Breaking News

అలాంటి జన్యువులు ఉంటే బరువు తగ్గడం ఈజీ..!

Published on Sun, 10/13/2024 - 16:41

14 'స్కిన్నీ జన్యువులు'(సన్నగా ఉండే జన్యువులు) బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తాయని అధ్యయనం పేర్కొంది. ఇలాంటి జన్యువులు లేని వారితో పోలిస్తే..ఈ 14 'స్కిన్నీ జన్యువులు వ్యాయమం చేసిన వాళ్లే వేగంగా బరువు తగ్గుతారని పరిశోధనలు చెబుతున్నారు. వీళ్లు జస్ట్‌ ఎనిమిది వారాల పరుగుకే దాదాపు 11 పౌండ్లు కోల్పోతారట. ఈ పరిశోధన బరువుకి సంబంధించిన కీలక జన్యువుల గురించి వెల్లడించింది. 

ఈ జన్యవులు వ్యాయామం, జీవనశైలి మార్పులకు అనుగుణంగానే సక్రియం చేయబడి, బరువు తగ్గడం జరుగుతుందని యూనివర్శిటీ ఆఫ్ ఎసెక్స్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్, రిహాబిలిటేషన్ ఉపాధ్యాయుడు హెన్నీ చుంగ్‌ అన్నారు. అయితే యూకేలోని కొన్ని పరిశోధనలు మాత్రం వ్యాయామం జోక్యం లేకుండా జన్యువులు తమ నిజమమైన సామర్ధ్యాన్ని చూపించవని చెబుతోంది. అంటే ఇక్కడ తగిన వ్యాయామం, సరైన జన్యువులతోనే మనిషిలో ఎలాంటి జన్యువులు ఉన్నాయనేది చెప్పగలరు వైద్యులు.  

అందుకోసం 20 నుంచి 40 ఏళ్ల వయస్సు గల దాదాపు 38 మందిపై పరిశోధన చేశారు. వారిలో సగం మందికి సాధారణ ఆహారం, అలవాట్లను మార్చకుండా.. వారానికి మూడుసార్లు 20 నుంచి 30 నిమిషాలు పరుగెత్తమని సూచించారు. మిగిలిన సగం మంది నియమనిబంధనలతో కూడిన ఆహారం, జీవనశైలి ఫాలో అయ్యారు. అయితే పరిశోధనలో 62% బరువు తగ్గడంలో జన్యు శాస్త్రమే కీలకమని అధ్యయనం పేర్కొనగా.. 37% మాత్రం వ్యాయామం, జీవనశైలి కారకాలతో ముడిపడి ఉందని తేలింది. 

ఈ పరిశోధన జన్యు ప్రొఫెల్‌ని అర్థం చేసుకోవడంలో వ్యాయామం, చక్కటి డైట్‌ ఉపకరిస్తుందని నిర్ధారణ అయ్యింది. అయితే ప్రతి ఒక్కరూ జన్యుపరమైన వాటితో సంబంధం లేకుండా వ్యాయమంతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందడం ముఖ్యమని చెప్పారు పరిశోధకులు. ఇది హృదయ ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచి తద్వారా బరువుని అదుపులో ఉంచుతుందని చెబుతున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ వర్కౌట్‌లు చేయాలని సూచించారు. ఈ అధ్యయనం జర్నల్ రీసెర్చ్ క్వార్టర్లీ ఫర్ ఎక్సర్‌సైజ్ అండ్ స్పోర్ట్‌లో ప్రచురితమయ్యింది. 

(చదవండి: ఖఫ్లీ గోధుమలు గురించి తెలుసా..! ఎందుకు తినాలంటే..!)
 

#

Tags : 1

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)