. మీ హౌస్‌హెల్ప్‌ వాళ్ల పిల్లలకు రోజూ సాయంత్రం పూట ట్యూషన్‌ చెప్పినా సేవే. పలక ఇచ్చినా సేవే. నోట్స్‌ కొనిచ్చినా సేవే. సేవను అలవాటు చేసుకొని ఈ సమ్మర్‌ను మీనింగ్‌ఫుల్‌ చేసుకోండి.      

(చదవండి:  ఈ సమ్మర్‌లో సరదా సరదాగా ఈ పనులు నేర్చుకోండి..!         )            

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)