Breaking News

నా ఉద్దేశంలో ఆ పండుగ అర్థం.. సుధామూర్తి పోస్ట్‌ వైరల్‌

Published on Tue, 08/20/2024 - 11:15

రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి రక్షా బంధన్‌ సందర్భంగా ఒక సందేశాన్ని పంచుకున్నారు. పండుగ వెనుక ఉన్న కథను షేర్‌ చేసుకున్నారు. ఇది సోషల్‌ మీడియాలో చర్చకు తెరతీసింది. అంతకు మించే రాఖీ పండుగకు సంబంధించిన కథలు ఉన్నాయంటూ పోస్టలు పెట్టారు. ఇంతకీ ఆమె షేర్‌ చేసుకున్న కథ ఏంటంటే.. 

రక్షా బంధన్‌ తనకు ఒక ముఖ్యమైన పండుగా అని చెప్పారు. ఇది ఒక సోదరికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎల్లప్పుడూ నాకు సహాయం చేయాలని సూచించే రక్షయే ఈ చిన్న దారం అని అన్నారు. అందుకు సంబంధించిన గాథను కూడా చెప్పుకొచ్చారు. "మేవార్‌ రాజ్యపు కర్ణావతి తన రాజ్యం శత్రు రాజుల దాడికి గురై సంకట స్థితిలో ఉన్నప్పుడూ పొరుగున ఉన్న మొఘల్‌ చక్రవర్తి హుమాయున్‌కు ఒక చిన్న దారం పంపింది. ఇది తాను ఆపదలో ఉన్నాను, దయచేసి నన్ను మీ సోదరిగా పరిగణించి రక్షించండి అని ఆ దారం రూపంలో హుమాయున్‌ రాజుకి సందేశం పంపింది. 

అయితే హుమాయున్‌ ఆ దారం అర్థం ఏంటో అస్సలు తెలియదు. తన మంత్రుల ద్వారా అసలు విషయం తెలుసుకుని రక్షించేందుకు ఢిల్లీ పయనమయ్యాడు. అయితే సమయానికి హుమాయున్‌ చేరుకోలేకపోవడంతో కర్ణావతి మరణించింది." అని సుదామూర్తి పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే వినయోగదారులు ఈ వ్యాఖ్యలతో విభేధించడమే గాక మహాభారత కాలంలోనే రక్షాబంధన్‌ గురించి ఉందంటూ నాటి ఘటనలను వివరించారు. శిశుపాలుడిని చంపడానికి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తుండగా శ్రీకృష్ణుడి వేలుకి గాయమవ్వడం జరుగుతుంది.

వెంటనే ద్రౌపది చీర కొంగు చింపి కట్టిందని, అందుకు ప్రత్యుపకారంగా కౌరవులు నిండు సభలో అవమానిస్తున్నప్పుడూ ‍ద్రౌపదికి చీరలు ఇచ్చి కాపాడాడని అన్నారు. అలాగే బలిచక్రవర్తి పాతాళ రాజ్యాన్ని రక్షిస్తుండేవాడు. అతడు తన భక్తితో విష్ణువుని ప్రసన్నం చేసుకుని ఆయన్నే రాజ్యనికి కాపలాగా ఉంచాడు. అయితే లక్ష్మీదేవి ఈ విషయం తెలుసుకుని ఈ శ్రావణ పూర్ణిమ రోజున రాఖీ కట్టి తన భర్తను దక్కించుకుందని పురాణ వచనం అంటూ సుధామూర్తి పోస్ట్‌కి కౌంటర్‌ ఇస్తూ పోస్టులు పెట్టారు. కాగా, చిన్నప్పుడు తాను తెలుసుకున్న రాఖీ పండగ కథలను తెలియజేయాలనుకోవడమే తన ఉద్దేశమని సుధామూర్తి వివరణ ఇచ్చారు. 

(చదవండి: 'అమ్మ అపరాధం'ని అధిగమించి గొప్ప పారిశ్రామిక వేత్తగా..!)

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)