Breaking News

లావుగా ఉన్నావంటూ బిడ్డతో సహా భార్యను వదిలేశాడు..కానీ ఆమె..!

Published on Fri, 03/08/2024 - 11:41

ప్రతి ఆడపిల్ల పెళ్లి తర్వాత జీవతం గురించి ఎన్నో కలలు కంటుంది. అందరికి మెట్టినిల్లు పుట్టినిల్లులా ఉండకపోవచ్చు. కొందరికి అది ముళ్లమీద సాగుతున్న జీవితంలా ఉండొచ్చు. అయినప్పటికి పుట్టింటి గౌరవం కాపాడేందుకు అన్నింటిని ఓర్చుకుంటుంది. కానీ అది హద్దు దాటి ఆమె ఆత్మగౌరవాన్నే కించే పరిచలే చేస్తే తట్టుకోలేదు. అదికూడ కట్టుకున్నవాడే తన ఉనికినే సహించలేనంటే.. ఆ మహిళ పరిస్థితి మాటలకందని వేదన అని చెప్పొచ్చు. అలాంటివి అధిగమించి తానెంటో ప్రూవ్‌ చేసుకున్న ఓ ధీర వనిత గాథ ఇది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ మహిళ స్ఫూర్తి కథేంటో చూద్దామా!.

32 ఏళ్ల సుస్మితా దాస్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అందరి ఆడపిల్లలా పెళ్లి గురించి ఎన్నో కలలు కంది. ఎంతో ఆనందంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. తమ ‍ప్రేమకు గుర్తుగా పండంటి బాబుని కంది. అదే ఆమె పాలిట శాపంగా మారి వైవాహిక జీవితాన్ని నిలువునా కూలుస్తుందని ఊహించలేదు. సాధారణంగా ప్రసవానంతరం వచ్చే మహిళల్లో చాలా మార్పులు వస్తాయి. కొందరూ బాగా లావవ్వడం జరుగుతుంది. పిల్లలు ఎదిగే క్రమంలో కొందరూ తగ్గుతారు, మరికొందరూ కాస్త శరీరంపై దృష్టిపెట్టి తగ్గించుకోవడం వంటివి చేస్తారు.

అలానే సుస్మిత డెలివరీ తర్వాత ఊహించిన విధంగా బరువు పెరిగింది. ఈ శరీర మార్పులను అంగీకరించకపోగా బాషీ షేమింగ్‌తో ఇబ్బంది పెట్టేవాడు. లావుగా ఉన్న నీతో కాపురం చేయలేను అని బిడ్డతో సహా ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. మానసికంగా కుంగిపోయింది. ఏం చేయాలో ఎలా లైప్‌ లీడ్‌ చేయాలో తెలియని అగమ్య గోచరంలా కనిపించింది కళ్లముందున్న జీవితం. తల్లిదండ్రులు సుస్మితను అక్కున చేరుకుని భరోసా ఇచ్చారు. అది ఆమెలో కొండంత ధైర్యం ఇచ్చింది. ఏ బాడీ షేమింగ్‌ కారణంగా తన జీవితాన్ని కోల్పోయానో దాని మీద దృష్టిపెట్టి మంచి ఫిట్‌నెస్‌గా ఉండాలని స్ట్రాంగ్‌గా డిసైడ్‌ అయ్యింది.

ఫిట్‌నెస్‌ కమ్యూనిటీలో ఓ మెంబర్‌గా నెంబర్‌ వన్‌ పొజిషన్‌లో ఉంది. ఏ ఒక్క రోజు వర్కౌట్‌లు మిస్సవ్వదు. అందరికంటే ఎక్కువ బరువులు అలవోక ఎత్తేయగలదు. పైగా తాను పెళ్లి కారణంగా మధ్యలోనే ఆపేసిన ఎంబీఏని చదువుని పూర్తి చేయడమే గాక మంచి కార్పోరేట​ కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించడమే గాకు తన కుంటుంబాన్ని పోషించుకుంటోంది. అంతేగాదు తనలా బాడీషేమింగ్‌తో బాధపడే మహిళలకు మంచి ఫిట్‌నెస్‌ గురువుగా సలహలిస్తూ వారిని మంచి టోన్డ్‌ బాడీగా మార్చుకునేలా సాయం చేస్తోంది. అలా మహిళలను కించపరచడం తప్పని నిరూపించడమేగాక వారు తమను తాము ప్రేమించుకుంటేనే ధైర్యంగా నిలబడగలరని ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. 

(చదవండి: మహిళా దినోత్సవం: మహిళల ప్రాతినిథ్యం ఎలా ఉంది?)
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి