Breaking News

90లలోనే అతిలోక సుందరి శ్రీదేవి ఆ ఫ్యాషన్‌ సాహసం..! ఇవాళ అదే..

Published on Thu, 06/18/2026 - 12:00

ఇవాళ ఫ్యాషన్‌ రంగం ఏ రేంజ్‌లో ట్రెండ్స్‌ని సృష్టిస్తూ..లేటెస్ట్‌ డిజైనర్‌వేర్‌లను తీసుకోస్తుందో తెలిసిందే. యువత సైతం వాటిని అనుకరిస్తూ..సోషల్‌ మాధ్యమాల్లో సరికొత్తట్రెండ్‌ని సృష్టిస్తున్నారు కూడా. ఇవాళ ఫ్యాషన్‌ ప్రమాణాలు ఏ రేంజ్‌లో అదరగొడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకు అనుగుణంగా టెక్నాలజీ..కుప్పలకొద్ది డిజైనర్‌లు, క్రియేటివిటీలు అందుబాటులో ఉన్నాయి. కానీ 90వ దశకంలో పరిస్థితి వేరు. అప్పట్లో దేశం తన మూలాలకు కట్టుబడి ఉంటూనే..అంతర్జాతీయ శైలిని అందిపుచ్చుకుని గ్లోబల్‌ గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది. 

అందువల్ల ఆ సమయంలో గ్లామర్‌ ప్రపంచం అందర్నీ ఆకర్షించడం అనేది అత్యంత కష్టమైన సవాలుగా ఉండేది. అయితే అప్పటి ఫ్యాషన్‌ దిగ్గజాలు ఆ సవాలుని చాలా సర్థవంతంగా ఎదుర్కొన్నారు. వారిలో మన టాలీవుడ్‌ ముద్దుగుమ్మ, అతిలోక సుందరీ శ్రీదేవి ఒకరు. అవును ఆ నాడు ఫ్యాషన్‌ నెమ్మదిగా పురుడు పోసుకుంటున్న సమయంలోనే ఆమె అతిపెద్ద సాహసం చేశారు. కానీ ఇవాళ ఆ స్టైల్‌ ట్రెండీగా మారింది. ఆ కాలంలోనే శ్రీదేవి ఆ ట్రెండ్‌ని సెట్‌ చేసిన ఘనత అందుకుందామె. ఏంటో ఫ్యాషన్‌ స్టైల్‌, దాని విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

అందుకు సంబంధించిన విషయాలను డిజైనర్‌ నీతా లుల్లా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. శ్రీదేవి 1993లో వచ్చిన గోవింద మూవీ కోసం మెటాలిక్ హుడెడ్ డ్రెస్ ధరించారు. అది ఇవాళ సర్వసాధారణం. కానీ 90లలో ఫ్యాషన్‌లో ఓ కొత్త ఒరవడిని సృష్టించిన స్టైల్‌ ఇది. ఆ దుస్తులను ముంబైకి చెందిన ఫ్యాషన్‌ డిజైనర్‌ నీతా లుల్లా రూపొందించారు. దీన్ని మెటల్‌ మెష్‌తో (లోహాపు వల వంటి నిర్మాణంతో) ఒకే లైనింగ్‌ దీనిని తయారు చేయడం విశేషం. 

దీని డిజైనింగ్‌లో ఇదే ప్రత్యేకతని అన్నారు. అందువల్లే తాను ఆ మూవీ షూటింగ్‌ కోసం చిన్నబ్యాగులో హైదరాబాద్‌కి తీసుకురాగలిగానని అన్నారామె. అయితే ఎయిర్‌పోర్ట్‌లో చూడటానికి చిన్న బ్యాగు..కానీ ఏకంగా 25 గ్రాముల బరువు ఎందుకు తూగుతుందని ఎయిర్‌పోర్టు అధికారులు అడిగారు. అప్పుడు వారికి ఆ డిజైనర్‌ వేర్‌ని ఓపెన్‌ చేసి..మెటల్‌తో తయారు చేయడం వల్ల ఇంత బరువు తూగుతోందని వివరణ ఇవ్వాల్సి వచ్చిందంటూ నాటి సంఘటననను గుర్తు చేసుకున్నారు లుల్లా. 

ఇదొక్కటే కాదు ఆమో మరో మెటాలిక్‌ దుస్తులను అప్పట్లోనే ధరించి అప్సరసలా కనిపించి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశారని ఆ సంఘటననకు కూడా ప్రస్తావించారు. బాలీవుడ్‌ మూవీ "మిస్టర్ ఇండియా"లో 'హవా హవాయి' పాటలో ఆమె ధరించిన బంగారు వర్ణపు, దుస్తులు అప్సరసను తలపించేలా లుక్‌ని అందించింది. కేటీ కట్రాక్ రూపొందించిన ఈ దుస్తులలో ప్రత్యేకమైన ఆకృతినిచ్చే టాజిల్స్, కదలికకు అనుగుణంగా ఉండే పూసల పనితనం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అలాగే తలపై ధరించిన అలంకారప్రాయమైన, మెరిసే శిరోభూషణం (headpiece) మరింత హైలెట్‌గా కనిపించింది. 

ఇప్పుడు అదేస్టైల్‌ 2022లో అమెరికా బ్యూటీ మొగల్‌ కైలీ జెన్నర్‌ అచ్చలం అలానే మెడ, తల చుట్టూ హుడ్‌లాగా చుట్టుకుని మెరిసే సిల్వర్‌ మెటాలిక్‌ దుస్తులను ధరించారు. అక్కడ ఫెంచ్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ వింటేజ్ పాకో రబానీ  ఈ డిజైనర్‌వేర్‌ని డ్యూయల్-టోన్డ్ డెనిమ్స్‌తో సింపుల్ స్టైలింగ్‌ను జతచేశారు. ఈ ఇద్దరు అందాల తారల మధ్య అద్భుతమైన పోలిక కనిపిస్తున్నప్పటికీ..ఆమె స్టైలిస్ట్‌ ఈ లుక్‌ని శ్రీదేవి లుక్‌తో పోల్చలేదు కానీ..దశాబ్దాలక్రితమే ఈ స్టైల్‌ ట్రెండ్‌ని సెట్‌ చేశారనేది నమ్మక తప్పని నిజం అంటున్నారు ఫ్యాషన్‌ డిజైనర్‌ నీతా లుల్లా.

 

(చదవండి: పీసీఓఎస్‌తో జస్ట్‌ రెండు నెలల్లో తొమ్మిది కిలోలు..! కానీ ఆ ఐదు పొరపాట్లు..)
 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)