ఇది కిచెన్‌లో ఉంటే.. టిఫిన్, లంచ్, డిన్నర్‌తో పాటు..

Published on Sun, 08/18/2024 - 05:09

చాలామంది వేడివేడి రుచులను కోరుకుంటారు. కొన్నిసార్లు ఏదో కారణంతో ఆలస్యం అయినప్పుడు వంటకాల వేడి చల్లారిపోయి, తినాలన్న ఆసక్తి కోల్పోతారు. ఆ సమస్యను దూరం చేస్తుంది ఈ ఎలక్ట్రిక్‌ వార్మింగ్‌ ట్రే. ఇది కిచెన్‌ లో ఉంటే టిఫిన్, లంచ్, డిన్నర్‌తో పాటు స్నాక్స్‌ టైమ్‌లో కూడా వేడివేడి పదార్థాలనే అందుకోవచ్చు. అంతే కాకుండా, టీ, కాఫీ వంటి వేడి పానీయాలను ఫ్లాస్క్‌లో భద్రపరచుకోవాల్సిన పనిలేదు.

పార్టీలు, ఫంక్షన్ల సమయంలో కూడా ఈ ట్రే ఉంటే,  ఆరగించే రుచులు ఎప్పటికప్పుడు వేడివేడిగా పొగలు కక్కుతూ ఉంటాయి. కేవలం కొన్ని నిమిషాల ముందు ఈ ట్రే మీద వేడి చేయాలనుకున్న వంటకాలను, కాఫీ, టీ వంటి పానీయాలను ఉంచితే సరిపోతుంది. దీనిలో 216 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ నుంచి 316 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ వరకు త్రీ మోడ్స్‌ టెంపరేచర్‌ ఆప్షన్‌ ఉండటంతో, ఏది ఎంత వేడి కావాలో అంతే పెట్టుకునే వీలుంటుంది. దీనిపైన సిరామిక్‌ టేబుల్‌ వేర్, గ్లాస్‌ వేర్‌తో పాటు క్యాస్రోల్‌ మెటల్‌ కలిగిన ఏ పాత్రలోని ఆహార పదార్థాలనైనా, పానీయాలనైనా వేడి చేసుకోవచ్చు.

శాండ్‌విచ్‌ అండ్‌ మోర్‌..
ఈ రోజుల్లో ఇలాంటి ఒక మేకర్‌ ఇంట్లో ఉంటే, నచ్చిన అల్పాహారం, నచ్చిన చిరుతిళ్లను ఇట్టే సిద్ధం చేసుకోవచ్చు. మెల్ట్, టోస్ట్, ఫ్రై వంటి చాలా ఆప్షన్స్‌ ఇందులో ఉంటాయి. దీని మీద ఆమ్లెట్, పాన్‌ కేక్స్, కట్లెట్స్‌తో పాటు శాండ్విచ్, బర్గర్స్‌ వంటివీ రెడీ చేసుకోవచ్చు. ఇందులో మొత్తం ఏడు సెట్టింగ్స్‌ ఉంటాయి.

దీన్ని ఓపెన్‌ చేసుకుని, రెండు వైపులా అధిక మోతాదులో ఆహారాన్ని వండుకోవచ్చు. లేదంటే ఫోల్డ్‌ చేసుకుని, ఒకేసారి నాలుగు శాండ్‌విచ్‌లను రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఫోల్డ్‌ చేసుకున్నాక లాక్‌ చేసుకునే వీలు కూడా ఉంటుంది. దాంతో ఇందులోని పదార్థాలు వేగంగా బేక్‌ అవుతాయి. దీనిలోని నాణ్యమైన నాన్‌–స్టిక్‌ ప్లేట్‌ డివైస్‌కి అటాచ్‌ అయ్యే ఉంటుంది. దీన్ని ఈజీగా క్లీన్‌ చేసుకోవచ్చు. ఈ మేకర్‌ని ఇతర ప్రదేశాలకు సులభంగా తీసుకెళ్లొచ్చు!

టేబుల్‌టాప్‌ బార్బెక్యూ గ్రిల్‌..
కుటుంబంతో లేదా స్నేహితులతో పిక్నిక్‌లకు, క్యాంపింగ్‌లకు వెళ్లినప్పుడు.. ఇలాంటి ఓ బార్బెక్యూ గ్రిల్‌ని వెంట తీసుకుని వెళ్తే, వేళకు క్రిస్పీ రుచులను అందుకోవచ్చు. ఇది బొగ్గులతో లేదా చెక్క ముక్కలతో పని చేస్తుంది. దీని అడుగున వాటిని వేసి, నిప్పు రాజేసి పైన గ్రిల్‌ అమర్చుకోవాలి. వెజ్‌ అయినా, నాన్‌ వెజ్‌ అయినా దీని మీద చాలా టేస్టీగా గ్రిల్‌ చేసుకోవచ్చు.

పైగా దీనికి అదనంగా ఒక వుడెన్‌ ట్రే, ఫుడ్‌ స్టోరేజ్‌ ట్రే లభిస్తాయి. వుడెన్‌ ట్రే మీద వంట చేసుకునే ముందు ముక్కలు కట్‌ చేసుకోవచ్చు. ఇక స్టోరేజ్‌ ట్రేను వంట పూర్తి అయిన తర్వాత సర్వ్‌ చేసుకోవడానికి వినియోగించుకోవచ్చు. దీనికి ముందువైపు కదలకుండా లాక్‌ చేసుకునే వీలుండటంతో ఈ గ్రిల్‌ని సులభంగా ఎక్కడికైనా తీసుకుని వెళ్లొచ్చు. దీనికి ఇరువైపులా హ్యాండిల్స్‌ ఉండటంతో వంట అవుతున్న సమయంలో కూడా ఒకచోట నుంచి మరోచోటికి సులువుగా కదల్చవచ్చు.

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)