Breaking News

బుల్లి క్రికెట్‌ స్టార్‌ సంచలనం : స్టైలిష్ బ్యాటింగ్‌తో సచిన్‌ ఫిదా

Published on Mon, 04/01/2024 - 13:26

క్రికెట్‌పై  అమ్మాయిలు చూపిస్తున్న ఆసక్తి  మహిళా క్రికెట్‌పై ఆశల్ని మరింత పెంచుతోంది. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ క్రికెట్‌ మహిళలు స్టార్లుగా సత్తా చాటుతున్న నేపథ్యంలో  తాజాగా ఒక సంచలన తార అవతరించడం విశేషంగా నిలిచింది.  తొమ్మిదేళ్లకే  అత్యుత్తమ ప్రతిభతో  ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌గా నిలుస్తోంది. దిగ్గజాలను సైతం అబ్బుర పరుస్తోంది.

ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేస్తూ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను ఆకట్టుకునే స్టైలిష్ బ్యాట్ స్వింగ్‌తో మైదానం నలుమూలలకు బంతిని పరుగులు పెట్టించింది. గొప్ప క్రికెటర్‌గా రాణించాలని కలలు కంటోంది. 

కశ్మీర్‌లోని సోపోర్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలిక హర్మత్ ఇర్షాద్ భట్.  సాధారణ డ్రైవర్‌ కుమార్తె.  బుమై (జైంగీర్)లో రెండో తరగతి చదువుతోంది. ఇటీవల ప్లేగ్రౌండ్‌లో అబ్బాయిల టీంతో ఆడుతూ షాట్‌లు కొడుతున్న  వీడియో సోషల్‌ మీడియాలో వైరలయింది. ఆమె లాంటి పిల్లలు క్రికెట్‌ను ఆస్వాదించడం చూసి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ,  క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్  ఈవీడియోను రీ-ట్వీట్ చేశాడు.  యువత ఆడటం క్రికెట్ ఆడటం చూడటం  తనకు చాలా సంతోషినిస్తోందంటూ ట్వీట్‌చేశారు. దీంతో మరింత వైరల్‌ అయింది. పలువురు ఆమె టాటెంట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

క్రికెట్‌ స్టార్లు  మిథాలీ రాజ్,శిఖర్ ధావన్ తన ఫ్యావరెట్‌ అని చెప్పింది.  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడిన మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్‌ని చూసిన తర్వాత క్రికెట్‌పై ఆసక్తిని పెంచుకుందట. అంతేకాదు చాలా కాలంగా ఈ ప్లేగ్రౌండ్‌లో ఆడతానని తన కిష్టమైన షాట్ కవర్ డ్రైవ్ అని, తన తాతయ్యతో కలిసి ఆడేదాన్నని చెప్పుకొచ్చింది.  ఉదయం 8 గంటలకు ప్రాక్టీస్‌ షురూ. జాసిమ్ భట్, అర్సలాన్, ఫైసల్, ఫయీజ్, ఇఖ్లాక్ , ఇతర అబ్బాయిలతో పోటీ పడి ఆడుతుంది.

‘‘సచిన్ సర్ నా వీడియోను షేర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను, ” హర్మత్‌.

భారత జట్టులోకి ఎంపికై మిథాలీ రాజ్‌తో మ్యాచ్ ఆడాలని హర్మత్ కలలు కంటోంది. ఇక్కడ చాలా టాలెంట్ ఉంది కానీ తగిన గుర్తింపు లభించడం లేదని, శిక్షణకోసం అకాడమీలు లేవంటూ స్థానికులు  తౌసీఫ్ అహ్మద్ వ్యాఖ్యానించారు హర్మత్‌ తరహాలో క్రీడాకారులకు క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించాలని గ్రామస్తులు కోరారు.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)