Breaking News

ఏసీతో పనిలేకుండానే హీట్‌ని బీట్‌ చేద్దాం ఇలా..!

Published on Fri, 05/02/2025 - 16:50

సూర్యుడి ప్రతాపం రోజు రోజుకి ఎక్కువవుతోంది. పది దాటితో బయటికి రావడమే కష్టంగా ఉంది ఈ సమ్మర్‌లో. ఇక రాత్రిళ్లు ఉక్కపోతలు, తట్టుకోలేని ఉడుకుతో కంటిమీద కునుకు పడితే ఒట్టు అంటూ వాపోతుంటారు ప్రజలు. ఆరుబయట సేద తీరదామన్న..పక్కపక్కనే బిల్డింగ్‌లు ఉండటంతో గాల్పు కొడుతూ వేడిగా ఉంటుంది. రవ్వంత గాలి కూడా రాదు. ఏసీ లేనిదే పనికాదేమో అన్నంతగా సమ్మర్‌ తారెత్తిస్తుంటుంది. అలాంటప్పడు ఏసితో పనిలేకుండా తక్కువ ఖర్చుతోనే ఇంటిని చల్లగా మార్చుకుని హాయిగా నిద్రపోవచ్చు. అదెలాగా చూద్దామా..!.

ఇంట్లోనే ఫ్యాన్‌తో..
బయటి చల్లగాలి లోపలికి వచ్చేలా కిటికీ దగ్గర ఉండే ఫ్యాన్‌ను ఉంచండి లేదా గదిలోపల గాలిప్రసరణ మెరుగుపరుచుకునేలా సీలింగ్‌ లేదా స్టాండింగ్‌ ఫ్యాన్‌ను ఉపయోగించండి. రాత్రి సమయంలో వేడి గాలిని బయటకు నెట్టేలా కిటికీలో బయటకి ఎదురుగా ఫ్యాన్‌ను ఉంచండి. అలాగే ఇత ఓపెనింగ్‌ల నుంచి చల్లని గాలి లోపలకు వచ్చేలా చూసుకోండి

కర్టెన్లు లేదా బ్లైండ్‌లతో మూసి ఉంచడం
నేరుగా సూర్యకాంతి గదిలో పడకుండా నిరోధించాలి. అంటే కిటికీలు మూసేయడం. కర్టెన్లు, బ్లైండ్‌లతో కవర్‌ చేయడం లేదా తడికల్లాంటివి ఏర్పాటు చేసుకోవడం. లేతరంగు లేదా ఇన్సులేటెడ్ కర్టెన్లు ఉపయోగించడం మంచిది.ఇవి 40% వరకు వేడిని తగ్గిస్తాయి.

రాత్రిపూట గాలి ప్రసరణ కోసం కిటికీలు తెరవడం
ఫ్యాన్‌ ముందు మంచు నీరు లేదా మాములు నీళ్లు బకెట్‌ ఉంచడం..బాష్పీభవన శీతలీకరణను సృష్టించడానికి ఫ్యాన్ ముందు ఒక బకెట్‌ మంచుగడ్డ లేదా చల్లని నీటిని ఉంచండి. ఈ పద్ధతిఫ్యాన్‌ద్వారా వచ్చే గాలిని చల్లబరుస్తుంది. ఇది పొడి వాతావరణంలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

నేలపై పడుకోవడం..
వేడిగాలి పెరుగుతుంది కాబట్టి నేలపే కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల చల్లదనంగా అనిపిస్తుంది.

తేలికైనా.. గాలి ఆడే దుస్తులు ధరించడం
తేమను దూరం చేసి.. చర్మం శ్వాస తీసుకోవడానికి వీలు కల్పించే కాటన్ లాటి తేలికైన వదులు దుస్తులను ధరించాలి. ఇవి తేమను దూరం చేస్తాయి. చర్మం శ్వాస తీసుకోవడానికి అనుమతించడమే గాక శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి

పరుపు, దిండ్లు చల్లగా ఉండేలా చేయడం..
పడుకునే ముందే..బెడ్‌షీట్లు, దిండ్లు, పరుపు చల్లగా ఉండేలా కేర్‌ తీసుకుంటే హాయిగా నిద్రపట్టేస్తుంది.

తడి తువ్వాళ్లు లేదా స్ప్రే బాటిళ్లు..
తడి తువ్వాళ్లు వేయడం లేదా చల్లటి నీటితో నిండిన స్ప్రే బాటిల్ రిఫ్రెషింగ్ చల్లదనాన్ని అందిస్తుంది. నిద్రించడానికి ముందు  మంచం మీద తడిగా ఉన్న టవల్‌ను ఉంచండి తద్వారా పరుపు చల్లగా ఉంటుంది. 

వేడిని ఉత్పత్తి చేసే వాటిని నివారించడం
ఉపయోగంలో లేనప్పుడు ఇన్‌కాండిసెంట్ బల్బులు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌లను ఆపివేయండి.  తక్కువ వేడిని విడుదల చేసి, శక్తిని ఆదా చేసే LED బల్బులను ఎంచుకోండి.

తేలికగా తినండి, హైడ్రేటెడ్‌గా ఉండండి
హైడ్రేటెడ్‌గా ఉండటానికి తగినంత నీరు తాగండి. ప్రోటీన్ అధికంగా ఉండే భోజనాలను నివారించి.. పండ్లు, స్మూతీస్ వంటి తాజా చల్లని ఆహారాలు తీసుకోవడం మంచిది.

ఈ పద్ధతులన్ని ఎయిర్ కండిషనింగ్ ఖర్చు లేకుండా వేడి వాతావరణంలో సౌకర్యవంతంగా ఉండటానికి సహాయపడతాయి.

(చదవండి: స్లిమ్‌గా బాలీవుడ్‌ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా.. మౌంజారోతో పది కిలోలు..!)

 

 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)