Breaking News

వారసత్వ వేడుక..'జుట్టు విప్పే ఆచారం'!: సోనమ్‌ కపూర్‌

Published on Wed, 02/11/2026 - 16:08

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనమ్‌కపూర్‌  త్వరలో తల్లి కానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ నటుడి అనిల్‌ కపూర్‌ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సోనమ్‌ ..కెరీర్‌ మంచి పీక్స్‌లో ఉండగానే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ అహుజను 2018లో పెళ్లి చేసుకుంది. ఈ జంట 2022లో మొదటి బిడ్డ వాయును స్వాగతించారు. ఇక గతేడాది నవంబర్‌లోనే సోనమ్‌ రెండోసారి అమ్మను కాబోతున్నట్లు ప్రకటించింది. 

ఈ నెల ఫిబ్రవరి 8నబాలీవుడ్‌ అతిరథుల నడుమ సోనమ్‌ సీమంతం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వేడుక తాలుకా వీడియోని షేర్‌ సుకుంటూ..సీమంతం తంతు గురించి చాలా భావోద్వేగంగా పోస్ట్‌లో రాసుకొచ్చింది. అంతేగాదు ఆ ఈవెంట్‌ ఎంతలా భారతీయ సంప్రదాయపద్ధతిలో జరిగిందో కూడా వివరించింది.

కాబోయే తల్లి సోనమ్‌ తన సీమంతం వేడుక వీడియోని షేర్‌ చేస్తూ..పురాతన వేద సాంప్రదాయంలో పాతుకుపోయిన ఈ ఆచారం గురించి చాలా గొప్పగా రాసుకొచ్చింది పోస్ట్‌లో. ఆ రోజు తనకెంతో ముఖ్యమైనదే గాక స్రీ జీవితంలోనే అత్యంత ప్రాముఖ్యమైనదిగా పేర్కొంది. 40 ఏళ్ల సోనమ్‌ సీమంతం అనేది సనాతన ధర్మంలోని పదహారు పవిత్ర సంస్కారాలలో మూడవదిగా వెల్లడించింది. దీన్ని 'జుట్టు విప్పే ఆచారం'గా పిలుస్తారని, నవమాసాలు బిడ్డను మోసే తల్లి గౌరవార్థం జరిపే వేడుకగా పేర్కొంది. దీన్ని మన భారతదేశంలో  పలు ప్రాంతాల్లో పలు పేర్లతో పిలుస్తారంటూ సవివరంగా వెల్లడించింది. 

ఈ సీమంతం వేడుకను ఉత్తరాన గోధ్ భారాయ్ అని,  దక్షిణాన వాలైకప్పు, మహారాష్ట్రలో దోహలే జెవాన్ వంటి పేర్లతో పిలుస్తారని చెప్పుకొచ్చింది. ఎన్ని విభిన్న పేర్లతో పిలిచినా..ఈ అందమైన భావం స్త్రీ జీవితలోని అత్యంత అపురూపమైన క్షణంగా పేర్కొంది. ఇది ప్రేమ, రక్షణ, కొత్త జీవితంల వేడుకగా అభివర్ణించింది. సోనమ్‌ షేర్‌ చేసిన వీడియోలో వేదమంత్రాల నడుమ స్వీట్లను తినిపించడం, కుటుంబం, స్నేహితులతో గడిపే మధురమైన క్షణం అని చెబుతోంది. 

కాగా, ఈ సీమంతం వేడుక అనిల్‌ కపూర్‌ విలాసవంతమైన బంగ్లాలో జరిగింది. అక్కడ ఈ వేడుక కోసం బంగ్లాని అధునాత డిజైన్‌తో పవిత్ర భారతీయ చిహ్నలను మిళితం చేస్తూ..పూల అభయారణ్యంగా, ఆధ్యాత్మికతకు నెలవుగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఆ వేడుకలో ముఖ్యంగా నాటి కాలాన్ని గుర్తుచేసేలా దీప స్థంభం అత్యంత హైలెట్‌గా నిలిచింది. ఇంతలా అంగరంగ వైభవంగా ఈ సీమంతం వేడుకను జరిపినందుకు తన తల్లి, అత్తగారు, సోదరి రియా కపూర్‌లకు పోస్ట్‌లో కృతజ్ఞతలు తెలిపింది.

 

(చదవండి: అంతర్జాతీయ మోడల్‌గా సివిల్‌ ఇంజనీర్‌..! ఒక్క రోజుకే..)

 

Videos

Konaseema : భారీ అగ్ని ప్రమాదం సిలిండర్ పేలి 10 ఇల్లు అగ్నికి ఆహుతి

ఇప్పుడు అందరినోటా ఈ అమ్మాయి మాటే..

ఇక పై హీరోయిన్ శ్రీలీల కాదు.. డాక్టర్ శ్రీలీల..!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఇవాళ రేట్లు ఎంతంటే..?

ఖానామెట్ లో హైడ్రా కూల్చివేతలు అడ్డుకుంటున్న స్థానికులు, తీవ్ర వాగ్వాదం

కూటమి కుట్ర... అంబటికి మరోసారి 14 రోజుల రిమాండ్

మా ప్రభుత్వ హయాంలో ఎలాంటి తప్పు జరగలేదు: లేళ్ల అప్పిరెడ్డి

Tadepalli: చిన్నారికి YS జగన్ అక్షరాభ్యాసం

21 ఏళ్ల బంధం.. ఎప్పటికీ మధురమే.. నమ్రత ఎమోషనల్ పోస్ట్..!

బన్నీ గురించి చెబుతూ ఏడ్చేసిన యాంకర్ స్రవంతి

Photos

+5

హీరోయిన్ స్నేహ బిజినెస్‌.. సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

థాయ్‌లాండ్‌లో ఎంజాయ్ చేస్తోన్న ఐశ్వర్య రాజేశ్‌ (ఫొటోలు)

+5

'హే భగవాన్‌' మూవీ ట్రైలర్‌ లాంచ్ (ఫొటోలు)

+5

మహారాణిలా మెరిసిపోతున్న హీరోయిన్‌ నభా నటేష్ (ఫొటోలు)

+5

'స్వయంభు' మూవీ ప్రెస్‌మీట్‌లో మెరిసిన హీరోయిన్‌ సంయుక్త మీనన్ (ఫొటోలు)

+5

అరేబియా సముద్ర తీరాన ఉన్న ఈ శివుడు ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : ఘనంగా గుణదల మేరీమాత ఉత్సవాలు (ఫొటోలు)

+5

శ్రీ కాళహస్తీలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

శ్రీశైలం నడకదారి.. భక్తుల రద్దీ (ఫోటోలు)