Breaking News

వేసవి సెలవులు...అమ్మాయిల నైపుణ్యానికి మెరుగులు

Published on Wed, 04/30/2025 - 16:18

ఘట్‌కేసర్‌: వేసవి సెలవులు అనగానే విద్యార్థులను అమ్మమ్మ, బంధువుల ఇళ్లు, విహారయాత్రలు పంపిస్తుంటారు. నేటి పోటీ ప్రపంచంలో అందరిలో ముందుంటేనే గుర్తుంపు ఉంటుంది. వేసవి సెలవుల్లో విద్యార్థులు అదనపు నైపుణ్యం సంపాదించడంపై దృష్టి సారిస్తే జీవితంలో రాణించవచ్చు. తద్వారా శారీరక, మానసిక వికాసం పెంపొందుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అందుకే వేసవి సెలవులు వృథా చేయకుండా పిల్లలకు ఏదో ఒకటి నేరి్పంచాలని తల్లితండ్రులు భావిస్తున్నారు. ఫీజులు చెల్లించి మరీ వారి ప్రతిభకు సానబెడుతు  పిల్లల అభిరుచులకు అనుగుణంగా పలు అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్న వారు ఫీజులు చెల్లించి శిక్షణ పొందుతుండగా పేద పిల్లలకు ఆ అవకాశం లభించడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థుల కోసం నూతనంగా వేసవి శిబిరం నిర్వహిస్తున్నామని, శిక్షణ అనంతరం విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేస్తామని ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ రాము, వైస్‌ ప్రిన్సిపాల్‌ రాములు తెలిపారు.    

ప్రతిభకు సాన... 
పేద విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాసంస్థల కార్యదర్శి అలుగు వర్షిని నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల్లో దాగిఉన్న నైపుణ్యం వెలికి తీసేందుకు ఉచిత వసతి, భోజన సౌకర్యంతో పాటు సుశిక్షుతులైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ ఎదులాబాద్‌ లలిత కళల పాఠశాలలో రాష్ట్రంలోని ఒక్కో గురుకులం నుంచి ప్రతిభగల ఐదుగురి చొప్పున సుమారు 1200 మంది విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహిస్తున్నారు. అందులో పెయింటింగ్, డ్రాయింగ్, మట్టితో బొమ్మలు, కార్డున్, ఫొటోగ్రఫీ, నకాసీ పెయింటింగ్, అల్లికలు, జర్నలిజం వేద గణితం, చేతిరాత, బంజారా ఎంబ్రాయిడరీ అంశాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు అదనపు నైపుణ్యం పెంపొందుంచుకునే అవకాశం లభిస్తుంది. విద్యార్థులు ఉత్సాహంగా శిక్షణలో పాల్గొంటున్నారు.   

సమయం వృథా చేయకూడదని... 
వేసవి సెలవుల్లో సమయం వృథా చేయకూడదని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల   ప్రోద్భలంతో వేసవి శిబిరానికి వచ్చాను. బంజారా ఎంబ్రాయిడరీలో శిక్షణ పొందుతున్నా. అందరితో కలిసి నేర్చుకోవడం సంతోషంగా ఉంది.  – రిషిత, సాంఘిక సంక్షేమ గురుకుల  బాలికల పాఠశాల ఆలేరు 

నైపుణ్యం పెంచుకునే అవకాశం... 
వేసవి శిబిరంలో అరుదైన కళ నకాసీ పెయింటింగ్, వేదిక్‌ మ్యాథ్స్‌లో శిక్షణ పొందుతున్నాను. వ్యక్తిగత నైపుణ్యం పెంపొందించుకునే అవకాశం లభింంది. జీవితంలో మరిపోలేని శిబిరం. వేసవి శిక్షణ శిబిరం నిర్వాహణ చాలా బాగుంది. –లోహిత, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆలేరు 

ప్రతిభను వెలికి తీయాలని... 
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల విద్యార్థుల ప్రతిభకు  సానబెట్టడానికి వేసవి శిబిరం నిర్వహిస్తున్నాం. జీవితంలో విద్యార్థులు రాణించడానికి శిబిరం తోడ్పడుతుంది. సెలవులు సద్వినియోగం చేసుకునే వారికి బంగారు అవకాశం లభించింది.– వింధ్యారాణి, జోనల్‌ ఆఫీసర్‌ 
 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు