నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా
Breaking News
నలభై గంటలు, నాలుగు వేలసార్లు క్లిక్..చివరికి ఆ అద్భుతం!
Published on Sun, 04/19/2026 - 14:30
తకిట తధిమి తకిట తధిమి తందానా పదహేల మొండిమాను వేదికపై ఉడుతగారి నృత్యలీల అమెరికా–కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగిన డచ్ ఫొటోగ్రాఫర్ స్టాన్ బౌమన్ కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యం ఇది. సోనీ వరల్డ్ ఫొటోగ్రఫీ అవార్డ్స్–2026 బహుమతి గెలుచుకున్న ఈ ఫొటో కోసం బౌమన్ ఏకంగా నలభై గంటలు శ్రమించి, దాదాపు నాలుగువేల సార్లు కెమెరాను క్లిక్‌మనిపించాడు.
చివరకు ఉడుత ప్రదర్శించిన ఈ అద్భుత భంగిమను కెమెరాలో బంధించగలిగాడు. కాగా, ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సింగిల్ ఇమేజ్‌లకు బహుమతులు ప్రధానం చేస్తారు. ఈ పోటీలో ప్రవేశం ఉచితం. అలాగే గరిష్టంగా మూడు సింగిల్ చిత్రాలను ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. జేతగా నిలిచిన ఒకరికి ' ఓపెన్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్' బిరుదు లభిస్తుంది కూడా.
(చదవండి: ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా సాధ్వి సతీష్ సైల్)
Tags : 1