Breaking News

పసితనంతో మురిసిపోదాం

Published on Fri, 01/31/2025 - 01:07

ఉల్లిపాయకు అన్ని పొరలు  ఎలా వచ్చాయి? ఈ ప్రశ్న మీరు వేసుకున్నారా? సుధామూర్తి వేసుకున్నారు. దాని మీద కథ రాసి మనవరాళ్లకు వినిపించారు కూడా. ‘మీలో పసితనం ఉంటే మీ పిల్లల్లోని పసితనాన్ని కాపాడుతారు’ అంటున్నారు ఆమె.
‘నా మానసిక వయసు 12 ఏళ్ల లోపే ఉంచుకుంటాను...  అలా ఉంటే పిల్లల్లా ప్రతి చిన్నదానికి సంతోషపడతాం’ అన్నారామె. గురువారం మొదలైన జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌కు హాజరై ఆమె పిల్లల గురించి తల్లిదండ్రులకు  ఎన్నో పాఠాలు చెప్పారు.  వినండి.

‘టీచర్‌గా నేను పిల్లలకు 45 నిమిషాలు పాఠం చెప్తే అందులో పదిహేను నిమిషాలు ఆ పాఠానికి సంబంధించిన కథలు చెప్పేదాన్ని. లేదా ఆ సబ్జెక్ట్‌ చుట్టూ ఏవో కథలు చెప్పేదాన్ని. నా విద్యార్థులందరూ జీవితంలో చక్కగా సెటిల్‌ అయ్యారు. వారు కనిపించినప్పుడు మీకు జావా, పాస్కల్, సి ప్లస్‌ చెప్పాను... అవేమైనా జీవితంలో ఉపయోగపడ్డాయా అనడుగుతాను. లేదు టీచర్‌.. మీరు చెప్పిన కథలే ఉపయోగపడ్డాయి అంటారు.

 కథల వల్ల అంత ప్రభావితం అవుతారు పిల్లలు’ అన్నారు సుధా మూర్తి. జైపూర్‌లో మొదలైన జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌ తొలిరోజు ఆమె పాల్గొని ‘ది చైల్డ్‌ విత్‌ ఇన్‌’ అనే అంశం మీద మాట్లాడారు. ‘ప్రపంచ దేశాల్లో పిల్లల కథలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి. కాని మన భారతదేశంలోనే అన్ని రకాల పిల్లల కథలు దొరుకుతాయి. కాని ఇప్పుడు పిల్లలకు కథలు చెప్పడం లేదు.

 అమ్మమ్మ, నానమ్మలు టీవీ సీరియళ్లతో తల్లిదండ్రులు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలతో బిజీగా ఉంటున్నారు. నా చిన్నప్పుడు కరెంటు లేకపోవడం వల్ల, వేరే వినోద సాధనాలు లేకపోవడం వల్ల నా ఊహాశక్తి బాగా పెరిగింది. కృష్ణుడి కథలు వింటే ఆ కథ చుట్టూ ఎన్నో ఊహలు చేసేదాన్ని. ఇప్పుడు పిల్లల్ని సోషల్‌ మీడియా నుంచి తప్పించలేము. అది ఊహను చంపేస్తుంది. అయితే వారికి సోషల్‌ మీడియాతో గడిపే సమయానికి రేషన్‌ విధించి కథలు వినిపించాలి’ అన్నారామె.

అక్షయపాత్ర బదులు కుకర్‌
లండన్‌లో ఉండే తన మనుమరాలు అనుష్కకు ‘ద్రౌపది–అక్షయపాత్ర’ కథ చెప్తే ఆ చిన్నారి దానిని తన పద్ధతిలో తిరగేసి చెప్పడాన్ని నవ్వుల మధ్య వివరించారు సుధామూర్తి. ‘మా మనవరాలికి అక్షయపాత్ర కథ చెప్పాను. మరుసటి రోజు తిరిగి చెప్పమన్నాను. అయితే నా మనమరాలు తన పద్ధతిలో చె΄్తానంది. అక్షయపాత్ర బదులు ఇన్‌స్టాంట్‌ పాట్‌ (కుకర్‌)ను పెట్టింది. అయితే అమ్మమ్మ... మనం దానిని శుభ్రంగా కడక్కుండా వండితే డయారియా వస్తుంది మైండిట్‌ అని కూడా చెప్పింది’ అన్నారు సుధామూర్తి.

