Breaking News

తెల్ల గులాబీలా హీరోయిన్‌.. వాచ్‌ ధర అన్ని లక్షలా?!

Published on Thu, 01/30/2025 - 17:21

బాలీవుడ్‌ నటి సోనమ్ కపూర్ అహుజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్‌లో ఆమె ఒకరు. నేషనల్‌ ఫీల్మ్‌ అవార్డుతో సహా పలు ఫిల్మ్‌​ ఫేర్‌ అవార్డులు అందుకున్న నటి. అలాగే ఫోర్బ్స్‌ మ్యాగ్జైన్‌లో 2012, 2016లలో అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. అంతేగాదు ఆమె ఇల్లు కూడా భారతీయ వారసత్వ కళకు అద్దం పట్టేలా అత్యంత అందంగా ఉంటుంది. 

ఫ్యాషన్‌ పరంగా కూడా సోనమ్‌కి సాటి లేరెవ్వరూ. అంతలా ఆమె ఫ్యాషన్‌ వార్డ్‌ రోబ్‌లో బ్రాండెడ్‌ ప్రొడక్ట్స్‌ కలెక్షన్‌ భారీగానే ఉంటుంది. సందర్భానుసారంగా డ్రెస్సింగ్‌ స్టైల్‌ అందుకు తగ్గ యాక్సెసరీలు ధరిస్తారామె. తాజాగా ఆమె ధరించి వాచ్‌ చూస్తే కళ్లు చెదిరిపోతాయి. దాని ధర కూడా అంతేస్థాయిలో అవాక్కయ్యేలా ఉంటుంది. మరీ ఆ వాచ్‌ విశేషాలేంటో సవివరంగా చూద్దామా..!.

సోనమ్ కపూర్(Sonam Kapoor) ఇటీవల పారిస్ ఫ్యాషన్ వీక్‌(Paris Fashion Week)లో జరిగిన ఎలీ సాబ్ హాట్ కోచర్ షో(Elie Saab haute couture show)కు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌ కోసం ఆమె ఉల్లాసభరితమైన ఆల్-వైట్ లుక్‌లో మైమరిపించింది. ఆమె పీస్‌ఫుల్‌ డ్రెస్సింగ్‌ వేర్‌ మనసుకు ఆహ్లాదంగా కనుచూపుని తిప్పుకోని విధంగా ఉంది. 

ముఖ్యంగా ఆమె చేతికి ధరించిన వాచ్‌  అందరి దృష్టిని ఆకర్షించింది. నటి హై-ఎండ్ వాచ్ - పియాజెట్ లైమ్‌లైట్ గాలా ప్రెషియస్ రెయిన్‌బోని ధరించింది. దీన్ని పూర్తిగా విలువైన రంగు రాళ్లతో డిజైన్‌ చేశారు. అచ్చం రెయిన్‌ బో కలర్స్‌ మాదిరిగా ధగ ధగ మెరుస్తూ ఉంటుంది ఈ వాచ్‌. బ్రాస్‌లెట్‌ మాదిరిగా ఉన్న ఈ వాచ్‌ ధర దగ్గర దగ్గర రూ. 94 లక్షలు పైనే అంటే.. రూ. 1 కోటి పలుకుతుందట. 

1973ల నాటి వింటేజ్ పీస్ అయినా ఈ వాచ్‌ మరోసారి ఫ్యాషన్‌ ప్రియుల మనుసుని దోచుకునేలా హైలెట్‌గా నిలిచింది. ఇక సోనమ్‌ తన సోదరి, స్టైలిస్ట్ చిత్ర నిర్మాత రియా కపూర్ డిజైన్‌ చేసిన డ్రెస్‌ని ధరించారు. ఆ డ్రస్‌కి తగ్గట్టు సన్‌గ్లాసెస్‌, గులాబీ ఆకారపు చెవిపోగులు, స్టేట్మెంట్‌ రింగులు, ఈ లగ్జరీ వాచ్‌తో రాయల్టీగా కనిపించారు సోనమ్‌. 

 

(చదవండి: 61 ఏళ్ల వయసులో బరువు తగ్గిన నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ.. జస్ట్‌ ఐదు నెలల్లోనే..)
 

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)