Breaking News

శోభిత ధూళిపాళ, నాగచైతన్య పెళ్లి సందడి : హాట్ టాపిక్‌గా శోభిత పెళ్లి చీర

Published on Tue, 11/19/2024 - 11:01

టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎవైటింగ్‌ వెడ్డింగ్‌ అంటే  హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళదే. ఈ లవ్‌బర్డ్స్‌ వచ్చే నెల(డిసెంబర్ 4, 2024న) మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను ఇరు కుటుంబాలు  జోరుగా  చేస్తున్నాయి. ఇప్పటికే నాగ చైతన్య , శోభితా వివాహ ఆహ్వాన పత్రం కూడా  ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. మరోవైపు శోభితా  పెళ్లి చీర, షాపింగ్‌ వివరాలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. 
 
తన జీవితంలో అతి ముఖ్యమైన  ఈరోజుకోసం  శోభిత చాలా ఉత్సాహంగా ప్లాన్‌ చేసుకుంటోంది.  తాజా నివేదికల ప్రకారం ఎలాంటి డిజైనర్‌ లేకుండానే  తెలుగు వారసత్వాన్ని చాటుకునేలా స్వయంగా తానే దుస్తులను ఎంపిక చేసుకుంటోందట శోభితా ధూళిపాళ. ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో అమ్మతో కలిసి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో షాపింగ్‌లో బిజీబిజీగా గడుపుతోంది.  తన పెళ్లిలో ప్రతిదీ ఖచ్చితంగా ఉండేలా ప్లాన్‌ చేసుకుంటోందట. పెళ్లి రోజు కోసం ప్యూర్‌ గోల్డ్‌ జరీతో నేసిన కంజీవరం పట్టుచీరలో అందంగా మెరిసిపోనుంది. అలాగే కాబోయే వరుడు నాగ చైతన్య కోసం కూడా మ్యాచింగ్ సెట్‌ను సెలెక్ట్‌ చేసినట్టు తెలిప్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని పొందూరులో నేసిన తెల్లటి ఖాదీ చీరను కూడా కొనుగోలు చేసిందట.

కాగా ఇటీవల నిశ్చితార్థ వేడుకలు పసుపు  దంచడం లాంటి కీలకమైన వేడుకల్లో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా శోభితా ధూళిపాళ చీరలో అందంగా కనిపించింది. పెళ్లి పనులు మొదలు పెట్టిన సందర్భంలో బంగారు, ఆకుపచ్చ  క్రీమ్ షేడ్స్‌లో, ఆరెంజ్‌ కలర్‌  బార్డర్‌చీరతో కనిపించిన సంగతి తెలిసిందే. 
 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)