Breaking News

విమానంలో మహిళ పట్ల జిందాల్‌ స్టీల్‌ సీఈవో పైత్యం : స్పందించిన సంస్థ

Published on Sat, 07/20/2024 - 15:42

జిందాల్ గ్రూప్ సంస్థ సీనియర్ అధికారి ఒకరు  విమానంలో తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ కోలకతాకు చెందిన ఒక మహిళ ఆరోపణలు చేసింది.  ఈ మేరకు ఎక్స్‌లో   శుక్రవారం ఒక పోస్ట్‌ పెట్టింది. దీంతో జిందాల్ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ నవీన్ జిందాల్ స్పందించారు.  నిందితుడైన ఉద్యోగిపై "కఠినమైన చర్యలు" తీసుకుంటామని హామీ ఇచ్చారు. 


కోల్‌కతా నుంచి అబుదాబీ వెళుతుండగా ఈ ఘటన జరిగినట్టు  బాధితురాలు  వెల్లడించింది.  ఆమె అందించిన వివరాల ప్రకారం కోల్‌కతా నుంచి బోస్టన్‌కు అబుదాబీకి ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు చెందిన ట్రాన్సిట్ విమానంలో బయలుదేరింది. విమానంలో ఆమె  పక్కన కూర్చున్న 65 ఏళ్ల వ్యక్తి తాను జిందాల్ స్టీల్ సీఈఓ  దినేష్ కుమార్ సరయోగిని తాను  పరిచయం చేసుకున్నాడు. కుటుంబం, నేపథ్యంలో అంటూ మెల్లిగా మాటలు కలిపాడు. తాను ఒమన్‌లో నివసిస్తున్నానని, కానీ తరచూ ప్రయాణిస్తుంటా అని చెప్పాడు. తన కొడుకులు పెళ్లిళ్లు అయ్యి, అమెరికాలో  స్థిరపడ్డారు అంటూ కబుర్లు చెప్పాడు. 

ఇక ఆ తరువాత అతగాడి  అసలు రూపాన్ని చూపించడం మొదలు పెట్టాడు. ఆమెను అసభ్య చిత్రాలు చూడమని బలవంతం చేశాడు ఈ షాక్‌ నుంచి తేరుకునే లోపలే శరీరం చుట్టూ చేతులేసి అసభ్యకరంగా తాకాడు. దీంతో  అక్కడినుంచి తప్పించుకుని వాష్‌రూమ్‌కి పారిపోయి విమానంలోని సిబ్బందికి ఫిర్యాదు చేసింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. విమానం అబుదాబీలో దిగే సమయానికి పోలీసులు  సిద్ధంగా ఉన్నారు. అయితే తనకు  బోస్టన్‌కు వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్‌ మిస్‌ అవుతుందనే భయంతో లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వలేకపోయానని చెప్పుకొచ్చింది.  ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. మరోవైపు  నిందితుడిపై అబుదాబి పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

అయితే తనలాంటి పరిస్థితి మరి ఏ మహిళకు రాకూడదనే ఉద్దేశంతో  సోషల్‌మీడియా వేదికగా బహిరంగంగా   వెల్లడిస్తున్నట్టు తెలిపింది. దీనిపై స్పందించిన జిందాల్ గ్రూప్ చైర్మన్‌ ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని  వెల్లడించారు.  ఇలాంటి వాటిని కంపెనీ అస్సలు  సహించదని స్పష్టం చేశారు.
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)