Breaking News

Sheybarah Resort: భూతల స్వర్గం!

Published on Sun, 02/05/2023 - 11:20

ఈ ఫొటోలో కనిపిస్తున్నది సౌదీ అరేబియాలో నిర్మితమవుతున్న రిసార్ట్‌ హోటల్‌. సౌదీ ప్రధాన భూభాగానికి ఆవల షాబారా దీవిలో తయారవుతోంది. ‘రెడ్‌ సీ గ్లోబల్‌ డెవలపర్స్‌’ సంస్థ ‘షాబారా రిసార్ట్‌’ పేరుతో నిర్మిస్తున్న ఈ హోటల్‌ వచ్చే ఏడాది నుంచి అతిథులకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ హోటల్‌ను నిర్మిస్తున్న దీవిలోని పరిసరాలు, హోటల్‌లోని సౌకర్యాలు చూస్తే ఎవరైనా దీనిని భూతల స్వర్గంగానే భావిస్తారని డెవలపర్స్‌ సంస్థ చెబుతోంది.

అంతేకాదు, ఇది ‘మోస్ట్‌ ఫ్యూచరిస్టిక్‌ హోటల్‌ ఇన్‌ ది వరల్డ్‌’ అని ఊదరగొడుతోంది కూడా! షాబారా దీవిలోని చుట్టూ దట్టమైన మడ అడవులు, ఎడారి వృక్షాల నడుమ దీనిని అధునాతన హంగులతో సర్వాంగ సుందరంగా నిర్మిస్తున్నారు. షాబారా దీవి తీరానికి చేరువలోని రంగురంగుల పగడపు దిబ్బలు కూడా ఇక్కడి నుంచి చూసే అతిథులకు కనువిందు చేస్తాయి. ఈ హోటల్‌లో 260 మంది సిబ్బంది సేవలందిస్తారు.

ఇది ఏకకాలంలో 140 మంది అతిథులకు వసతి కల్పించనుంది. జీవవైవిధ్యాన్ని కాపాడేలా ఈ హోటల్‌ను తీర్చిదిద్దుతున్నామని ‘రెడ్‌ సీ గ్లోబల్‌ డెవలపర్స్‌’ సీఈవో జాన్‌ పగానో చెబుతున్నారు. పర్యావరణానికి ఏమాత్రం చేటు కలిగించని విధంగా పూర్తిగా సౌరవిద్యుత్తును ఉపయోగించుకునేలా దీనిని నిర్మిస్తున్నామని, ఇది సౌదీ పర్యాటకరంగం భవిష్యత్తునే మార్చేయగలదని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)