Breaking News

korameenu కొరమీను.. కేరాఫ్‌ కరీంనగర్‌  

Published on Wed, 04/09/2025 - 17:22

సాక్షి, హైదరాబాద్‌: చేప ప్రియులు లొట్టలేసుకొని తినే కొరమీనుకు కరీంనగర్‌ కేంద్రం కాబోతోంది. కొరమీను చేపలతో రాష్ట్రం కళ కళలాడేలా మత్స్యశాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఇతర రాష్ట్రాలను నుంచి దిగుమతి చేసుకునే బదులు మన దగ్గరే వాటిని ఎక్కువగా పెంచేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం నాలుగు జిల్లాలను ఎంపిక చేసింది. కరీంనగర్‌ కేంద్రంగా జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలను కలిసి క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని, ఇక్కడే కొరమీను చేపలను పెంచాలని భావిస్తోంది. మత్స్య శాఖ ప్రణాళికలను ప్రభుత్వం ఆమోదిస్తే కొరమీనుకు మన దగ్గర కొదువే ఉండదు.  

ధరల భారం లేకుండా 
వాస్తవానికి తెలంగాణలో డిమాండ్‌కు సరిపోను కొరమీను చేపలు అందుబాటులో లేవు. ఏపీతోపాటు ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి వీటిని తెచ్చి మన మార్కెట్లలో అమ్ముతుంటారు. ట్రాన్స్‌పోర్ట్, ప్యాకింగ్, లోడింగ్, అన్‌లోడింగ్, సరిహద్దు ట్యాక్స్‌లతో పాటు కమీషన్లు కలిపి ఎక్కువ ధరకు వీటి విక్రయాలు జరుగుతుంటాయి. ప్రస్తు తం చేపల మార్కెట్‌లో  కొరమీను కిలో రూ.300–500 వరకు ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరకు కొరమీనులను చేప ప్రియులకు అందుబాటులోకి తెచ్చేలా మత్స్యశాఖ చర్యలు తీసుకుంటోంది.  

నీటి వనరులే కీలకం 
కొరమీను చేపల పెంపకానికి నీటి వనరులు ఎక్కువ అవసరం. ముఖ్యంగా నీటి చలన, ప్రవాహం ఉన్న వనరుల్లో ఇవి త్వరగా, బలిష్టంగా పెరుగుతాయి.  నీటి వనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మత్స్యశాఖ కొరమీను చేపల పెంపకానికి ఎంపిక చేసింది. దీంతోపాటు ఉండ్రుమట్టి ఎక్కువగా ఉంటే, అందులో ఉన్న నాచు కారణంగా కొరమీనుచేపలు మరింత బలంగా పెరిగే అవకాశముంటుంది. అందుకే ఒండ్రుమట్టి లభ్యత ఉన్న ఆ నాలుగు జిల్లాల్లో కొరమీను పెంచాలని నిర్ణయించింది.

Videos

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)