Breaking News

మీల్‌ మేకర్‌ ఆరోగ్యానికి మంచి 'గేమ్‌ ఛేంజర్‌'..!

Published on Wed, 01/15/2025 - 11:09

బిర్యానీలో వేసే సోయా చంక్స్‌ లేదా మీల్‌ మేకర్‌(Soya chunks) ఆరోగ్యానికి ఎంతో మంచివట. వీటిని మన ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఇవి మొక్కల ఆధారిత ప్రోటీన్‌గా పిలుస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్యానికి మంచి గేమ్‌ ఛేంజర్‌(Game-changer)గా చెబుతున్నారు. అదెలాగో సవివరంగా చూద్దాం..!.

సోయా ముక్కలు (సోయా చంక్స్‌) సోయాబీన్స్ నుంచి తయారైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ మూలం. కొవ్వు శాతం తక్కువ, ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. శాకాహారులకు ప్రత్యామ్నాయమైన సాంప్రదాయ మాంసం ఆధారిత ప్రోటీన్‌గా పనిచేస్తుంది. తినేందుకు రుచిగానూ, శరీరానికి అవసరమైన విటమిన్లను అందిస్తుంది. 

తృప్తికరమైన భోజనానికి చిహ్నంగా ఉంటుంది. ఆరోగ్య స్ప్రుహ ఉన్న వ్యక్తులకు ఇది బెస్ట్‌ సూపర్‌ ఫుడ్‌. ఆహార ప్రియలు ఈ మీల్‌ మేకర్‌ని పలు విధాల రెసిపీలతో ఆస్వాదిస్తున్నారు. వంట చేసే నేర్పు లేనివారైనా..సులభంగా వండుకోగలరు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే..

గుండె ఆరోగ్యానికి మంచిది..
మీల్‌ మేకర్‌లో ప్రొటీన్‌, ఫైబర్‌, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా, సంతృప్త కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ పెరగుతుంది.

బరువు తగ్గుతారు..
మీల్‌ మేకర్‌లో ప్రొటీన్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది మిమ్మల్ని చాలా కాలం పాటు నిండుగా ఉంచుతాయి. మీరు తరచుగా తినాలనే కోరికలను తగ్గిస్తుంది. మీల్‌ మేకర్‌లోని ప్రొటీన్‌కు శరీరం కొవ్వు, బరువును తగ్గించే లక్షణాలు ఉంటాయి. మనం శరీరంలో కార్బోహైడ్రేట్ల కంటే సోయా చంక్స్‌ను జీర్ణం చేయడానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. ఫలితంగా శరీరంలో కొవ్వు ఈజీగా కరుగుతుంది, బరువు కూడా సులభంగా తగ్గుతారు.

మెనోపాజ్ లక్షణాలను తగ్గిస్తుంది..
మెనోపాజ్‌ దశలో మహిళలు యోని పొడిబారడం, వేడి ఆవిర్లు, మూడ్ స్వింగ్స్, నిద్రాభంగం, రాత్రిపూట చెమటలు పట్టడం వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతుటుందారు. సోయా చంక్స్‌లో ఐసోఫ్లేవోన్స్ అనే ఫైటోఈస్ట్రోజెన్ ఉంటుంది, ఇది మెనోపాజ్‌ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది.

హార్మోన్ల సమతుల్యత
వీటిలోని ఫైటోఈస్ట్రోజెన్ కంటెంట్ పీరియడ్స్‌ సక్రమంగా వచ్చేలా చేస్తుంది. ముఖ్యంగా PCOS, పోస్ట్‌ మెనోపాజ్‌ లక్షణాలతో బాధపడేవారికి మీల్‌ మేకర్‌ మేలు చేస్తాయి.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి..
మీల్‌ మేకర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, కొన్ని రకాల కేన్స‌ర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

జీర్ణక్రియకు..
మీల్‌ మేకర్‌ పేగులలో లాక్టోబాసిల్లి, బైఫిడోబాక్టీరియా పరిమాణం పెంచుతుంది. ఈ రెండు సూక్ష్మజీవులు జీర్ణక్రియకు సహాయపడతాయి.​

మధుమేహ రోగులకు మంచిది..
మీల్‌ మేకర్‌లో ఐసోఫ్లేవోన్‌లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇలా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటే గుండె సమస్యల ప్రమాదం కూడా తగ్గుతుంది.

(చదవండి: జపాన్‌లో ఇంత క్లీన్‌గా ఉంటుందా..!)
 

#

Tags : 1

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు