Breaking News

అయ్యయ్యో! బార్బీకి ఏమైంది?!

Published on Sat, 07/27/2024 - 10:02

కంగారు పడకండి. బార్బీకి ఏం కాలేదు. బార్బీ స్ట్రాంగ్‌ గర్ల్‌. ఈసారి ఇంకో స్ట్రాంగ్‌ గర్ల్‌ రూపంలో అవతరించిందంతే. ఆ రూపమే.. ‘‘బ్లైండ్‌ డాల్‌’’! చూపు లేని బొమ్మ!! ఆ..! చూపు లేక΄ోవటం శక్తి అవుతుందా? ఎందుక్కాదూ? చూపు లేక΄ోవటం, చూడలేక΄ోవటం వేర్వేరు కదా. చూపు ఉండీ పక్క మనిషి నిస్సహాయతను పట్టించుకోని వాళ్లకు ఏం శక్తి ఉన్నట్లు? చూపు లేకున్నా సాటి మనిషి హృదయాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్లకు ఏం శక్తి లేనట్లు?  

బార్బీ.. అమ్మాయిల మనసెరిగిన బొమ్మ. డాక్టర్‌ బార్బీకి.. మెడిసిన్‌ చదవాలని కలలు కనే అమ్మాయిల మనసు తెలుసు. ఆస్ట్రోనాట్‌ బార్బీకి.. అంతరిక్షంలో పరిశోధనలు చేయాలని ఉవ్విళ్లూరే అమ్మాయిల ఆశలకు ఎన్ని రెక్కలు ఉంటాయో తెలుసు. నల్లజాతి బార్బీకి.. రంగు కారణంగా నల్ల జాతి మహిళలు ఎదుర్కొంటున్న తీవ్ర వివక్ష ఎలా ఉంటుందో తెలుసు. ఇంకా.. మిస్‌ యూనివర్శ్‌ బార్బీ, ప్రెసిడెంట్‌ బార్బీ, పైలట్‌ బార్బీ, వీల్‌ చెయిర్‌ బార్బీ, ప్రోస్థెటిక్‌ లెగ్‌ బార్బీలన్నీ వివిధ వృత్తులు, ప్రవృత్తులు, స్థితి గతులకు ప్రతీకగా ఉండి, ఆడపిల్లలకు స్ఫూర్తిని, సహానుభూతిని అందిస్తున్నవే. 

1959తో తొలి బార్బీ మార్కెట్‌లోకి వచ్చింది మొదలు ఇప్పటి వరకు 1000 రకాలకు పైగానే బార్బీ డాల్స్‌ అమ్మాయిలకు ఆత్మ బంధువులయ్యాయి. ఆ క్రమంలో తాజాగా ఆవిర్భవించిన కారణజన్మురాలే.. ‘‘బ్లైండ్‌ డాల్‌’’. కారణ జన్మురాలా! అవును. కారణ జన్మురాలే. బాలికల్ని మానసికంగా శక్తివంతుల్ని చేయాలన్నదే ఆ కారణం. మాటెల్‌ కంపెనీ తన ‘స్ఫూర్తిదాయకమైన మహిళలు’ సిరీస్‌లో భాగంగా 2021లో ‘హెలెన్‌ కెల్లర్‌’ రూపంలో బార్బీని తయారు చేసినప్పటికీ, ఫ్యాషనబుల్‌గా తెచ్చిన తొలి బ్లైండ్‌ బార్బీ మాత్రం ఇదే. 

అంధులైన వారిని కూడా కలుపుకుని ΄ోయేలా ఈ ‘బ్లైండ్‌ బార్బీ’ రూపోం​దింది. ఇందుకోసం బార్బీ బొమ్మల కంపెనీ ‘మాటెల్‌’.. ‘అమెరికన్‌ ఫౌండేషన్‌ ఫర్‌ బ్లైండ్‌’తో చేతులు కలిపింది. ఈ కొత్త బార్బీ డాల్‌ పింక్‌ శాటిన్‌ టీ షర్టు, పర్పుల్‌ ట్యూల్‌ స్కర్టు ధరించి ఉంటుంది. చేతిలో తెలుపు, ఎరుపు రంగుల స్టిక్‌ ఉంటుంది. పిల్లల్లో స్వీయ వ్యక్తీకరణను, ఆత్మదృఢత్వాన్ని పెంపొందించేందుకు బ్లైండ్‌ బార్బీని తెచ్చామని మాటెల్‌ కంపెనీ చెబుతోంది. అంతే కాదు, ఈ కొత్త బార్బీ ΄్యాకింగ్‌ కూడా విలక్షణంగా ఉంది. బాక్సు మీద బార్బీ అనే అక్షరాలను బ్రెయిలీ లిపిలో ముద్రించారు. 

బ్రిటన్‌ యువతి లూసీ ఎడ్వర్డ్స్‌ ఈ బొమ్మకు ప్రచారకర్త. ఆమె తన 11 ఏళ్ల వయసులో కుడి కంటి చూపు కోల్పోయారు. 17 ఏళ్ల వయసులో రెండో కంటి చూపు కూడా క్షీణించింది. ‘‘ఈ బొమ్మ నా సర్వస్వం. ఇది నా దగ్గర ఉంటే నేను ఒంటరినన్న భావనే నాలో కలగదు..’’ అంటున్నారు లూసీ తన చేతిలోని బ్లైండ్‌ బార్బీని హృదయానికి హత్తుకుంటూ. ఇంకోమాట.. ‘‘అయ్యయ్యో’’ అనిపించుకోవటంస్ట్రాంగ్‌ గర్ల్‌కి అస్సలు ఇష్టం ఉండదట. లూసీ అంటారు.  

#

Tags : 1

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)