Breaking News

రక్తంలో మైక్రోప్లాస్టిక్స్‌ తొలగించవచ్చా? విద్యార్థి సరికొత్త ప్రయోగం!

Published on Fri, 10/30/2026 - 09:56

ప్లాస్టిక్‌ వస్తువులు కంటికి కనిపిస్తాయి. కాని కాలక్రమేణా అవి చిన్నచిన్న ముక్కలుగా విడిపోయి పరిసరాలలో కలిసిపోతాయి. మనం తినే ఆహార పదార్థాలలోనూ అవి చేరిపోతాయి. కానీ అవే అతి సూక్ష్మ కణాలుగా మారి మన శరీరంలోకి చేరితే? ఎంత ప్రమాదమో కదా.. మరి ఆ రక్తంలోకి చేరిన కణాలను బయటకు తీయగలిగితే? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నాడు 12వ తరగతి విద్యార్థి సురమృత్‌ సింగ్‌ కోహ్లీ. రోబోటిక్స్‌పై ఆసక్తితో మొదలైన అతని ప్రయాణం ఇప్పుడు బయోమెడికల్‌ పరిశోధన వైపు సాగుతోంది.

రాజస్థాన్‌కు చెందిన సురమృత్‌ జైశ్రీ పెరివాల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్నాడు. 2018 నుంచే అతడు రోబోటిక్స్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. ఇంజినీరింగ్‌ పరిజ్ఞానంతో నిత్య జీవిత సమస్యలకు పరిష్కారాలు వెతకాలనే ఆలోచన అతడిని మైక్రోప్లాస్టిక్స్‌ అంశం వైపు నడిపించింది. బ్రౌన్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ థామస్‌ వెబ్‌స్టర్‌ మార్గదర్శకత్వంలో మొదలైన అతని ప్రాజెక్టు, 2025 ఆగస్టులో ముంబయిలోని రీల్యాబ్స్‌ పరిశోధనా కేంద్రంలో డాక్టర్‌ అభిజిత్‌ భోపాడికర్‌ పర్యవేక్షణలో కొనసాగింది. 

‘నానోక్లియర్‌’ పేరుతో రూపొందించిన ఈ ప్రయోగాత్మక నమూనాలో సుమారు 91 నానోమీటర్ల అయస్కాంత నానో పార్టికల్స్‌ను ఉపయోగించారు. ఇవి ప్లాస్టిక్‌ కణాలకు అతుక్కున్న తర్వాత, అయస్కాంత క్షేత్రం సాయంతో వాటిని వేరు చేయవచ్చా అనేది పరిశోధనలోని ప్రధాన ఆలోచన. ఈ మేరకు సాగించిన ప్రయోగాలలో ప్రాథమిక ప్రయోగాల్లో ఆసక్తికరమైన ఫలితాలు నమోదయ్యాయి. 2026లో ఐరిస్‌ జాతీయ సైన్స్‌ ఫెయిర్‌లో ఈ ప్రయోగానికి గోల్డ్‌ అవార్డు, ఐఎస్‌ఈఎఫ్‌ అంతర్జాతీయ పోటీలో జైడస్‌ ప్రత్యేక అవార్డు కూడా లభించాయి.

సురమృత్‌ పరిశోధనతో పాటు, విద్యార్థులకు స్టెమ్‌ విద్యను చేరువ చేసేందుకు ‘7 స్టెమ్‌ ల్యాబ్‌’ను కూడా సురమృత్‌ స్థాపించాడు. భవిష్యత్తులో ఈ పరిశోధనను మరింత అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు. ఇంకా ప్రయోగదశలోనే ఉన్న ఈ ‘నానోక్లియర్‌’ ప్రాజెక్ట్‌ త్వరలోనే వాస్తవ రూపం దాల్చుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

ఇదీ చదవండి: సుమో దీదీ బయోపిక్‌

Videos

అందుకే టీడీపీకి రాజీనామా చేశా... కడప టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

జమ్మలమడుగులో హై టెన్షన్ YSRCP నేత కారుపై దాడి

చిలకలూరిపేట ప్రచారంలో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడదల రజిని విమర్శలు!

YSRCP ఏజెంట్ కు ఎన్నికల అధికారి బెదిరింపులు..! ఆడియో వైరల్..

హీరోగా విజయ్ కొడుకు డైరెక్టర్ ఎవరంటే?

కేంద్ర ఉద్యోగులకు ఒకేసారి 18 నెలల జీతం?

ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తా.. లేదంటే... ప్రభాస్ మిర్చి డైలాగ్ తో మాస్ వార్నింగ్

పిఠాపురంలో దుమ్మురేపిన వంగా గీత ఎన్నికల ప్రచారం

'ఆదర్శ కుటుంబం' పబ్లిక్ టాక్

చమోలిలో హెలికాప్టర్ ప్రమాదం.. శకలాల కోసం గాలింపు

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్‌.. (ఫోటోలు)

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)