Breaking News

అందుకే ఆయన మహాత్ముడు 

Published on Mon, 01/29/2024 - 11:26

అవి గాంధీ మహాత్ముడు మొట్టమొదటిసారిగా ప్రజా జీవితంలో అడుగు పెట్టినప్పటి రోజులు. ఓరోజు గాంధీజీ తన మిత్రుడితో కలిసి అతని కారులో ప్రయాణం చేస్తున్నారు. గాంధీజీ అలా ప్రయాణం చేయడం నచ్చని కొందరు వ్యతిరేకులు ఆయనకు అడ్డంకులు కల్పించడానికి గాను ఓ చెట్టు చాటు నుంచి కారుపై రాళ్లు రువ్వారు. రాళ్ళు కారుమీద పడగానే గాంధీజీ మిత్రుడితో కారును ఓ పక్కగా ఆపమన్నారు. అనంతరం ఆయన నెమ్మదిగా కారు లోంచి కిందకు దిగారు. చుట్టూ చూశారు. కనుచూపుమేరలో ఓ చెట్టు దగ్గర నిల్చున్న కొందరిని గాంధీజీ చూశారు. వారు తప్ప మరెవ్వరూ కనిపించలేదు. దాంతో తిన్నగా వారి దగ్గరకు వెళ్లారు. కారు మీద రాళ్ళు విసిరిన వారు వారే అయి ఉండొచ్చని అనుకున్నారు.

వారిని సమీపించి ‘‘మీకు నా మీద కోపం ఉండొచ్చు. కాదనను. ఆ కోపం మీ వరకూ సబబే కూడా అయి ఉండొచ్చు. అది కూడా నేను కాదనను. అయితే, మీ కోపాన్ని చూడానుకుంటే రాళ్ళు నామీద విసరాలే తప్ప పాపం ఈ కారు ఏం చేసింది? అంతేకాదు, ఆ కారు కూడా నాది కాదు. నా మిత్రుడిది. ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు మీ కోపాన్నినా మీద చూపండి. ఇదిగో మీముందే నిల్చున్నాను. మీ ఇష్టమొచ్చినట్టు చేసుకోండి, నేను మీ ముందు ఒంటరిగా నిల్చున్నాను. నన్ను మీరేమైనా చేసుకోవచ్చు. అందుకు నేనేమీ అనుకోను. కారు మీద రాళ్ళు విసరడం మాత్రం తప్పు. ఎందుకంటే అది మిమ్మల్నేమీ చెయ్యలేదు. చెయ్యదు కూడా. అయినా మీరు రాళ్లు విసరడం వల్ల అది నాశనమవుతుంది. అప్పుడు నా మిత్రుడు బాధపడతాడు. నష్టం అతనికి తప్ప నాకు కాదుగా...’’ అని గాంధీజీ చెప్పడంతో ఆయనను ఆట పట్టించాలనుకున్న వాళ్ళు గాంధీజీ మాటలకు సిగ్గుపడి తల దించుకున్నారు.

కాస్సేపు అక్కడ మౌనం తాండవించింది. అనంతరం ఆ అల్లరిమూక గాంధీజీ కాళ్ళపై పడి తమను క్షమించాలని అడిగారు. గాంధీజీ చిరునవ్వు నవ్వుతూ ప్రేమగా వారితో కరచాలనం చేశారు. క్షమ లేకనే మనం మామూలు వాళ్లలా ఉన్నాము. క్షమాగుణం వల్లనే గాంధీజీ మహాత్ముడయ్యాడు. అందుకే క్షమ కలవాడు అందరికన్నా బలమైన వాడని సామెత. 
– డి.వి.ఆర్‌.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)