Breaking News

చిన్నదే గాని.. చిరంజీవి

Published on Sun, 11/16/2025 - 06:51

‘సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు’ అన్న మాటను ఇప్పుడు ఒక చిన్న గాజు ఫలకం అబద్ధం చేసింది. ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్  విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త పీటర్‌ కజాన్ స్కీ, అతని బృందం రూపొందించిన ఈ గాజు డిస్క్, మొత్తం చరిత్ర జ్ఞాపకాలను శాశ్వతంగా బంధించగల అద్భుతం. దీని పేరు ‘సూపర్‌మాన్  మెమరీ క్రిస్టల్‌’. ఇందులో మూడు వందల అరవై టెరాబైట్‌ల డేటాను స్టోర్‌ చేయొచ్చు. అంటే చరిత్ర, గ్రంథాలు, సినిమాలు, సంగీతం అన్నీ ఒకే డిస్క్‌లో ఇమిడిపోతాయి. సాధారణ హార్డ్‌డ్రైవ్‌ లేదా పెన్ డ్రైవ్‌ కొంతకాలానికే దెబ్బతింటుంది. 

ప్రత్యేకమైన గాజుతో రూపొందిన ఈ డిస్కును మాత్రం తీవ్రస్థాయిలోని ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు, ప్రకృతి విపత్తులు వంటివేవీ దీనిని తాకలేవు. అణు స్థాయిలో ఉండే నానో నిర్మాణాల ద్వారా పరిమాణం, దిశ, స్థానం వంటి ఐదు మార్గాల్లో ఇందులో డేటా స్టోర్‌ అవుతుంది. కోట్ల ఏళ్ల తరువాత కూడా మన కథలను ఈ గాజు డిస్క్‌ ఒక్కటే చెప్తుంది. మొత్తానికి, ఇది ఉత్త గాజు బిళ్ల కాదు, మానవ జ్ఞాపకాలకు కాలాతీత బీమా పథకం! పరిమాణంలో ఇది చిన్నదే గాని, మనుగడలో మాత్రం చిరంజీవి. త్వరలోనే దీనిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మార్కెట్‌లోకి తీసుకురానున్నారు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు