Breaking News

120 మీటర్ల ఎత్తులో​ ఉన్న కొండను ఆనుకుని ఓ కొట్టు..ఎక్కడంటే

Published on Sun, 10/22/2023 - 17:16

కొండ బండను ఆనుకొని ఉన్న ఈ చెక్క నిర్మాణం అధిరోహకులను రెస్క్యూ చేయడానికేమో అని అనుకుంటే అచ్చంగా పొరపాటే! అదో కొట్టు. చైనాలోని హునాన్‌ ప్రావిన్స్‌లోని షినియుజాయ్‌ అనే సుందరమైన ప్రాంతం అది. అక్కడ 120 మీటర్ల ఎత్తులో కొలువై ఉన్న కొండను ఎక్కే అధిరోహకులకు.. ఆహారం, మంచినీరు, విశ్రాంతి వంటి కనీస వసతులు కల్పించాలని ప్రభుత్వం ఓ కొట్టు తెరిచింది. దాని పేరు ‘హ్యాంగింగ్‌ కన్వీనియెన్స్‌ స్టోర్‌.

’ ఈ ఫొటోలో కనిపిస్తున్నదదే! అందులో  కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఉండి.. పర్యాటకులకు సేవలు అందిస్తుంటాడు. అవసరమయ్యే వస్తువులన్నిటినీ తాడుతో కింది నుంచి పైకిలాగి ఈ కొట్టులో స్టోర్‌ చేస్తారు. కొన్నాళ్ల కిందటి వరకు కూడా మౌంటెనీర్సే తమకు అవసరమయ్యే వస్తువులన్నిటినీ మోసుకెళ్లేవారు. ఆ అవస్థ చూసే ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది. ఇప్పుడు మౌంటెనీర్స్‌కి కావలసిన వస్తువులన్నీ తక్కువ ధరకే ఈ కొట్టులో లభిస్తున్నాయి. దాంతో మౌంటెనీరింగ్‌ ఈజీ అయింది.. ఆ కొట్టు వ్యాపారమూ జోరుగా సాగుతోంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా మూతపడ్డ ఈ స్టోర్‌ను తిరిగి తెరవడంతో విషయం వైరల్‌ అయింది.  

(చదవండి: ఒకప్పుడు అది ఉప్పుగని! కానీ ఇప్పుడు..)

#

Tags : 1

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)