Breaking News

ఫ్యాషన్‌లో తండ్రికి తగ్గట్టే : రూ 1.4 కోట్ల వాచ్‌తో మెరిసిన బ్యూటీ

Published on Sat, 04/19/2025 - 15:32

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ కమార్తె సుహానా ఖానా మరో సారి తన  ఫ్యాషన్‌ స్టైల్‌ను చాటుకుంది. అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్, అనన్య పాండే నటించిన తాజా చిత్రం కేసరి చాప్టర్ 2, ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చింది.అంతకుముందు (ఏప్రిల్ 17న) ఈ చిత్ర నిర్మాతలు ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా తన స్నేహితురాలు  నటి అనన్య పాండేకు సపోర్ట్‌గా ఈవెంట్‌కు విచ్చేసింది సుహానా.  ఆఫ్-షోల్డర్ ఫ్లోవీ బ్లాక్ డ్రెస్‌,  బ్లాక్‌ హీల్స్‌తో దృష్టిని ఆకర్షించింది, అంతేకాదు కోట్ల విలువైన వాచ్‌ను కూడా ధరించడం హాట్‌ టాపిక్‌గా నిలిచింది.

తండ్రిలాగే సుహానాకు కూడా ప్రీమియం వాచీలంటే చాలా ఇష్టమట. జోయా అక్తర్ 2023 చిత్రం ది ఆర్చీస్‌తో అరంగేట్రం చేసిన సుహానా ఖాన్  ఇటీవల కేసరి 2 ప్రీమియర్‌లో  రూ. 1.4 కోట్ల విలువైన అల్ట్రా  లగ్జరీ వాచ్ ధరించి కనిపించింది. రెవర్సో ట్రిబ్యూట్ డ్యూఫేస్‌  టూర్బిలియన్‌ ( Jaeger-LeCoultre Reverso Tribute Duoface Tourbillon) దీంతో ఇది ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంది.  

సస్టైనబుల్‌ ఫ్యాషన్‌ను సమర్ధించే సుహానా ఈ వాచ్ ధరించి కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఖుషీ కపూర్ , ఇబ్రహీం అలీ ఖాన్
నాదానియన్ ప్రీమియర్‌లో కూడా ఇదే వాచ్‌ను ధరించింది.  దుస్తులను పునరావృతం చేయడానికి అభ్యంతరం చెప్పదు.  అనంత్ అంబానీ వివాహానికి కూడా అదే చేసింది. మనీష్ మల్హోత్రా దీపావళి వేడుకకు తాను గతంలో ధరించిన దుస్తులనే ధరించింది.  ముఖ్యంగా జాతీయ అవార్డును అందుకోవడానికి అలియా తన  పెళ్లి చీరను  మళ్లీ ధరించిడం తనన ఆకట్టుకుందని చెప్పుకొచ్చిందీ స్టార్‌కిడ్.

ఇక  సుహానా కరియర్‌ విషయానికి వస్తే ఆర్చీస్ తర్వాత  తండ్రి మూవీ కింగ్‌లో నటిస్తోంది.  20 ఏళ్ళ తరువాత  సిద్ధార్థ్ ఆనంద్  షారూక్‌తో మూవీ  ప్రకటించాడు.   జవాన్ , పఠాన్ చిత్రాల అద్భుతమైన విజయం తర్వాత షారుఖ్ ఖాన్ తదుపరి పెద్ద ప్రాజెక్ట్ కింగ్.  ఈ యాక్షన్ డ్రామాలో సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ , దీపికా పదుకొనే అతిధి పాత్రలో నటిస్తున్నారు.

కాగా సుహానా తండ్రి షారుఖ్ ఖాన్ దగ్గర విలాసవంతమైన గడియారాల  కలెక్షన్‌ ఉంది. 2024లో, అతను రూ.4.2 కోట్ల విలువైన ఆడెమర్స్ పిగ్యుట్ వాచ్ ధరించి  ఫ్యాన్స్‌ను ఆకర్షించాడు. అతను రూ.1.1 కోట్లకు పైగా విలువైన పటేక్ ఫిలిప్ ,రూ.6 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లె టూర్బిలియన్‌ కూడావాచ్‌ కూడా ఉంది. 

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)