Breaking News

ఎవరీ సుధారెడ్డి..? ఏకంగా 200 క్యారెట్లకు పైగా వజ్రాలు..

Published on Mon, 05/04/2026 - 16:33

MEIL గ్రూప్ డైరెక్టర్, భారతీయ వ్యాపారవేత్త, హైదరాబాదీ సుధా రెడ్డి, న్యూయార్క్‌లో జరిగే మెట్ గాలా2026లో మెరవనున్నారు. ఆమె ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఏడాది గాలా సుమారు 400 ప్రత్యేకమైన వస్తువుల ద్వారా ఏకంగా ఐదువేల ఏళ్ల నాటి శైలిని చాటిచెప్పే 'కాస్ట్యూమ్ ఆర్ట్' ప్రదర్శనను ఇతివృత్తంగా "ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్" అనే డ్రెస్ కోడ్‌ను ఎంచుకుంది. 

ఈ మెట్‌గాల కార్యక్రమంలో పాల్గొనే అతిరథమహులంతా తమ దుస్తులను సజీవ కళాఖండాలుగా కనిపించేలా మానవ శరీరం, కళాత్మక వ్యక్తికరణ మధ్య ఉన్న సుదీర్ఘ సంబంధాన్ని ప్రతిబింబించాలని ఆశిస్తున్నారు. గతంలో సుధా ప్రఖ్యాత భారతీయ డిజైనర్లు ఫల్గుణి షేన్ పీకాక్, తరుణ్ తాహిలియాని రూపొందించిన అద్భుతమైన దుస్తులను ధరించారు. ఈ ఏడాది ఫ్యాషన్‌ను ఒక కళారూపంగా పరిగణించే ఇతివృత్తం నేపథ్యంలో ఆమె సబ్యసాచి ముఖర్జీ లేదా మనీష్ మల్హోత్రా వంటి ప్రముఖ భారతీయులతో కలిసి పనిచేయనున్నట్లు అంతరంగిక వర్గాల సమాచారం. 

పారిస్ ఒలింపిక్స్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వంటి అనేక ఉన్నత స్థాయి అంతర్జాతీయ కార్యక్రమాలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ అత్యంత బిజీగా ఉండే ఆమె ఈ ఏడాది న్యూయార్క్‌లో జరగనున్న గాలా ఈవెంట్‌లో భారత్‌కి ప్రాతినిథ్యం వహిస్తూ.. కనిపించనున్నారు. 

ఇక సుధా అందం,  దాతృత్వ పరంగా ఆమెకు సాటిరారెవ్వరూ. ఆమె మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL)లో డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే సుధా రెడ్డి ఫౌండేషన్‌కు కూడా నాయకత్వం వహిస్తున్నారు, దీని ద్వారా ఆమె స్వచ్ఛంద ప్రాజెక్టులు, సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకోవడం వంటివి చేస్తుంటారు.

ఆమె ఎవరంటే..

సుధా రెడ్డికి కృష్ణ రెడ్డి అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఆ దంపతులకు మానస్, ప్రణవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఆమె 2024 మెట్ గాలాలో 200 క్యారెట్లకు పైగా వజ్రాలు ధరించి వార్తల్లో నిలవడమే కాదు  రెడ్ కార్పెట్‌పై తన ఉనికిని చాటిచెప్పేలా  ప్రపంచ దృష్టిని మరింతగా ఆకర్షించారు.

ఆమె  పుట్టి పెరిగింది విజయవాడలోనే. 19 ఏళ్లకే కృష్ణారెడ్డిని వివాహం చేసుకున్నారు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం తమ బంధానికి సహాయపడిందని, తామిద్దరూ కలిసే పెరిగామని రెడ్డి గతంలో చెప్పారు.

2026, మే 4, సోమవారం నాడు జరగనున్న మెట్ గాలా, ఈ ఈవెంట్‌లో అత్యధిక తారలు పాల్గొనే కార్యక్రమాలలో ఒకటిగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ ఏడాది సహ-అధ్యక్షులుగా బియాన్స్, నికోల్ కిడ్‌మన్, వీనస్ విలియమ్స్ ఉండగా, జెఫ్ బెజోస్, లారెన్ సాంచెజ్ బెజోస్ ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. 

కాగా, న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ఈ వేడుక ఘనంగా జరగనుంది. ఫ్యాషన్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వార్షిక వేడుక,. ఇది కాస్ట్యూమ్ ఇన్‌స్టిట్యూట్ కోసం నిధుల సేకరణ కార్యక్రమం. దీనిని ప్రతి ఏడాది మే మొదటి సోమవారం నిర్వహిస్తారు.

 

(చదవండి: హాట్‌టాపిక్‌గా నటి త్రిష తిరుపతి ఆలయ సందర్శన..! ఏకంగా అంత ఖరీదు..)
 

Videos

TVK విజయ్ కు తెలుగు హీరోలు శుభాకాంక్షలు

MGR తర్వాత.. విజయ్ రికార్డ్ TVK విజయ దుందుభి

విజయకి జేజేలు అయ్య.. అమ్మ.. అన్న

సినిమా నుంచి CM వరకు.. విజయ్ ప్రస్థానం

రియల్ జన నాయగన్, పార్టీ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు..

పొత్తుల్లేవు... జెండాలు మోసే కూలి కాదు విజయ్ తిరుగులేని ప్రస్థానం

Tamilnadu Results: MLA గా స్టాలిన్ ఓటమి...!

TVK సంచలనం. 50 ఏళ్ల పార్టీలను మట్టి కరిపించిన విజయ్

మా బావ గెలుపు చాలా ఆనందంగా ఉంది

దూసుకుపోతున్న విజయ్ మ్యాజిక్ ఫిగర్ దగ్గర TVK

Photos

+5

స్విట్జర్లాండ్ వేకేషన్‌లో పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్‌ (ఫొటోలు)

+5

కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ గ్లామరస్ పోజులు (ఫొటోలు)

+5

విజయ్‌ ఇంటి దగ్గర భారీ భద్రత.. అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

విజయ్‌ విజిల్‌ మోత.. రీసౌండ్‌ ఓ రేంజ్‌లోనే.. (ఫొటోలు)

+5

తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ.. తిరుమలలో త్రిష ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

43 ఏళ్ల 'యంగ్' హీరోయిన్ త్రిష బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆహ్లాదకర వేళ.. బీచ్‌లో సందడి (ఫొటోలు)

+5

గోపీచంద్ కొత్త సినిమా లాంచ్.. దర్శకుడిగా ఫైట్ మాస్టర్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌..సెలబ్రిటీల సంద‌డి (ఫొటోలు)