Breaking News

టీ తాగుతూ.. పొగ తాగుతున్నారా?

Published on Thu, 11/06/2025 - 22:03

చాలా మంది  టీ తాగేటప్పుడు దానికి కాంబినేషన్‌గా  పొగ త్రాగడానికి ఇష్టపడతారు, ముఖ్యంగా పని విరామ సమయంలో. కానీ చాలా మందిలో కనిపించే ఈ సాధారణ అలవాటు వారికి ఏ మాత్రం గమనించని విధంగా వారి శరీరానికి హాని కలిగించవచ్చు. ‘‘నికోటిన్‌  కెఫిన్‌ కలిసి మెదడులో తాత్కాలికంగా చురుకుదనాన్ని పెంచుతాయి,దాంతో ఆ డబుల్‌ స్టిమ్యులేషన్‌ కూడా ఈ కాంబోను మరింతగా అలవాటు చేసి వ్యసనంగా మారుస్తుంది  అని ఫరీదాబాద్‌లోని మెట్రో హాస్పిటల్‌లోని గ్యాస్ట్రోఎంటరాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ విశాల్‌ ఖురానా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన చెబుతున్న ప్రకారం...

వ్యసన ఫలం...నిద్రలేమి...
నికోటిన్‌ డోపమైన్‌ రష్‌ను ప్రేరేపిస్తుంది, ఇది మెదడు కు ‘మంచి అనుభూతిని కలిగించే’ రసాయనం, అయితే కెఫిన్‌ నిద్రను ప్రేరేపించే రసాయనమైన అడెనోసి¯Œ ను అడ్డుకుంటుంది. ఈ రెండూ కలిసి పనిచేసినప్పుడు, అవి రెండూ స్వయంగా ఉద్దీపనను పెంచుతాయి  అలా రెండింటినీ కలిపి తాగినప్పుడు ఆ కాసేపు మరింత చురుకుదనాన్ని అనుభవించవచ్చు, కానీ మనకు తెలీకుండా మన  మెదడుకు ఆ రెండింటినీ కలిపి కోరుకునేలా శిక్షణ ఇస్తున్నామని అర్ధం.

గ్రీన్‌ టీ తో ప్రభావం తగ్గించవచ్చు...
టీలో కూడా నికోటిన్‌ ఉన్నప్పటికీ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది, అయితే అది ధూమపానంతో పోలిస్తే దాదాపు లేనట్టే. అంతేకాకుండా సిగరెట్‌తో జత చేసే టీ రకం ఏమిటి అనేది కూడా ముఖ్యమైనదే.  గ్రీన్‌ టీలో బ్లాక్‌ టీ కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, తద్వారా ఇది కొంత నికోటిన్‌ వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కోవడంలో శరీరానికి  సహాయపడుతుంది కానీ  ఒకటి మాత్రం నిజం ఏ రకమైన: టీ అయినా సిగరెట్‌ పొగ ప్రభావాలను పూర్తిగా దూరం చేయదు.

సిగిరెట్టు మానే ఆలోచన వెనక్కి...
ధూమపానం  మానాలనుకునేవాళ్లని కూడా ఈ అలవాటు నిరుత్సాహపరుస్తుంది.  టీ తాగితే ధూమపానం మానేయడం కష్టం. ‘‘ మెదడు టీ ఆనందాన్ని నికోటిన్‌ నుంచి వచ్చే కిక్‌తో అనుసంధానించడం ప్రారంభిస్తుంది. ఒకటి మరొకదానికి ట్రిగ్గర్‌ అవుతుంది,  అందుకే  టీ తాగిన ప్రతిసారీ సిగరెట్‌ తాగాలని కోరుకోవడం ఎక్కువ అవుతుంది.

జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం...
కెఫిన్‌  నికోటిన్‌ రెండూ హృదయ స్పందన రేటు అలాగే రక్తపోటును కూడా పెంచుతాయి. రక్త నాళాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి, కాబట్టి  ఈ రెండింటినీ కలపడం గుండె జబ్బులు ఉన్నవారికి మరింత ప్రమాదకరంగా మారుతుంది.  టీ కడుపు లో ఆమ్లాన్ని పెంచుతుంది మరోవైపు నికోటిన్‌ జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తుంది ఇవి రెండూ కలిసిన తర్వాత కడుపు ఉబ్బరం, ఆమ్లత్వం  దీర్ఘకాలిక జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తాయి, ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకోవడం పేగుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది.

గొంతుకీ ప్రమాదమే...
అలాగే గొంతుపై కూడా దీని ప్రభావం పడుతుంది ‘ధూమపానం  గొంతు పొరను చికాకుపెడుతుంది. దానికి వేడి టీ జోడిం^è డం అంటే  వేడి మంటను మరింత తీవ్రతరం చేయడమే. కాలక్రమేణా, ఇది దీర్ఘకాలిక గొంతు సమస్యలతో పాటు అన్నవాహిక క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

టీ , సిగరెట్ల మేళశింపు  నాడీ వ్యవస్థను అతిగా ప్రేరేపించే, గుండెను శ్రమపెట్టే  ప్రేగులను కలవరపరిచే హానికరమైన జంట అనేది నిస్సందేహం కాబట్టి వీలైనంత వరకూ పొగతాగడాన్ని పూర్తిగా మానేయాలి, టీని పరిమితంగా తీసుకోవాలి రెండింటినీ మాత్రం కలిపి తీసుకోవడం మాత్రం పొరపాటున కూడా చేయవద్దు అని వైద్యులు సూచిస్తున్నారు.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)