Breaking News

'ఉపవాసం' వల్ల గుండె జబ్బులు వస్తాయా?

Published on Tue, 03/19/2024 - 13:45

'ఉపవాసం' ఆరోగ్యానికి చాలా మంచిదని భావించేవాళ్లం. వారానికి ఒక్కసారి ఉపవాసం ఉంటే అధిక కొలస్ట్రాల్‌ కరిగి, క్యాలరీలు ఖర్చు అవ్వుతాయని చెప్పేవారు. దీనివల్ల ఆరోగ్యం మెరగవుతుందని అనేవారు నిపుణులు. ఈ 'ఉపవాసం' అనేది శరీరంలోని శక్తిని బర్న్‌ చేసే ఒకలాంటి వ్యాయామమేనని పదేపదే చెప్పేవారు వైద్యులు. అయితే అదంతా సరైనది కాదని వాదిస్తున్నారు యూఎస్‌ శాస్త్రవేత్తలు. తాజా అధ్యయనంలో చాలా ఆసక్తికర షాకింగ్‌ విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటంటే..

అధిక బరువు సమస్యకు ఉపవాసం అనేది ఒక మంచి ఔషధం లాంటిదనేవారు. భోజన సమయాన్ని ఎనిమిది గంటలకు పరిమితి చేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు. అంతేగాదు గుండె జబ్బులతో మరణించే అవకాశాలు 91% పెరుగుతుందన్నారు. చికాగోలోని అమెరికన్‌ హార్ట్‌ అసోసీయేషన్‌ ఈ తాజా పరిశోధనను ప్రచురించింది. ఉపవాసాన్ని మన జీవనశైలిలో భాగం చేసుకుంటే బరువు అదుపులో ఉంటుందని, ఇలా చాలమంది బరువు తగ్గిన దాఖాలాలు కూడా ఉన్నాయని నిరూపితమైన అధ్యయనాల ఫలితాల సంగతేమిటని పలువురు శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు.

అయితే చికాగో శాస్త్రవేత్తల బృందం యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ చెందిన నెషనల్‌ హెల్త్‌ అండ్‌ న్యూట్రిషన్‌ దాదాపు 20 వేల మంది పెద్దలపై పరిశోధనలు నిర్వహించింది. దాదాపు 12 నుంచి 16 గంటల వరకు అప్పడప్పుడూ ఆహారాన్ని తీసుకోని వారు, తీసుకున్న వారు మద్య ఉన్న వ్యత్యాసాన్ని స్టడీ చేశారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారంతా సగటు వయసు 48 ఏళ్లు. ఇక అప్పుడప్పుడూ ఉపవాసం చేస్తున్న వారిలో మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధుల ప్రభావం తక్కువుగా ఉన్నట్లు గుర్తించారు. అయితే నిర్ణిత సమయంలో ఆహారం తీసుకునే వారితో పోల్చగా..కొన్ని గంట సమయానికి ఆహారాన్ని పరిమితం చేసిన వారిలో పలు సమసయలు కనిపించాయన్నారు. వారిలో హృదయ నాళ సమస్యలు ఉత్ఫన్నమయ్యి చనిపోయే అవకాశం ఉన్నట్లు తేలిందన్నారు.

ఈ పరిశోధనను శాస్త్రవేత్తలు సుమారు 2003 నుంచి 20019 వరకు చేశారు. ఆయా కాలాల మధ్య చనిపోయిన బాధితుల మరణాల డేటా ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఇది ఎంత వరకు కరెక్ట్‌ అనేదానిపై మరింత లోతుగా పరిశోధన చేయాల్సిఉందని యూకే ప్రోఫెసర్‌ కీత్‌ ఫ్రాయిన్‌ అభిప్రాయపడ్డారు. నిజానికి జీర్ణశయానికి ఒకరోజు విరామం ఇచ్చి.. ఈజీగా క్యాలెరీలను తగ్గించేందుకు ప్రసిద్ధ సాధనం ఈ "ఉపవాసం".

అలాంటిది ఆరోగ్యానికి హానికరం అనడం సరైనది కాకపోవచ్చిని అన్నారు. ఇది ఎంత వరకు నిజం అనేదానిపై మరిన్ని పరిశోధను చేయాల్సి ఉందన్నారు. అలాగే అడపాదడపాగా ఉపవాసం నిజంగా ఆయా వ్యక్తులు చేశారా, వారికి ఇంకేమైన అలవాట్లు ఉన్నాయనేది కూడా పరిగణలోకి తీసుకోవాలని చెబుతున్నారు యూకే ఫ్రొఫెసర్‌.

(చదవండి: డ్యాన్స్‌ చేస్తే గుండెపోటు వస్తుందా? ఎందుకిలా పిట్టల్లా రాలిపోతున్నారు!)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)