‘అంటే పిల్లలకి కథ చెప్తే వాళ్లకు తెలిసిన పద్ధతిలో మార్చి తమ క్రియేటివిటీని జోడిస్తారు. పిల్లలకు చిన్న విషయాలు కథలుగా మార్చి సరదా పుట్టించాలి. ఉల్లిపాయకు అన్ని పొరలు ఎందుకుంటాయి, మామిడి తియ్యగా... మిర్చి కారంగా ఎందుకు ఉంటుంది... ఇలాంటి ప్రశ్నలు అడిగి వాటికి కథ అల్లి చెప్తే ఆనందిస్తారు. నాకు తెలిసి పిల్లలకు లావుగా ఉన్న పాత్రలు, పిసినారి పాత్రలు నచ్చుతాయి. పిసినారులకు శాస్తి జరిగితే చాలా సంతోషపడతారు’ అన్నారామె.

కష్టమొస్తే ఆంజనేయుడు– సంజీవని
‘పిల్లలు పాజిటివ్‌ కథలు ఇష్టపడతారు. చెడుకు చెడు జరగాల్సిందే. యుక్తి ఇష్టపడతారు. కుండలో రాళ్లు వేసే కాకి కథ సింధు నాగరికత నుంచి ఉంది. ఎందుకు ఆ కథను కాపాడుకున్నామో ఆలోచించాలి. నా వరకు నాకు కష్టమొస్తే స్ఫూర్తినిచ్చేది ఆంజనేయుడు– సంజీవని కథ. లక్ష్మణుడి కోసం సంజీవని తేవడానికి వెళతాడు ఆంజనేయుడు. అయితే ఆ మొక్క ఏదో కనిపెట్టలేడు. 

అంటే ప్రాబ్లమ్‌లో పడ్డాడు. అప్పుడు ఏం చేశాడు? తన శరీరాన్ని భారీగా పెంచి మొత్తం సంజీవని పర్వతాన్నే అరచేతిలో తీసుకొచ్చాడు. మనం కూడా అలా ఉండాలి.ప్రాబ్లం వస్తే మనం దాని కంటే పెద్దవాళ్లం అయ్యి తల దించి దాని వైపు చూడాలి. దానిని చిన్నగా చేయాలే తప్ప చిన్నగా అయిపోకూడదు. కథలు సమస్యలను ఇలా సులువు చేయమని చెబుతాయి. పిల్లలకు కథలతో ఆ శక్తి ఇవ్వాలి’ అన్నారు సుధామూర్తి.

పసితనం కాపాడుకోండి
‘మనందరం పసిపిల్లలు ఎవరు కనిపించినా దగ్గర తీస్తాం. నవ్వుతూ కబుర్లు చెబుతాం. మరి మనల్ని  ఇప్పుడెందుకు ఎవరూ అంత ప్రేమగా పలకరించి ఇష్టపడరు? అంటే ఆ బాల్య స్వభావం, కల్మషం లేని పసితనం పెద్దయ్యేకొద్దీ్ద పోయిందని అర్థం. నేనైతే చిన్నప్పటి సుధగా ఉండటానికి ఊహల్లోకి వెళ్లిపోతాను. ఈ పెద్ద సుధకు లోకం బాగా అర్థమవుతుంది. చిన్నప్పటి సుధకైతే అందరూ అన్నీ ఇష్టమే. అలా ఉంటే మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుంది’ అని ముగించారామె.

– సాక్షి ప్రత్యేక ప్రతినిధి

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)