Breaking News

‘జ్ఞాపకాలు..అనుభవాలు ఎంతో మధురం’

Published on Fri, 11/22/2024 - 11:07

సోలాపూర్‌: ‘సాధారణంగా పిల్లలు ఆడుకుంటే పెద్దలు చూసి సంతోషిస్తారు. కానీ ఈరోజు మేం ఆటపాటలతో గడుపుతుంటే పిల్లలు చప్పట్లు కొడుతూ ఉత్సాహపరచడం మాకెంతో ఆనందాన్నిచ్చింది’ అని పలువురు సీనియర్‌ సిటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. పట్టణంలోని పద్మ కమల్‌ ప్రతిష్టాన్, పద్మశాలీ సఖీ సంఘం ఆధ్వర్యంలో‘బాల్యం అనుభూతులు నెమరు వేసుకోవడం‘అనే పేరుతో సీనియర్‌ మహిళలు, బాలల కోసం ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించారు. తమకు పెళ్లిళ్లై 35 నుంచి 40 సంవత్సరాలు పూర్తయ్యాయని, కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్లు , మనవళ్లు, మనవరాళ్ళు ఇలా అందరినీ మరిచి ఈ వయసులో మళ్లీ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకునే అవకాశం కల్పించినందుకు పద్మ కమల్‌ ప్రతిష్టాన్, పద్మశాలీ సఖీ సంఘం సభ్యులు కృతజ్ఞతలు చెబుతున్నామని పేర్కొన్నారు.

 శ్రీ మార్కండేయ సోషల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరీ శంకర్‌ కొండ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మశాలి సఖీ సంఘం అధ్యక్షురాలు మేఘ ఇట్టం ముందుగా ప్రాస్తావికోఉపన్యాసం చేస్తూ కార్యక్రమ ఉద్దేశ్యాన్ని గురించి వివరించారు. పద్మ కమల్‌ ప్రతిష్టాన్‌ వ్యవస్థాపకుడు గోపీకృష్ణ వడ్డేపల్లి తన చిన్ననాటి జ్ఞాపకాలను అందరితో పంచుకోగా, దయానంద్‌ కొండ బత్తిని,స్నేహల్‌ శిందే , ఛత్రపతి అఖేన్, తదితరులు తాము చిన్ననాడు ఆడిన ఆటల గురించి, తమ అనుభవాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా మ్యూజికల్‌ చైర్‌ పోటీ నిర్వహించి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మహిళలు, పురుషుల బృందాలకు పద్మావతి సంఘ, రేణుక చింత, మంజుల ఆడం, కళ చెన్నపట్నం, వనిత సురా, పద్మ మేడిపల్లి తదితరులు బహుమతులను అందజేశారు.      

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)