Breaking News

ఆ దీవిలో మూడు రోజులు బస ఉచితం! ఎందుకంటే?

Published on Sun, 06/30/2024 - 04:03

పర్యాటక ప్రదేశాలకు వెళితే వసతి, భోజనాల కోసం ఖర్చులు తప్పవు. పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోనైతే ఈ ఖర్చులు కొంత ఎక్కువగానే ఉంటాయి. అయితే, చరిత్రాత్మకమైన ఈ ఇటాలియన్‌ దీవిని సందర్శించాలనుకునే పర్యాటకులకు ఒక సంస్థ మూడు రోజులు ఉచితంగా బస కల్పిస్తోంది.

‘కామినో మినరేరియో’ అనే సంస్థ ముప్పయి ఐదేళ్ల లోపు వయసు గల దేశ విదేశాలకు చెందిన పర్యాటకులకు సార్డీనియా దీవిని సందర్శించేందుకు ఈ అవకాశం కల్పిస్తోంది. ఈ దీవిలో పురాతన రోమన్‌ నిర్మాణాలు సహా అనేక చారిత్రక నిర్మాణాలు, కొండలు, లోయలు, పురాతన గుహలు, అడవులు, జలపాతాలు వంటి అనేక ఆకర్షణలు ఉన్నాయి.

దాదాపు 800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ దీవిలో మధ్యయుగాల నాటి శాంటా బార్బరా గనులు, రాతిమెట్లతో కూడిన ‘పవిత్ర బావులు’ లోపలకు వెళ్లి చూడాలంటే గుండెధైర్యం ఉండాలి. దీవి చుట్టూ మధ్యధరా సముద్ర తీరం, అందమైన బీచ్‌లు పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఈ దీవిలోని పోర్టోసుకో పట్టణంలోని హోటళ్లలో పర్యాటకులకు బస కల్పిస్తారు. అక్కడి నుంచి రోజుకు ఒక దిశగా తీసుకువెళ్లి, దీవిలోని పర్యాటక ఆకర్షణలను చూపిస్తారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)