Breaking News

నీరు వర్సెస్‌ పాలు: డ్రై ఫ్రూట్స్‌ని ఎందులో నానబెట్టి తీసుకుంటే మంచిది?

Published on Wed, 07/24/2024 - 15:53

డ్రై ఫ్రూట్స్ మన ఆహారంలో అంతర్భాగం. ప్రతిరోజు ఒక పిడికెడు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఈ గుప్పెడు గింజలు ఎన్నో పోషకాలను విటమిన్లను,  ఖనిజాలను అందిస్తాయి. సాధారణంగా డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టి తీసుకుంటాం. వీటిని కొన్ని గంటల ముందు నానబెట్టడం వల్ల సులభంగా జీర్ణమవ్వడమే గాక  శరీరం కూడా ఈజీగా పోషకాలను గ్రహించగలుగుతుంది. అయితే ఈ డ్రైఫ్రూట్స్‌ని నీరు వర్సెస్‌ పాలు మధ్య వేటిలో నానబెడితే ఆరోగ్యకరం అనే విషయానికి వస్తే రుచి, ఆహార ప్రాధాన్యతలను ఆధారంగా చేసుకుని చెప్పాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు.

డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టడం వల్ల వాటి ఆకృతిని పెరుగడమే గాక మృదువుగా ఉండి తినేందుకు వీలుగా ఉంటుంది. ముఖ్యంగా దంత సమస్యలు లేదా జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇటా నానబెట్టడం వల్ల దానిలోని సహజ చక్కెరలు, రుచులను విడుదలై తినేందుకు రుచిగా ఉంటాయి కూడా. అలాగే నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయని చెబుతున్నారు నిపుణులు. ఇది సలాడ్‌ల నుంచి డెజర్ట్‌ల వరకు వివిధ వంటకాలలో ఉపయోగించేందుకు వీలుగా ఉంటుంది. 

నీటిలో నానబెడితే..
నీటిలో నానబెట్టడం వల్ల ఆకృతితోపాటు రచి కూడా పెరుగుతుంది. అదనపు కొవ్వు నివారించాలనుకునే వారికి ఇలా నీటిలో నానబెట్టినవి తీసుకోవడం మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అదీగాక నీటిలో నానబెట్టడం వల్ల అదనపు కేలరీలు లేదా కొవ్వును జోడించదు. పైగా మనకు వాటి సహజ రుచిని పరిచయం చేస్తుంది. కేలరీ కాన్షియస్‌ డైట్‌ అనుసరించాలనుకునే వారికి, బరువుని అదుపులో ఉంచాలనుకునేవారికి ఈ పద్ధతిలో డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవడం ఉత్తమం. 

పాలల్లో నానబెడితే..
పాలల్లో డ్రై ఫ్రూట్స్‌ నానబెట్టడం వల్ల వాటికి మంచి విభిన్న ప్రయోజనాలను పొందొచ్చు. పాలు వాటికి మంచి ఆకృతి, రుచిని అందిస్తాయి. ఇక్కడ పాలు, డ్రైఫ్రూట్స్‌ కలయిక రుచిని మెరుగుపరచడమే గాక ప్రోటీన్‌, కాల్షియం, విటమిన్లు, వంటి అదనపు పోషకాలను అందిస్తుంది. ప్రోటీన్‌ ఎక్కువ తీసుకోవాలనుకునే వారికి పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్‌ తీసుకోవడం మంచిది. పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్‌లో ప్రోటీన్‌, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలు, కండరాలు పనితీరుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. వీటిని పిల్లలు, అథ్లెట్లు, నిర్దిష్ట ఆహార అవసరాలు ఉన్న వ్యక్తులు తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. 

ఏది బెస్ట్‌ అంటే..
జీర్ణక్రియ ప్రభావాన్ని పరిగణలోనికి తీసుకుంటే..నీటిలో నానబెట్టిన డ్రైఫ్రూట్స్‌ తీసుకోవడం మంచిది. అలాగే లాక్టోస్‌ అసహనం లేదా పాలంటే పడనివారికి ఇలా తీసుకోవడమే మంచిది. పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్‌ కంటే నీటిలో నానబెట్టిన డ్రైఫ్రూట్స్‌ జీర్ణమవ్వడం సులభం. అసౌకర్యాన్ని కలిగించే అవకాశం తక్కువ కూడా. చెప్పాలంటే పాలల్లో నానబెట్టిన వాటిల్లో లాక్టోస్‌, కొవ్వుల ఉనికి కారణంగా పొట్టలో భారంగా ఉంటుంది. అలాగే ఎలాంటి జీర్ణ సమస్యలు లేనివాళ్లు సమతుల్య ఆహారంలో భాగంగా పాలల్లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్‌ని మితంగా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండుద. అంతేగాదు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మధుమేహాన్ని నిర్వహించడం తదిర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆయా ఆరోగ్య లక్ష్యాలకు అనుగుణంగా డ్రైఫ్రూట్స్‌ని నీళ్లు లేదా పాల్లలో నానబెట్టి తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

(చదవండి: నటి జాస్మిన్‌ బాస్మిన్‌ ఘటన: కాంటాక్ట్‌ లెన్స్‌ వల్ల కళ్లకు ప్రమాదమా?)
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)